Brain Mapping : అల్జీమర్స్ వ్యాధి అనేది వైద్యులకు ఇప్పటికీ ఓ అంతుచిక్కని ప్రశ్నలాగానే మిగిలిపోయింది. ఆ వ్యాధికి వారు మందులు అందించగలుగుతున్నారు కానీ.. అసలు ఆ వ్యాధి ఎందుకు వస్తుంది అనే విషయంపై మాత్రం పూర్తిగా క్లారిటీ రావడం లేదు. శాస్త్రవేత్తలు ఇప్పటికే అల్జీమర్స్‌పై స్టడీని వేగవంతం చేశారు. తాజాగా ఆ వ్యాధి ఉన్నవారి బ్రెయిన్ సెల్స్‌ను స్టడీ చేయడంతో ఓ విషయం బయటపడింది.
అల్జీమర్స్ వ్యాధి అనేది బ్రెయిన్‌లో రెండు రకాల ప్రొటీన్ ఎక్కువగా ఫార్మ్ అవ్వడం వల్ల వస్తుందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. టా ప్రొటీన్స్ అనేవి బ్రెయిన్ సెల్స్ లోపల ఏర్పడితే.. ఆమలైడ్ బీటా అనే ప్రొటీన్స్ బ్రెయిన్ సెల్స్ బయట ఏర్పడతాయి. కానీ ఈ ప్రొటీన్స్ అనేవి బ్రెయిన్‌ను ఏ విధంగా డ్యామేజ్ చేసి అల్జీమర్స్‌కు కారణమవుతాయనే విషయాన్ని పరిశోధకులు ఇంకా కనుక్కోలేకపోయారు.
అల్జీమర్స్ అనేది ఫస్ట్ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఈ ప్రొటీన్స్ ద్వారా బ్రెయిన్ సెల్స్‌లో ఎలాంటి మార్పులు వస్తాయని శాస్త్రవేత్తలు పరిశీలించారు. స్టార్ మ్యాప్ ప్లస్ అనే టెక్నిక్ ద్వారా బ్రెయిన్ సెల్స్ కదలికలను వారు క్షుణ్ణంగా పరిశీలించడం మొదలుపెట్టారు. బ్రెయిన్ సెల్స్ కదలికలతో ఓ మ్యాప్‌ను వారు ఏర్పాటు చేయగలిగారు. అల్జీమర్స్ ఫస్ట్ స్టేజ్‌ను వారు రెండు విధాలుగా స్టడీ చేశారు.
అల్జీమర్స్ వచ్చినవారిలో ముందుగా బ్రెయిన్‌లోని ప్లేక్‌ను మైక్రోగ్లియా అనే ఇమ్యూన్ సెల్ చుట్టేసినట్టుగా గమనించారు పరిశోధకులు. ఇదే అల్జీమర్స్ వ్యాధికి ముఖ్యా కారణం కావచ్చని వారు తెలిపారు. ఈ మైక్రోగ్లియా న్యూరోడీజెనరేషన్‌కు కూడా కారణమవుతుందని గమనించారు. అంతే కాకుండా ఈ వ్యాధి సోకిన తర్వాత బ్రెయిన్ లోని మరో రెండు సెల్స్‌పై షెల్స్‌లాగా ఏర్పడినట్టుగా వారు గుర్తించారు. ఈ రెండు మార్పులను గమనించిన పరిశోధకులు.. వీటిపై మరింత లోతుగా పరిశోధనలలు చేయడం వల్ల ప్రస్తుతం ఉన్నట్టుగా కాకుండా అల్జీమర్స్‌కు మరింత మెరుగైన చికిత్స అందించవచ్చని భావిస్తున్నారు.
బ్రెయిల్ సెల్స్‌లోని మార్పులు గమనించడం వల్ల ఇంకా ఈ స్టడీలో పెద్దగా ఏ మార్పులు రాలేదని, దీనిపై పూర్తిగా అవగాహన రావాలంటే మరింత సమయం పడుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. బ్రెయిన్‌లోని సెల్స్‌ను మ్యాపింగ్ చేయడానికి ఉపయోగపడిన స్టార్ మ్యాప్ టెక్నిక్‌లో సాయంతో కో మ్యాపింగ్ సులువుగా అయిపోతుందని వారు అన్నారు. ముఖ్యంగా ప్రొటీన్ వల్లే అల్జీమర్స్ వస్తుందని వారు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.