EPAPER
Kirrak Couples Episode 1

Israel: ఎయిర్‌పోర్టులో శిశువును వదిలి వెళ్లిన తల్లిదండ్రులు

Israel: ఎయిర్‌పోర్టులో శిశువును వదిలి వెళ్లిన తల్లిదండ్రులు

Israel: చిన్నపిల్లలను తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకుంటారు. వారికోసం ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక ప్రయాణాల్లో మరింత అప్రమత్తంగా ఉంటారు. ముందు నుంచే ఏర్పాట్లు చేసుకుంటారు. అయితే ఇజ్రాయెల్‌లో మాత్రం ఇందుకు భిన్నంగా ఓ ఘటన జరిగింది. ఇమ్మిగ్రేషన్ అధికారులు టికెట్ అడిగారని ఓ జంట తమ శిశువును ఎయిర్‌పోర్ట్‌లోని చెక్‌ఇన్ వద్ద వదిలి వెళ్లింది.


టెల్ అవివ్ నుంచి బ్రుసెల్స్‌కు వెళ్తున్న ఓ జంట తమ శిశువును తీసుకొని ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. ర్యాన్ ఎయిర్‌వేస్ నిబంధనల ప్రకారం శిశువుకు కూడా టికెట్ కొనాల్సిందే. ఈక్రమంలో చెక్‌ఇన్ వద్ద సిబ్బంది శిశువుకు కూడా టికెట్ అడగడంతో ఆగ్రహానికి గురైన ఆ జంట స్టోలర్‌లో ఉన్న శిశువును చెక్‌ఇన్ వద్దే వదిలేసి వెళ్లిపోయింది.

ఆ తర్వాత విమానం ఎక్కేందుకు ప్రయత్నించగా.. అధికారులు వారిని అడ్డుకున్నారు. వారిని అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించారు. శిశువును ఎయిర్‌పోర్టులో వదిలివెళ్లేందుకు ప్రయత్నించినందుకుగానూ ఆ జంటను పోలీసులు అరెస్ట్ చేశారు.


Tags

Related News

Elections: టెన్షన్ టెన్షన్… మరికొద్ది సేపట్లోనే ఆ ఎన్నికల ఫలితాలు..

Israel vs Iran War: పేజర్లు, వాకీటాకీలు, రాకెట్ లాంచింగ్ సైట్స్.. అసలు సినిమా ముందుందా ?

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Big Stories

×