EPAPER
Kirrak Couples Episode 1

Robot:పిల్లల సామర్థ్యాన్ని బయటకు తీసే రోబోలు..

Robot:పిల్లల సామర్థ్యాన్ని బయటకు తీసే రోబోలు..

Robot:పిల్లల చదువు విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని శాస్త్రవేత్తలు, వైద్యులు ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తూనే ఉంటారు. అయినా కూడా అందరు పిల్లలు ఒకేలా ఆలోచించరు కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా చెప్పాల్సి ఉంటుంది. కానీ దాదాపు అందరు పిల్లలు కొత్తగా ప్రయత్నించడాన్ని ఇష్టపడతారు. అందుకే జపాన్ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది.


చుట్టూ ప్రపంచం ఎలా నడుస్తుందో తెలుసుకోవడం కోసం పిల్లలు సైన్స్‌పై సహజంగానే ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. పెరుగుతున్నకొద్దీ ఈ ఆసక్తి తగ్గిపోయే అవకాశం ఉంది. అందుకే సైన్స్‌లో ఈ ఆసక్తి ఎప్పటికీ ఉండేలా ఏం చేస్తే బాగుంటుందని శాస్త్రవేత్తలు ఆలోచించడం మొదలుపెట్టారు. దీనికి సమాధానంగా జపాన్ శాస్త్రవేత్తలు రోబోలను ఉపయోగించమే అని భావించడం మొవలుపెట్టారు.

సైన్స్‌ను మెరుగుపరచడం కోసం, వాటిని అందరికీ దగ్గర చేయడం కోసం జపాన్.. ఎప్పటికప్పుడు సైన్స్ ఈవెంట్స్‌ను ఏర్పాటు చేస్తుంటుంది. అందులో చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ల వరకు అందరూ పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తుంది. వారు ఈ ఈవెంట్‌కు వచ్చి సైన్స్‌కు కావాల్సినంత సమాచారాన్ని తెలుసుకోవచ్చు, అవగాహన పెంచుకోవచ్చు. ముఖ్యంగా పిల్లలను ఈ ఈవెంట్ చాలా ఆకర్షించిందని అక్కడి ప్రభుత్వం గమనించింది.


సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, ఆర్ట్స్, మ్యాథ్స్ వంటి విభాగాలను మెరుగుపరచడానికి జపాన్‌లోని స్కూళ్లలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతుంటాయి. అయితే అందులో భాగంగానే రోబోలను కూడా పిల్లలకు దగ్గర చేయాలని అక్కడి విద్యాసంస్థలు భావిస్తున్నాయి. తోయోహషి యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు గత రెండు దశాబ్దాలుగా పిల్లలకు చదువులో ఉపయోగపడే రోబోలను తయారు చేసే పనిలో నిమగ్నమయ్యుంది.

ముందుగా వారు ము అనే రోబోను తయారు చేసిన చిన్నవయసు ఉన్న విద్యార్థులకు అందించారు. అది వారిని ఎంతగానో ఆనందించేలా చేసింది. దీంతో శాస్త్రవేత్తల మొదటి ప్రయత్నం సూపర్ హిట్ అయ్యింది. టెక్నాలజీ పరంగా ఇది అంత అడ్వాన్స్ రోబో కాకపోయినా.. పిల్లలు మాత్రం దానిని చూడడానికి విపరీతమైన ఆసక్తి చూపించినట్టుగా శాస్త్రవేత్తలు గమనించారు. దాని స్ఫూర్తితోనే వారు రోబోటిక్ ట్రాష్ క్యాన్‌ను కనుగొన్నారు. రోబో తనంతట తానుగా చెత్తను ఏరివేసి అందులో పడేసేలా దీనిని డిజైన్ చేశారు.

రోబోటిక్ ట్రాష్ క్యాన్ డిజైన్‌కు కూడా పిల్లలు ఎంతో ఆసక్తిగా వెల్‌కమ్ చెప్పారు. ఇలా వారు చేసిన ప్రతీ క్రియేషన్ పిల్లలకు నచ్చడంతో శాస్త్రవేత్తలు కూడా వారి సంతోషం ఇంకా ఏమైనా చేయాలని అనుకున్నారు. ఆ ఆలోచనతోనే ‘టాకింగ్ బోన్స్’ అనే ఓ రోబోను తయారు చేశారు. ఇది పూర్తిగా ఒక ఆబ్సెంట్ మైండెడ్ రోబో అని వారు తెలిపారు. పిల్లలు చెప్పిందే తిరిగి చెప్పడం తప్ప ఈ రోబోలో మరే ఫంక్షన్ లేదని శాస్త్రవేత్తలు తెలిపారు.

ఒక్కొక్కసారి టాకింగ్ బోన్స్.. పిల్లలు చెప్పిన విషయంలో కూడా కొన్ని మాటలను మర్చిపోతుంటుంది. అప్పుడు పిల్లలే ఆ రోబోకు గుర్తుచేయడానికి సహాయం చేస్తారు. దీని వల్ల ఎక్కువ వయసున్న పిల్లలకు తమకంటే చిన్నవారికి ఎలా సహాయపడాలి అన్న అంశాన్ని నేర్పిస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మామూలుగా రోబోలు కథ చెప్తూ ఉండుంటే పిల్లలు కూర్చొని వినేవారు కానీ అలా కాకుండా ఇలా చేయడం వల్ల పిల్లలకు ఒక కొత్త అనుభవం కలుగుతుందని వారు అనుకుంటున్నారు.

Tags

Related News

Hyderabad Real Boom: రివర్ వ్యూ.. లేక్ వ్యూ.. తేడా వస్తే ‘రోడ్ వ్యూ’.. ఆ అందాల వలయంలో చిక్కుకుంటే మోసపోతారు.. ఇల్లు కొనేముందు ఇవి తెలుసుకోండి

DSC Results 2024: డీఎస్సీ ఫలితాలను రిలీజ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. కేవలం 56 రోజుల్లోనే!

 Rice Prices: సామాన్యులకు మరో షాక్.. భారీగా పెరగనున్న బియ్యం ధరలు!

Nepal Floods: నేపాల్‌లో వరదలు.. 150 మంది మృతి.. బీహార్‌కు హెచ్చరికలు

PM Modi: తెలంగాణపై ప్రశంసల వర్షం.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

Chicken Rates: మాంసం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన చికెన్ ధరలు!

RTC Electric Buses: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి రానున్న 35 ఎలక్ట్రిక్ బస్సులు

Big Stories

×