EPAPER
Kirrak Couples Episode 1

Telangana : కేటీఆర్ Vs బండి..ముందస్తు ఎన్నికలకు సై అంటే సై..

Telangana : కేటీఆర్ Vs బండి..ముందస్తు ఎన్నికలకు సై అంటే సై..

Telangana : తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు పార్టీలు సై అంటే సై అంటున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్, బీజేపీ నేతలు పరస్పరం సవాళ్లు విసురుకుంటున్నారు. దమ్ముంటే పార్లమెంట్ ను రద్దు చేసి రండి.. మేం అసెంబ్లీ రద్దు చేస్తాం.. ముందస్తు ఎన్నికలకు అందరం కలిసే పోదాం.. అంటూ బీజేపీ నేతలకు కేటీఆర్ సవాల్ విసిరారు. తెలంగాణ నుంచి కేంద్ర రూపాయి తీసుకుని.. తిరిగి రాష్ట్రానికి కేవలం 46 పైసలే ఇస్తోందని.. తాను చెప్పిన ఈ లెక్క తప్పు అయితే రాజీనామాకు సిద్ధమని ఛాలెంజ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్ అని జోస్యం చెప్పారు.


కేటీఆర్ విమర్శలకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు బీజేపీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ముందుస్తు ఎన్నికలకు సిద్ధమని కేసీఆర్ తో కేటీఆర్ చెప్పించాలని కోరారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపైనా బండి సంజయ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. రైతు ఆత్మహత్యల్లో దేశంలో తెలంగాణ నాలుగో స్థానంలో ఉందన్నారు. రైతులకు రైతుబంధు మాత్రమే ఇచ్చి మిగతా సబ్సిడీలను రద్దు చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో 24 గంటల విద్యుత్‌ సరఫరా చేస్తున్నారని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని బండి సంజయ్ స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? అని సవాల్‌ విసిరారు.

తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ ముందస్తు ఎన్నికలకు సిద్ధమని సవాళ్లు విసురుకుంటున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తే తాను అసెంబ్లీకి పోటీ చేస్తానని తెలిపారు. నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ విషయంలో అధిష్టానానిదే తుది నిర్ణయమని స్పష్టంచేశారు. అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో 24 గంటలు కరెంట్ ఇచ్చినట్లు నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని బీఆర్ఎస్ నాయకులకు జీవన్ రెడ్డి సవాల్ విసిరారు. బీఆర్ఎస్ నేతలు ముందుగా కంటి వెలుగు పరీక్ష చేయించుకోవాలని చురకలంటించారు.


మొత్తంమీద తెలంగాణలో ముందస్తు ఎన్నికల అంశం పొలిటికల్ హీట్ ను పెంచేసింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ, కాంగ్రెస్ విమర్శలు ఘూటను పెంచేశాయి. ఈ రెండు పార్టీలు రైతుల సమస్యలనే లేవనెత్తుతూ కేసీఆర్ సర్కార్ ను టార్గెట్ చేస్తున్నాయి. అటు కేంద్రం ప్రభుత్వం తెలంగాణకు ఏం చేసిందని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. మరి ఈ విమర్శలు సంగతి అటు ఉంచితే .. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఉంటాయా? రాజకీయం కోసమే సవాళ్లు చేసుకుంటున్నారా? ముందుస్తు ఎన్నికలపై గులాబీ బాస్ మనసులో ఏముంది?..

Related News

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Bigg Boss8 Day 17 Promo: కొట్టుకు చస్తున్న కంటెస్టెంట్స్.. ఇదెక్కడి గేమ్ రా బాబూ..!

Johnny Master : రంగంలోకి దిగిన మహిళా సంఘాలు… జానీ మాస్టర్ కి ఇక జాతరే..

Boyapati Srinu : అఖండనే ఎండ్..? బోయపాటికి ఛాన్స్ ఇచ్చే వాళ్లే లేరే…?

JD Chakraborty: అవకాశం కావాలంటే పక్క పంచాల్సిందే.. జే.డీ.బోల్డ్ స్టేట్మెంట్ వైరల్..!

Big Stories

×