Science and Technology Aims:సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంత పెరుగుతున్నా.. ఇప్పటికే ప్రపంచంలో పలుచోట్ల ఆకలి చావులు తప్పడం లేదు. తినడానికి కనీసం ఆరోగ్యకరమైన ఆహారం లేకుండా జీవనం సాగిస్తున్నవారు చాలామంది ఉన్నారు. ఎన్నో రంగాలను అభివృద్ధి చేస్తున్న సైన్స్ అండ్ టెక్నాలజీ.. ఇప్పుడు ఫుడ్ సెక్టార్‌పై దృష్టిపెట్టింది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తయారు చేసి ఆకలి చావులు తగ్గించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది.
ఒక పంట పండించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. విత్తనం వేయడం గురించి ఆహారం మన చేతికి వచ్చేవరకు ఎంతో ప్రక్రియ జరుగుతుంది. ఫుడ్ సిస్టమ్ అనేది ఇప్పుడు పూర్తిగా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల నిర్ణయంగా మారింది. వారు చెప్పినట్టుగానే ఏ పంట వేయాలి, ఎప్పుడు వేయాలి అనే నిర్ణయాన్ని రైతులు తీసుకుంటున్నారు. అందుకే మనం ఏం తినాలనుకుంటున్నామని అనే నిర్ణయం పరోక్షంగా మరొకరు తీసుకుంటున్నట్టుగా ఉంది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఫుడ్ సిస్టమ్ స్థిరంగా లేదు. తొమ్మిదిమందిలో ఒకరు ఆకలి చావుకు గురవుతున్నారు. ఇక కోవిడ్ తర్వాత ఈ పరిస్థితి మరీ దయనీయంగా మారింది. ప్రస్తుతం ఉన్న ఆహారంలో న్యూట్రిషన్స్ లేకపోవడంతో పాటు ఒబిసిటీ వంటి వ్యాధులకు బారినపడడానికి కూడా కారణమవుతున్నాయి. దీనికి సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా ఓ పరిష్కారం కనిపెట్టాలని పరిశోధనలు జరుగుతున్నాయి.
ప్రపంచంలో ఒకవైపు చాలామంది ఆకలి చావులకు గురవుతుంటే.. మరోవైపు ఎన్నో టన్నుల ఆహారం వృథా అవుతోంది. 3డి ప్రింటింగ్ ద్వారా ఈ వేస్ట్ అయిన ఆహారంతో మరికొన్ని ఆహార వనరులను తయారు చేయవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. ప్రస్తుతం కొన్ని రకాల పంటలను మాత్రమే ఎక్కువగా పండిస్తున్నారు. అలా కాకుండా అన్ని రకాల పంటలను పండిస్తే అన్ని విధాల ఆహార పదార్థాలు మనుషులకు అందుతాయి. దాన్నే ఫుడ్ డైవర్సిఫికేషన్ అంటారు. ఇలా చేయడం ద్వారా చాలావరకు అందరికీ ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన ఆహారం లభించే అవకాశం ఉందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.