EPAPER

BRS: బీఆర్ఎస్ బిగ్ టార్గెట్.. ఏపీలో కీలక నేతలతో డీల్.. షాకింగ్ చర్చలు

BRS: బీఆర్ఎస్ బిగ్ టార్గెట్.. ఏపీలో కీలక నేతలతో డీల్.. షాకింగ్ చర్చలు

BRS: కేసీఆర్ ఏం చేసినా దానికో లెక్కుంటుంది. ఆ లెక్క వెనుక పెద్ద స్కెచ్చే ఉంటుంది. కామెడీ కోసం పెట్టలేదు బీఆర్ఎస్. సీరియస్ గా పార్టీని విస్తరిస్తున్నారు గులాబీ బాస్. అన్నిరాష్ట్రాలతో పాటు ఏపీపై మరింత ఫోకస్ పెట్టారు. ఇప్పటికే తోట చంద్రశేఖర్, రావెల కిశోర్ బాబు లాంటి పేరున్న నేతలకు బీఆర్ఎస్ కండువా కప్పేశారు. ఇకపైనా పలువురు కీలక నాయకులను పార్టీలోకి లాగేసేందుకు పావులు కదుపుతున్నారు.


లేటెస్ట్ గా బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద పలువురు ఏపీ నేతలతో భేటీ కావడం సంచలనంగా మారింది. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో ఎమ్మెల్యే వివేక్ సమావేశం అయ్యారు. బీఆర్ఎస్ లో చేరాల్సిందిగా చర్చలు జరిపారని తెలుస్తోంది.

అలానే, మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణనూ కలిశారు వివేక్. ఆయనతోనూ బీఆర్ఎస్ లో చేరడంపై మంతనాలు జరిపారు.


గంటా, లక్ష్మీనారాయణనే కాదు.. ఉత్తరాంధ్ర కేంద్రంగా పలువురు నేతలతో వివేక్ టచ్ లోకి వెళ్లాడని సమాచారం. పలువురు విద్యాసంస్థల అధినేతలు, ఉద్యమ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, రిటైర్డ్ ఐఏఎస్ లతో కేసీఆర్ రాయబారిగా ఎమ్మెల్యే వివేకానంద చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఆ మేరకు కొన్ని ఫోటోలు కూడా లీక్ అయ్యాయి.

త్వరలోనే విశాఖలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తోంది. ఆ సభ వేదికగా.. ఏపీ నుంచి పలు షాకింగ్ చేరికలు ఉంటాయని అంటున్నారు. ఆ సభలోగా సాధ్యమైనంత మందికి గాలం వేసేలా.. గులాబీ బాస్ అడుగులు వేస్తున్నారని చెబుతున్నారు.

ప్రధానంగా కాపు, వైశ్య, బలిజ వర్గాలే టార్గెట్ గా చేరికలు ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఏపీలో రాజకీయ సమీకరణాలను తారుమారు చేసే సత్తా ఉన్నా.. ఆ వర్గాలను కలుపుకుని.. ఏపీలో బీఆర్ఎస్ కారును టాప్ గేర్ లో డ్రైవ్ చేయాలని చూస్తున్నారు.

అయితే, బీఆర్ఎస్ అయితే ఆఫర్ ఇస్తోంది కానీ.. చేరేందుకు చాలామంది సిద్ధంగా లేరని అంటున్నారు. ఎమ్మెల్యే వివేక్ తో భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ తేల్చి చెప్పేశారు. ఏదో పెళ్లిలో కలిస్తే.. క్యాజువల్ గా ఇంటికి పిలిచానని.. అంతేగానీ వేరే మేటర్ ఏమీ లేదంటూ లైట్ తీసుకోమన్నారు.

లక్ష్మీనారాయణ సరే.. మరి, అదే వివేక్.. గంటాతోనూ భేటీ కావడం.. ఒకేరోజు ఇద్దరు నేతలతో వేరువేరుగా చర్చలు జరపడం.. కాకతాళీయంగా జరిగిందేనా? రాజకీయం లేకుండా ఉంటుందా? అనే అనుమానం వ్యక్తం అవుతోంది. మరోవైపు, ఈస్థాయి నేతలతో చర్చలకు వివేక్ లాంటి సాధారణ ఎమ్మెల్యేను కేసీఆర్ పంపించి ఉండకపోవచ్చని కూడా అంటున్నారు. ఏది ఏదైనా.. ఏపీలో బీఆర్ఎస్ తరఫున ఏదో జరుగుతోందనేది మాత్రం వాస్తవం.

Related News

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు విప్పు జగన్.. ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Vidadala Rajini: మాజీ మంత్రి విడుదల రజనీకి కష్టాలు.. రేపో మారో అరెస్ట్ తప్పదా?

Big Stories

×