EPAPER

YSRCP: కోటంరెడ్డిపై వేటు.. ఆదాలకు ఛాన్సు.. జగన్ యాక్షన్ షురూ..

YSRCP: కోటంరెడ్డిపై వేటు.. ఆదాలకు ఛాన్సు.. జగన్ యాక్షన్ షురూ..

YSRCP: అనుకున్నట్టే అయింది. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై యాక్షన్ మొదలైంది. నెల్లూరు రూరల్ వైసీపీ ఇంచార్జ్ బాధ్యతల నుంచి కోటంరెడ్డిని తప్పించారు జగన్. ఆయన స్థానంలో ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని ఇంచార్జిగా నియమించారు.


జస్ట్ ఇంచార్జిని చేయడమే కాదు.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున నెల్లూరు రూరల్ నుంచి ఆదాలనే పోటీ చేస్తారంటూ ఇప్పుడే ప్రకటించారు సజ్జల. అంటే, ఇక కోటంరెడ్డికి కంప్లీట్ గా చెక్ పెట్టినట్టే.

ఎమ్మెల్యే కోటంరెడ్డి ఎపిసోడ్ మూడు రోజులుగా తీవ్ర కలకలం రేపుతోంది. వైసీపీ అధిష్టానాన్ని షేక్ చేస్తోంది. తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారంటూ.. మీడియా సమావేశంలో సాక్షం కూడా చూపించారు. ఇకతాను వైసీపీ తరఫున పోటీ చేయనని.. టీడీపీ నుంచి బరిలో దిగుతానని తేల్చి చెప్పారు.


ఫోన్ ట్యాపింగ్ తామెందుకు చేస్తామంటూ వైసీపీ నేతలు కోటంరెడ్డికి కౌంటర్లు ఇచ్చారు. ఆయన చంద్రబాబుతో డీల్ కుదుర్చుకుని.. పార్టీపై అబాంఢాలు వేస్తున్నారని మండిపడ్డారు.

వరుస ఘటనలపై సీరియస్ గా ఉన్న వైసీపీ అధినేత, సీఎం జగన్.. రెండు రోజులుగా పలువురు మంత్రులు, సలహాదారు సజ్జల, హోంశాఖ, ఇంటెలిజెన్స్ అధికారులతో చర్చలు జరిపారు. చివరాఖరికి ఎమ్మెల్యే కోటంరెడ్డిని.. నెల్లూరు రూరల్ వైసీపీ సమన్వయకర్త బాధ్యతల నుంచి తప్పించారు. ఆయన స్థానంలో ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని పార్టీ అభ్యర్థిగా ప్రకటించేశారు.

Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×