EPAPER
Kirrak Couples Episode 1

k.Viswanath : ఆ సినిమాలకు అవార్డుల పంట.. కళాతపస్వి కెరీర్ లో ప్రత్యేక చిత్రాలివే..!

k.Viswanath : ఆ సినిమాలకు అవార్డుల పంట.. కళాతపస్వి కెరీర్ లో ప్రత్యేక చిత్రాలివే..!

K.Viswanath : కళాతపస్వి కె.విశ్వనాథ్‌ సంగీతం నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రాలు తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశాయి. ‘శంకరాభరణం’, ‘సప్తపది’, ‘స్వాతిముత్యం’, ‘సూత్రధారులు’, ‘స్వరాభిషేకం’.. ఈ ఐదు చిత్రాలకు ప్రత్యేకస్థానం ఉంది. ఈ సినిమాలకు ఎన్నో అవార్డులు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఈ ఐదు చిత్రాలకు జాతీయ అవార్డులను అందించింది.


శంకరాభరణం
ఎలాంటి కమర్షియల్‌ హంగులు లేకుండా సంగీత ప్రధానంగా తెరకెక్కిన దృశ్య కావ్యం ‘శంకరాభరణం’. జె.వి.సోమయాజులు ముఖ్య పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి నాలుగు జాతీయ అవార్డులు వచ్చాయి. బెస్ట్‌ పాపులర్‌ ఫిల్మ్‌ గా స్వర్ణ కమలం కైవసం చేసుకుంది. ఉత్తమ సంగీత దర్శకుడిగా కె.వి. మహదేవన్‌ రజత కమలం అందుకున్నారు. ఉత్తమ గాయకుడిగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం రజత కమలం దక్కించుకున్నారు. ఉత్తమ గాయనిగా వాణీ జయరామ్‌ రజత కమలం అందుకున్నారు.

సప్తపది
కుల వ్యవస్థపై ఎక్కుపెట్టిన అస్త్రంగా రూపొందిన చిత్రం ‘సప్తపది’. జె.వి.సోమయాజులు, సబిత, రవిశంకర్‌, అల్లు రామలింగయ్య ప్రధాన పాత్రల్లో ఈ చిత్రాన్ని కె. విశ్వనాథ్ తెరకెక్కించారు. వివాహం నేపథ్యంలో సంగీత ప్రధానంగా తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కులవ్యవస్థను రూపుమాపాలనే ఆలోచన అందరిలో కలిగేలా చేసింది. ఈ చిత్రానికి జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘నర్గీస్‌దత్త్‌ అవార్డు ఫర్‌ బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్ కింద రజత కమలం వరించింది.


స్వాతిముత్యం
కె.విశ్వనాథ్‌ రూపొందించిన మరో కళాఖండం ‘స్వాతిముత్యం’. చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన స్త్రీకి మళ్లీ వివాహం చేయాలనే ఆలోచన రేకెత్తించిన చిత్రమిది. అమాయకుడి పాత్రలో కమల్‌హాసన్‌ జీవించారు. భర్తను కోల్పోయిన వితంతువుగా రాధిక నటన ప్రేక్షకులను ఎంతోగానో మెప్పించింది. ఈ సినిమాను జాతీయ అవార్డు వరించింది. తెలుగు ఉత్తమ ఫీచర్‌ ఫిల్మ్‌గా రజత కమలం దక్కింది.

సూత్రధారులు
అవినీతి అక్రమాలను ఎదుర్కొనడానికి హింస మార్గం కాదని చాటి చెప్పిన చిత్రం ‘సూత్రధారులు’. అక్కినేని నాగేశ్వరరావు, మురళీమోహన్‌, భానుచందర్‌, రమ్యకృష్ణ, సత్యనారాయణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా విశేష ప్రేక్షకాదరణ పొందింది. ఈ సినిమాకు ఉత్తమ ఫీచర్‌ తెలుగు ఫిల్మ్‌గా జాతీయ అవార్డు దక్కింది.

స్వరాభిషేకం
సంగీత నేపథ్యంలో రూపొందిన ‘స్వరాభిషేకం’ సినిమా విశేష ప్రేక్షకాదరణ పొందింది. కె. విశ్వనాథ్‌ ఈ సినిమాలో పాత్ర పోషించడం విశేషం. శ్రీకాంత్‌, లయ కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాకు ఉత్తమ ఫీచర్‌ ఫిల్మ్‌ కేటగిరిలో జాతీయ అవార్డు దక్కింది. ఉత్తమ సంగీత దర్శకుడిగా విద్యాసాగర్‌ జాతీయ అవార్డును అందుకున్నారు.

కె. విశ్వనాథ్ సినిమాల్లో ఎక్కువ టైటిళ్లు స అక్షరంతో మొదలయ్యేవి. ఇది ఒక సెంటిమెంట్ గా మారింది. ఆ సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. అలాగే కె. విశ్వనాథ్ కు , సంగీతానికి విడదీయరాని అనుబంధం ఉందని ఎన్నో చిత్రాలు నిరూపించాయి. సంగీత నేపథ్యంలో కళాతపస్వి తెరకెక్కించిన చిత్రాలన్నీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. జాతీయ అవార్డులు దక్కిన ఐదు చిత్రాలు ఇదే సెంటిమెంట్ తో రూపొందాయి.

Tags

Related News

Telugu Producer : సెటిల్మెంట్ @ 5 కోట్లు… ఇక DNA టెస్ట్ అవసరం లేదు

Actress Pragathi: అలర్ట్ అయిన ప్రగతి.. తన నంబర్ కాదంటూ కంప్లైంట్..!

Mrunal thakur: అతడిని పరిచయం చేసిన మృణాల్.. ఆగలేకపోతున్న అంటూ పోస్ట్..!

Jani Master Case : అసిస్టెంట్ ని ట్రాప్ చేసింది ఇక్కడి నుంచే…

Jani Master Case : నేరాన్ని అంగీకరించాడా… అంగీకరించాల్సి వచ్చింది..?

Jani Master Case : బిగ్ బాస్ హౌస్ నుంచి విష్ణుప్రియ అవుట్… జానీ కేసుతో ఆమె లింక్ ఇదే..

Tollywood Heroine: రహస్యంగా తల్లికి ఇష్టం లేని పెళ్లి.. కట్ చేస్తే..!

Big Stories

×