EPAPER
Kirrak Couples Episode 1

Ahobilam: అహోబిల్లంలో అంతు చిక్కని రహస్యాలు..

Ahobilam: అహోబిల్లంలో అంతు చిక్కని రహస్యాలు..

Ahobilam:అహో అంటే ఒక గొప్ప ప్రశంస.బిలం అంటే బలం అని చెపుతారు.కనుక అహోబిలం అంటే గొప్పదైన బలం అని చెప్పాలి. పురాణాల మేరకు శ్రీమహావిష్ణువు రాక్షసుల రాజైన హిరణ్యకశికుడ్నిసంహరించేందుకు సగం మనిషిగానూ, సగం సింహ రూపంలోనూ అవతరించింది ఈ ప్రదేశంలోనే అని చెబుతారు. విష్ణువు భయంకరమైన రూపం చూసిన సకల దేవతలు ఆయన గురించి అహో! ఎంత బలవంతుడు అని కీర్తించారు. అహోబిలం క్షేత్రం సీమాంధ్రలోని కర్నూలు జిల్లాలో ఆళ్లగడ్డమండలంలో ఉంది. నరసింహుడి బలాన్ని, శక్తిని దేవతలు ప్రశంసించడంతో అహో బలమైనది. ఎగువ మహోబలంలో ప్రహ్లాదుని తపస్సుకు మెచ్చి స్వయంభువుగా బిలంలో వెలిసినాడు కావున అహోబిలం అని కూడా పిలుస్తారు.


ఈ క్షేత్రం 108 దివ్య క్షేత్రములలో ప్రముఖమైనది. వైష్ణవ ఆళ్వారులు దర్శించి స్తుతించిన క్షేత్రమును మాత్రమే దివ్యక్షేత్రములు అంటారు. ఈ క్షేత్రం నల్లమల అడవులలో ఉంది.నవనారసింహులలో దిగువ అహోబిలంలో పేర్కొనబడలేదు. కాని ఈ ఆలయప్రాశస్తం అమోఘమైనది. ఇక్కడికి వచ్చిన భక్తులు ఎగువ దిగువ అహోబల పుణ్యక్షేత్రాలను సందర్శించి తరిస్తారు. పల్లవులు, చోళులు, విద్యానగరరాజులు, చాళుక్యులు, కాకతీయులు, విజయనగరరాజులు, రెడ్డిరాజులు అభివృద్ధికి వికాసానికి తోడ్పడినారు. 15వ శతాబ్దంలో తురుష్కుల దండయాత్రలో అహోబిలక్షేత్రం పడి నలిగిపోయింది.
15వ శతాబ్దంలో తురుష్కుల దండయాత్రలో అహోబిలక్షేత్రం పడి నలిగిపోయింది.

భూమిమీద ఉన్న నాలుగు దివ్యమైన నరసింహ క్షేత్రాలలో అహోబిల క్షేత్రం ఒకటి. రాక్షసుడైన హిరణ్యకశ్యపుని సంహరించడానికి తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించడానికి స్తంభమునందు, ఉద్భవించిన స్థలమే ఈ అహోబిలక్షేత్రము. ఈ స్థల పురాణాన్ని వ్యాస మహర్షి సంస్కృతంలో బ్రహ్మాండపురాణం అంతర్గతంలో 10 అధ్యాయాలు, 1046 శ్లోకములతో అహోబిలం గురించి ప్రస్తావించారు.
అహోబిల స్వామి వారుతన వివాహ మహోత్సవానికి భక్తులను ఆహ్వానించడానికి అహోబిల పరిసర ప్రాంతంలో సుమారు 35 గ్రామాల్లో ఈ నలబైదు రోజులు సంచరిస్తారని నమ్మకం.


Related News

Lucky Zodiac Signs: అక్టోబర్‌లో వీరు పట్టిందల్లా బంగారమే !

Horoscope 1 october 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఆదాయం పదింతలు!

Surya Grahan 2024 : పితృ అమావాస్య నాడు సూర్య గ్రహణం రానుంది.. ఈ వస్తువులు దానం చేస్తే అన్ని సమస్యలు తీరిపోతాయి

Shardiya Navratri 2024 : శ్రీ రాముడు కూడా శారదీయ నవరాత్రి ఉపవాసం చేసాడని మీకు తెలుసా ?

Kojagori Lokhkhi Puja: కోజాగారి లక్ష్మీ పూజ ఎప్పుడు ? మంచి సమయం, తేదీ వివరాలు ఇవే

Sarva pitru Amavasya 2024: సర్వ పితృ అమావాస్య నాడు బ్రాహ్మణ విందు ఏర్పాటు చేసి దానం చేస్తే శ్రాద్ధం పూర్తిచేసినట్లే

Horoscope 30 September 2024: నేటి రాశి ఫలాలు.. ఆదాయాన్ని మించిన ఖర్చులు!

Big Stories

×