Romans Concrete:ఈరోజుల్లో ఏర్పాటు చేసిన రోడ్లు, బ్రిడ్జిలు కొన్నిరోజులకే పాడవుతున్నాయని, ఒకప్పుడు చేసిన నిర్మాణాలే ధృడంగా ఉంటున్నాయని చాలామంది వాదన. దానికి ఉదాహరణగా అప్పట్లో చేసిన కోటలు, దేవాలయాలను చూపిస్తారు. అవి ఇప్పుటికీ ఏ మాత్రం చెక్కుచెదరకుండా ఉండడానికి కారణం రోమన్లు అని శాస్త్రవేత్తలు అంటున్నారు. అంతే కాకుండా ఆ నిర్మాణాలు ఇంకా ఎందుకు ధృడంగా ఉన్నాయో వారి పరిశోధనల్లో తేలింది.
అప్పటి రోమన్లను ఇంజనీరింగ్‌లో మాస్టర్లుగా చెప్పుకుంటారు. ఎందుకంటే దాదాపు రెండు శతాబ్దాల వరకు రోమన్లు నిర్మించిన రోడ్లు, కోటలు, పెద్ద పెద్ద భవనాలు చెక్కుచెదరకుండా ఉన్నాయి. వీటిలో చాలావరకు నిర్మాణాలు కాంక్రీటుతోనే జరిగాయి. ఏడి 128 సంవత్సరంలో రోమన్లు వారి దేవుడైన పాంథియన్‌కు ఓ దేవాలయాన్ని నిర్మించారు. కాంక్రీటుతో నిర్మించిన ఈ దేవాలయం ఇప్పటికీ ధృడంగా ఉంది. అంతే కాకుండా వారు నిర్మించిన ఎన్నో బావులు ఇప్పటికీ రోమ్‌కు నీటిని అందిస్తున్నాయి.
ఎన్నో ప్రకృతి విపత్తులు వచ్చినా.. రోమన్లు చేసిన నిర్మాణాలు ఉన్నాయి. అందుకే పరిశోధకులు వాటిపై దృష్టిపెట్టారు. భవనాలు, రోడ్లతో సహా బావులు కూడా ఇన్నేళ్ల వరకు ఎలా ధృడంగా ఉన్నాయి అనే అనుమానం వారిలో మొదలయ్యింది. అసలు ఈ నిర్మాణాలలో వారు ఏ వస్తువులు ఉపయోగించారు అనే అంశం దగ్గర నుండి వారి పరిశోధనలు మొదలయ్యాయి.
ఇన్నాళ్ల తర్వాత శాస్త్రవేత్తల పరిశోధనలకు ఓ సమాధానం దొరికింది. రోమన్లు ఉపయోగించిన కాంక్రీటే ఈ నిర్మాణాల ధృడత్వానికి కారణమని తెలుసుకున్నారు. రోమన్లు కాంక్రీటులో ఏ సమస్య వచ్చిన ధృడంగా ఉండేలా తయారు చేశారని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇన్నాళ్లు ఈ నిర్మాణాల ధృడత్వానికి అగ్నిపర్వతం నుండి వచ్చే బూడిద కారణమని అనుకున్న శాస్త్రవేత్తలు అది అపోహ అని తెలుసుకున్నారు. ప్రస్తుతం ఈ బూడిదనే రోమన్లు నిర్మాణాలలో ఉపయోగిస్తున్నారు.
పురాతన నిర్మాణాలలో తెల్లటి ఖనిజాలను కూడా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇవి కూడా వాటి ధృడత్వానికి కారణమని భావిస్తున్నారు. ఈ తెల్లటి ఖనిజాలు నిమ్మకాయల నుండి వచ్చే లైమ్ క్లాస్ట్స్‌గా వారు గుర్తించారు. ఇది కాంక్రీటులో కలపడం వల్ల అది ధృడంగా మారుతుందని పేర్కొన్నారు. ఈ లైమ్ క్లాస్ట్స్ కాంక్రీటుకు ప్రత్యేకమైన బలాన్ని చేకూరుస్తుందని అన్నారు. ఇలాంటివి ఏవి ఇప్పటి నిర్మాణంలో ఉపయోగించడం లేదని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.
రోమన్లు అప్పట్లో ఉపయోగించిన కాంక్రీటులో సిమెంట్ శాతం తక్కువగానే ఉండేదని శాస్త్రవేత్తలు అంటున్నారు. వారు ఉపయోగించిన కాంక్రీటును ఇప్పుడు ఉపయోగించడం మొదలుపెడితే సిమెంట్ ప్రొడక్షన్ చాలావరకు తగ్గిపోతుందని తెలిపారు. గ్లోబర్ గ్రీన్‌హౌస్ గ్యాస్‌కు సిమెంట్ కూడా ఓ కారణమని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. అందుకే పర్యావరణానికి హాని కలిగించని కాంక్రీటును తయారు చేయడం అవసరమని అన్నారు. ఇంతే కాకుండా రోమన్ల కట్టడాలపై శాస్త్రవేత్తలు మరిన్ని లోతైన పరిశోధనలు చేయాలని నిర్ణయించుకున్నారు.