EPAPER
Kirrak Couples Episode 1

Night Lamp:అర్థరాత్రి కూడా దీపారాధన చేసే ఆలయం ఇదొక్కటే!

Night Lamp:అర్థరాత్రి కూడా దీపారాధన చేసే ఆలయం ఇదొక్కటే!

Night Lamp:కేరళలోని తిరువరపు శ్రీ కృష్ణ దేవాలయం. గ్రహణం సమయంలో కూడా తెరిచే ఉంచుతారు. అర్ధరాత్రి ఏకాంతసేవ తర్వాత కూడా దీపారాధన చేసే ప్రపంచంలోని అరుదైన హిందూ దేవాలయంగా పిలుస్తారు.ఇక్కడి కృష్ణపరమాత్మ మూర్తి చాలా ఆకలితో ఉంటారు. ఇక్కడ అర్చకులు రోజుకు 7 సార్లు స్వామికి మహా నైవేద్యాన్ని సమర్పిస్తారు. సమర్పించిన నైవేద్యం కొంచెం తగ్గడం తరుచుగా గమనిస్తుంటారు. స్వామివారే స్వయంగా తింటారు అని ఇక్కడి భక్తుల విశ్వాసం.


గుడి తెల్లవారుజామున 2 గంటలకు తెరుస్తారు. సాధారణంగా అన్ని దేవాలయాలలో అభిషేకం, అలంకరణ అనంతరం స్వామివారికి నైవేద్యం సమర్పిస్తారు. కానీ ఈ గుడిలో నైవేద్యం నివేదన చేసిన తర్వాత అభిషేకం, అలంకరణ చేస్తారు. నైవేద్యం సమర్పించడంలో కొంత ఆలస్యమైనా, ఆలయ ప్రధాన ద్వారం తెల్లవారుజామున తెరవకపోయినా చాలా దోషంగా భావిస్తారు. అందుకే ప్రధాన అర్చకుడి చేతిలో గొడ్డలి పట్టుకుంటారు. ఒకవేళ తాళం పనిచేయకపోయినా, పోయినా, గొడ్డలితో పగలకొట్టడం ముందే ఏర్పాట్లు చేసి ఉంచుతారు.

కృష్ణుడికి చేసే నైవేద్యం చాలా రుచిగా ఉంటుంది. స్వామికి నివేదించిన అనంతరం భక్తులందరికీ ప్రసాదం పంచుతారు. ప్రసాదం తీసుకోకుండా ఏ భక్తుడూ ఆకలితో వెళ్ళకూడదని ఇక్కడి నియమం. కృష్ణుడికి సమర్పించే నైవేద్యం ఆలస్యమైతే ఆకలికి తట్టు కోలేక కడుపు ఖాళీ అవ్వడంతో స్వామివారి నడుము చుట్టూ కట్టిన ఆభరణం వదులై నాలుగైదు ఇంచులు కిందకి దిగడం ఈ ఆలయంలో మాత్రమే జరుగుతుంది.


పూర్వం గ్రహణం సమయంలో ఆలయం మూయడం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందట. అందుకే ఈ దేవాలయాన్ని గ్రహణం సమయంలోనే కాదు ఎలాంటి విపత్తు సమయాల్లోను కూడా మూయరు. సంతాన దోషాలు, సర్పదోషాలు, వ్యాపారాలలో నష్ట దోషాలు, వివాహ దోషాలు, బ్రహ్మహత్య వంటి మహాపాతకాలు ఏమున్నా సరే ఇక్కడికి వచ్చి కృష్ణపరమాత్మను దర్శించి, పూజిస్తే దోషాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. ఈఆలయంలో ఇలా సైంటిష్టులకు కూడా అంతుచిక్కని ఎన్నో అద్భుతాలు జరిగాయి. స్వామి వారు ఆభరణం ఎందుకు అలా దిగిపోతుందనేది ఇప్పటికి అంతు చిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది.

Related News

Sarva pitru Amavasya 2024: సర్వ పితృ అమావాస్య నాడు బ్రాహ్మణ విందు ఏర్పాటు చేసి దానం చేస్తే శ్రాద్ధం పూర్తిచేసినట్లే

Horoscope 30 September 2024: నేటి రాశి ఫలాలు.. ఆదాయాన్ని మించిన ఖర్చులు!

Vishnu Rekha In Hand: విష్ణువు రేఖ చేతిలో ఉంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా విజయాలే సాధిస్తారు

Tirgrahi yog 2024 October: త్రిగ్రాహి యోగంలో ఈ 3 రాశుల వారు డబ్బు పొందబోతున్నారు

Lucky Zodiac Sign : 4 రాజయోగాల అరుదైన కలయికతో ఈ 3 రాశుల వారు ధనవంతులు కాబోతున్నారు

October Lucky Zodiac: శని-రాహువు కలయికతో 5 రాశులకు అడుగడుగునా ప్రమాదాలే

October Month Lucky Rashifal: అక్టోబర్ లక్ష్మీ నారాయణ రాజయోగంతో వీరి జాతకం మారబోతుంది

Big Stories

×