EPAPER

Kotamreddy : ఇటు కోటంరెడ్డిపై కిడ్నాప్ కేసు.. అటు ఎమ్మెల్యేను బెదిరించిన ఆడియో వైరల్..

Kotamreddy : ఇటు కోటంరెడ్డిపై కిడ్నాప్ కేసు.. అటు ఎమ్మెల్యేను బెదిరించిన ఆడియో వైరల్..

Kotamreddy : ఏపీలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హాట్ టాఫిక్ గా ఉన్నారు. కొన్నిరోజులుగా అన్ని మీడియాల్లో ఆయన వార్తలే ట్రెండింగ్ గా ఉన్నాయి. సొంత పార్టీపై తిరుగుబాటు ఎగురవేసి రోజుకో సంచలన విషయాన్ని బయటపెడుతున్నారు. ఆయన ప్రభుత్వంపై చేసిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి. నేరుగా ప్రభుత్వంలోని పెద్దలపైనే విమర్శనాస్త్రాలు సంధించారు. అటు వైసీపీ అధిష్టానం యాక్షన్ మొదలుపెట్టింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ పదవి నుంచి శ్రీధర్ రెడ్డిని తప్పించింది. ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించింది. వైసీపీ అధిష్టానం నిర్ణయం తర్వాత శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రభుత్వంపై మరింత ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో కోటంరెడ్డిపై జగన్ ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందనే ఉత్కంఠ నెలకొంది. ఇలాంటి సమయంలో కోటంరెడ్డిపై కార్పొరేటర్ విజయ భాస్కర్ రెడ్డి చేసిన ఫిర్యాదుతో కిడ్నాప్ కేసు నమోదైంది.


కోటంరెడ్డిపై కిడ్నాప్ కేసు..
కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అనుచరులతో కలిసి తనను కిడ్నాప్‌ చేయడానికి యత్నించారని విజయ్ భాస్కర్ రెడ్డి ఆరోపించారు. పోలీసులు కథనం ప్రకారం నెల్లూరు 22వ డివిజన్‌ కార్పొరేటర్‌ మూలే విజయభాస్కర్‌ రెడ్డికి శ్రీధర్ రెడ్డి శుక్రవారం ఫోన్‌ చేసి వైసీపీ వీడి తనతో రావాలని కోరారు. అందుకు విజయభాస్కర్‌ రెడ్డి నిరాకరించారు. దీంతో ఎమ్మెల్యే కోటంరెడ్డి తన అనుచరుడు మిద్దె మురళీకృష్ణ యాదవ్, కారు డ్రైవర్‌ అంకయ్యతో కలిసి కార్పొరేటర్‌ ఇంటికి వెళ్లి అంతు చూస్తానంటూ బెదిరించారు. కార్పొరేటర్‌ను బలవంతంగా కారులో ఎక్కించేందుకు ప్రయత్నించగా ఆయన ప్రతిఘటించారు. వారి నుంచి తప్పించుకుని వేదాయపాలెం పోలీసుస్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. కార్పొరేటర్‌ ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే, ఆయన అనుచరుడు, కారు డ్రైవర్‌పై కిడ్నాప్‌యత్నం కేసు నమోదు చేసినట్లు వేదాయ­పాలెం ఇన్‌స్పెక్టర్‌ కె.నరసింహారావు తెలిపారు.

కోటంరెడ్డికి బెదిరింపులు..
అటు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని ఓ వైసీపీ కార్యకర్త బెదిరించిన ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సీఎం వైఎస్ జగన్‌, సజ్జల రామకృష్ణారెడ్డి జోలికి వస్తే.. బండికి కట్టుకుని లాక్కొని వెళ్తానని కడపకు చెంది బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి బెదిరించాడని ఎమ్మెల్యే ఆరోపించారు. కడప నుంచి నెల్లూరు ఎంతో దూరం లేదు 5 నిమిషాల్లో వచ్చి లాక్కొనిపోతాని బెదిరించాడని వెల్లడించారు.‘నీ కథ మొత్తం నాకు తెలుసు. నీ తమ్ముడు నీ కంటే ఎక్కువ మాట్లాడుతున్నాడు. డేట్‌ ఫిక్స్‌ చేసుకో. నీ ఇంటికి వచ్చి కట్టుకుని పోతా’ అంటూ బెదిరించాడని ఎమ్మెల్యే తెలిపారు. తాను సీఎం జగన్ ను ఏమీ అనలేదని చెప్పినా వినకుండా అసభ్య పదజాలంతో దూషించాడని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆరోపించారు.


Related News

Kethireddy: ఇప్పటికైనా నోరు విప్పు జగన్.. ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Vidadala Rajini: మాజీ మంత్రి విడుదల రజనీకి కష్టాలు.. రేపో మారో అరెస్ట్ తప్పదా?

Dussehra Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవుల తేదీలు ఇవే!

YCP vs Janasena: జనసేనలో చేరికలు.. కూటమిలో లుకలుకలు

Big Stories

×