EPAPER

KotamReddy: కట్టప్పలు పార్టీని వీడుతారా? మంత్రి పోస్టు కోసం చంద్రబాబుతో డీల్!.. కోటంరెడ్డికి కౌంటర్లు

KotamReddy: కట్టప్పలు పార్టీని వీడుతారా? మంత్రి పోస్టు కోసం చంద్రబాబుతో డీల్!.. కోటంరెడ్డికి కౌంటర్లు

KotamReddy: నిన్నటి వరకూ వారంతా కలిసే ఉన్నారు. అన్న, భయ్యా, బ్రదర్స్ అంటూ సరదాగా మాట్లాడుకునేవారు. ఒక్క ఎపిసోడ్ తో సీనంతా మారిపోయింది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. సీఎం జగన్ పై రెబెల్ జెండా ఎగరేశారు. నా ఫోనే ట్యాప్ చేస్తారా.. అంటూ వైసీపీ నుంచి పోటీ చేసేది లేదంటూ తేల్చి చెప్పారు. టీడీపీ తరఫున బరిలో దిగుతానని కూడా అన్నారు. ఫోన్ ట్యాపింగ్ పై కేంద్రానికి ఫిర్యాదు చేస్తానని కూడా వార్నింగ్ ఇచ్చారు.


ఇన్నేసి మాటలు అంటే.. జగనన్న ఊరుకుంటారా? వెంటనే సీనియర్ నేతలతో భేటీ అయ్యారు. కోటంరెడ్డిని ఏం చేద్ధాం అని చర్చించారు. వెంటనే నెల్లూరు రూరల్ ఇంఛార్జిగా కోటంరెడ్డిని మార్చేయాలని నిర్ణయించారు. సీఎం జగన్ తో మీటింగ్ ముగిశాక.. మాజీ మంత్రి పేర్ని నాని మీడియా ముందుకు వచ్చారు. కోటంరెడ్డిని ఫుల్ గా కార్నర్ చేశారు.

సానుభూతి కోసమే ఎమ్మెల్యే కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేస్తున్నారని పేర్ని నాని మండిపడ్డారు. కోటంరెడ్డిది అవకాశవాదమని.. టీడీపీలో చేరేందుకే ఇలాంటి విమర్శలు చేస్తున్నారని అన్నారు. జగన్ కు కట్టప్పలుగా ఉన్న తాము పార్టీని వీడుతామా? తన ఫోన్ ట్యాప్ చేస్తే తాను వైసీపీని వీడుతానా? వీడనుగా.. మరి కోటంరెడ్డి కేవలం ఫోన్ ట్యాపింగ్ కారణంగా పార్టీని కాదనుకోవడం ఏంటి? అని ప్రశ్నించారు.


ఫోన్ ట్యాపింగ్ చేయడం కుదరని పని అన్నారు పేర్ని నాని. ఫోన్ ట్యాపింగ్ చేసేందుకు వాడే పెగాసస్ సాఫ్ట్ వేర్ ను చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కొనలేదని చెప్పారు.. అలాగే, అప్పటి ఐబీ చీఫ్ ఏబీ వెంకటేశ్వర్లు సైతం పెగాసస్ కొనలేదని ఒప్పుకున్నారు. ఇప్పుడు తాము కూడా పెగాసస్ కొనలేదు.. మరి, కోటంరెడ్డి ఫోన్ ట్యాప్ చేయడం ఎలా సాధ్యం? అంటూ లాజిక్ పాయింట్ తీసుకొచ్చారు పేర్ని నాని. ఇదంతా మంత్రి పదవి రాలేదనే అక్కసుతోనే ఇలా చేస్తున్నారని కోటంరెడ్డిని విమర్శించారు నాని.

మరోవైపు, మరో మాజీమంత్రి కొడాలి నాని సైతం ఎమ్మెల్యే కోటంరెడ్డిపై విరుచుకుపడ్డారు. మంత్రి పదవి రాలేదనే కోటంరెడ్డి పార్టీపై అబాంఢాలు వేస్తున్నారని మండిపడ్డారు. చాలా మంది రెడ్లకు జగన్ మంత్రి పదవులు ఇవ్వలేకపోయారని అన్నారు. చంద్రబాబు తమ పార్టీలోకి వస్తే మంత్రి పదవి ఇస్తానని అనిఉంటాడని.. అందుకే కోటంరెడ్డి టీడీపీలోకి వెళ్లాలనే ఇలాంటి వివాదం తీసుకొచ్చారని చెప్పారు. చంద్రబాబు గెలిచేది లేదు.. కోటంరెడ్డికి మంత్రి పదవి వచ్చేది లేదంటూ కొడాలి నాని ఎద్దేవా చేశారు.

Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×