EPAPER

K.Viswanath : తొలి సినిమాకే నంది అవార్డు.. కె. విశ్వనాథ్ సినీ ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లు..

K.Viswanath : తొలి సినిమాకే నంది అవార్డు.. కె. విశ్వనాథ్ సినీ ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లు..

K.Viswanath :1965లో ‘ఆత్మగౌరవం’ సినిమాకు కె. విశ్వనాథ్ కు దర్శకుడిగా తొలి అవకాశం లభించింది. తొలి ప్రయత్నంలోనే ఆయన ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఈ సినిమాకు నంది అవార్డు అందుకున్నారు. ఇక దర్శకుడిగా వెనుదిరిగి చూసుకోలేదు. తన ఐదు దశాబ్దాల సినీ ప్రస్థానంలో 50కి పైగా చిత్రాలను తెరకెక్కించారు. బాలీవుడ్‌లోనూ 9 చిత్రాలను రూపొందించారు. సాగర సంగమం, స్వాతిముత్యం, సిరిసిరిమువ్వ, శ్రుతిలయలు, సిరివెన్నెల, ఆపద్బాంధవుడు, శంకరాభరణం లాంటి సినిమాలు కె. విశ్వనాథ్ ఖ్యాతిని ఖండాతారంలాకు వ్యాపించజేశాయి.


తెలుగు సినీ పరిశ్రమకు కొత్తదారి..
సామాన్యమైన కథలను ఎంచుకుని అద్భుతమైన విజయాలు సాధించారు కె. విశ్వనాథ్. తన చిత్రాల్లో సాహిత్యానికి పెద్దపీట వేశారు. ఇలాంటితో కమర్షియల్ హిట్ లు అందుకుని హౌరా అనిపించారు. ఇక విశ్వనాథ్‌ పేరు మరోస్థాయికి తీసుకెళ్లిన చిత్రం శంకరాభరణం. ఈ సినిమా ఆస్కార్‌ చిత్రాల బరిలో నిలిచింది. ఆసియా పసిఫిక్‌ చలన చిత్ర వేడుకల్లో స్వాతిముత్యం, సాగరసంగమం, సిరివెన్నెల చిత్రాలు ప్రదర్శితమయ్యాయి. మాస్కోలో జరిగిన చలన చిత్ర వేడుకల్లో స్వయంకృషి సినిమాను ప్రదర్శించారు. స్వరాభిషేకం చిత్రానికి ప్రాంతీయ విభాగంలో జాతీయ పురస్కారం దక్కింది.

అవార్డులు..
కె. విశ్వనాథ్ ను ఎన్నో అవార్డులు, పురస్కారాలు వరించాయి. 1992లో రఘుపతి వెంకయ్య అవార్డు అందుకున్నారు. అదే ఏడాదిలో పద్మశ్రీ పురస్కారంతో భారత్ ప్రభుత్వం సత్కరించింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆయనను గౌరవ డాక్టరేట్‌తో గౌరవించింది. 2016లో దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు అందుకున్నారు కె. విశ్వనాథ్. ఇలా 5 దశాబ్దాల సినీ ప్రస్థానంలో ఎన్నో విజయాలు సాధించారు. టాలీవుడ్ లో తనంటూ ఒక ప్రత్యేక పేజీ సృష్టించుకున్నారు.


Related News

Ritika Singh: వెంకటేష్ హీరోయిన్ కూడా ఈ రేంజ్ గా చూపిస్తే.. కుర్రాళ్లు తట్టుకోవడం కష్టమే

Devara: కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలంటే ఇదేనేమో.. ఇదెక్కడి అరాచకంరా బాబు

Mirnalini Ravi: ఎట్టకేలకు ఒక ఇంటిదైన హాట్ బ్యూటీ.. తల్లిదండ్రులతో కలిసి..

Akkineni Family: అక్కినేని ఫ్యామిలీ ఫోటోలో ఆ స్టార్ హీరోయిన్ కూతురు.. ఎందుకు ఉన్నట్టు.. ?

Niharika Konidela: ఇంట గెలవలేక రచ్చ గెలవడానికి రెడీ అయిన మెగా డాటర్

Jani Master Case : కాపాడిన కల్తీ లడ్డూ… కొరియోగ్రాఫర్ జానీ సేఫ్..

ANR Award: మెగాస్టార్ కి అవార్డ్.. ఆ రోజే ప్రధానోత్సవం అంటూ ప్రకటించిన నాగ్..!

Big Stories

×