EPAPER
Kirrak Couples Episode 1

Antarctica:చైనా ప్లాన్ ఏంటి..? అయోమయంలో శాస్త్రవేత్తలు..

Antarctica:చైనా ప్లాన్ ఏంటి..? అయోమయంలో శాస్త్రవేత్తలు..

Antarctica:అంతరిక్షంపై తమ పరిశోధనలు బలపరచుకోవడానికి చైనా ఎంత దూరమయినా వెళ్లడానికి సిద్ధపడేలా అనిపిస్తోంది. ఇప్పటికే సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలో అమెరికాకు సైతం గట్టి పోటీ ఇస్తున్న చైనా.. మిగత దేశాలు అందుకోనేంత స్పీడ్‌గా ముందుకు వెళ్లాలని చూస్తోంది. అందుకే ఓ కొత్త ప్రయత్నానికి చైనా సన్నాహాలు చేస్తోంది.


రష్యా, అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల తర్వాత తన మనిషిని పరిశోధనల కోసం అంతరిక్షం పంపించిన మూడో దేశంగా చైనా ఇప్పటికే పేరు తెచ్చుకుంది. అయితే మనుషులు జీవించని అంటార్టిక ఖండంలో ఓ గ్రౌండ్ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని చైనా సన్నాహాలు చేస్తున్నట్టుగా అక్కడి మీడియా ప్రచారం చేస్తోంది. ఆ స్టేషన్స్ ద్వారా సముద్రాలను స్టడీ చేసే శాటిలైట్స్‌కు సాయం అందించాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారని ఈ ప్రచురణలో తేలింది.

ఇతర దేశాలపై ఓ కన్ను వేసి ఉంచడానికి చైనా ఏర్పాటు చేస్తున్న ఈ గ్రౌండ్ స్టేషన్స్, మెరుగుపరుస్తున్న శాటిలైట్స్ పనిచేస్తాయేమోనని నిపుణులు అనుమానిస్తున్నారు. 2020 వరకు స్వీడెన్.. చైనాకు గ్రౌండ్ స్టేషన్స్ ఏర్పాటులో సాయంగా ఉండేది. కానీ చైనాలో జియోపాలిటిక్స్ ఎక్కువ అవ్వడంతో స్వీడెన్ ఆ పనికి నిరాకరించింది. దీంతో చైనానే సొంతంగా తమ గ్రౌండ్ స్టేషన్ ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచన చేసినట్టుగా తెలుస్తోంది.


6.53 బిలియన్ డాలర్ల వేలంపాటలో చైనా గెలిచి అంటార్టికాలో గ్రౌండ్ స్టేషన్ ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని సాధించింది. ఈ నిర్మాణం చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ గ్రూప్ కో ఆధ్వర్యంలో జరగనుంది. ఇప్పటికీ ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన టెక్నికల్ సమాచారం ఏదీ బయటికి రాకుండా శాస్త్రవేత్తలు జాగ్రత్తపడ్డారు. ముఖ్యంగా మరైన్ ఎకానమిలో పట్టు సాధించడానికే చైనా ఇదంతా చేస్తుందని చైనా మీడియా అంటోంది. చైనాను ఒక మరైన పవర్‌లాగా మార్చడానికి శాస్త్రవేత్తలు తమ ప్రయత్నం చేయాలని అనుకుంటున్నారట.

స్పేస్‌ను స్టడీ చేయడానికి, స్పేస్‌క్రాఫ్ట్ మెషిన్స్‌ను పరిశీలించడానికి చైనా.. అర్జెంటీనా పాటగానియాలో గ్రౌండ్ స్టేషన్‌ను ఏర్పాటు చేసింది. కానీ అప్పుడు కూడా చైనా మాటలను ఇతర దేశాలు నమ్మలేదు. ఇప్పుడు కూడా అంటార్టికాలో ఏర్పాటు చేస్తున్న గ్రౌండ్ స్టేషన్ వెనుక కూడా ఇంకా ఏదో ఆలోచన ఉంటుందేమో అని నిపుణులు ధృడంగా భావిస్తున్నారు. ఈ విషయంపై చైనా ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

Tags

Related News

Hand Foot Mouth: రాష్ట్రంలో ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ కలకలం.. వ్యాధి లక్షణాలు ఇవే!

Hyderabad Real Boom: ఆ అందాల వలయంలో చిక్కుకుంటే మోసపోతారు.. హైదరాబాద్‌లో ఇల్లు కొనేముందు ఇవి తెలుసుకోండి

DSC Results 2024: డీఎస్సీ ఫలితాలను రిలీజ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. కేవలం 56 రోజుల్లోనే!

 Rice Prices: సామాన్యులకు మరో షాక్.. భారీగా పెరగనున్న బియ్యం ధరలు!

Nepal Floods: నేపాల్‌లో వరదలు.. 150 మంది మృతి.. బీహార్‌కు హెచ్చరికలు

PM Modi: తెలంగాణపై ప్రశంసల వర్షం.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

Chicken Rates: మాంసం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన చికెన్ ధరలు!

Big Stories

×