EPAPER

Srichakra:- శ్రీచక్రాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చా……

Srichakra:- శ్రీచక్రాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చా……

Srichakra:- శ్రీచక్రం చాలా పవిత్రమైన, ముఖ్యమైన మరియు శక్తివంతమైన యంత్రాలలో ఒకటి. అమ్మవారు సంచరించే రథమే శ్రీచక్రం. లలిత అమ్మవారు శ్రీచక్రంలో నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటారని బ్రహ్మాండపురాణంలో వర్ణించారు. శ్రీ చక్రం అంటే తిరగని చక్రమని అర్ధం. శ్రీచక్రాన్ని పూజిస్తే జనన,మరణాల చక్రభ్రమణంలో ఉండాల్సిని పని ఉండదని..మోక్షం కలుగుతుందని విశ్వాసం. అమ్మవారి అనుగ్రహం ద్వారా మోక్షంపొందాలంటే శ్రీచక్రాన్ని పూజించాలి. సకల చరాచర సృష్టిలోని గ్రహాలు, నక్షత్రాలు అన్నీ శ్రీ చక్రంలో నిక్షిప్తమై ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి . శ్రీచక్రాన్ని పూజిస్తే సమస్త బ్రహ్మాండాన్ని అర్చించినట్టే లెక్క.


శ్రీచక్రం అన్ని ప్రాపంచిక కోరికలకు మూలం అంతర్గత విశ్వ శక్తుల ద్వారా అన్ని కోరికలను నెరవేరుస్తుంది. సంపదకు ఉత్తమ సాధనంగా ఇళ్ళు కార్యాలయ గదులలో ఉంచవచ్చు. శ్రీ చక్ర పరిపూర్ణ ఆధ్యాత్మిక సంపదను ఇస్తుంది. ఈ యంత్రానికి అన్ని కోరికలను తీర్చగల శక్తి ఉంది ఈ శ్రీచక్ర తంత్రం తెలిసిన వారు సిద్ది పొందినవారికి లోకంలో ఎటువంటి ఎదురు ఉండదు. ..వారే గొప్పశక్తివంతులు, వారిని ఎంతటి క్షుద్రప్రయోగాలు ఏమీ చేయలేవు. ఈ శ్రీచక్రంతో అష్టదిగ్భంధనం చేయబడిన ఇంటికి ఆ ఇంట్లో నివసించే వారికి ఎటువంటి ఆపదలు, ఆర్ధిక బాధలు, క్షుద్ర ప్రయోగాలు దరిచేరలేవు
సంప్రదాయాల్ని నియమ నిష్టల్ని పాటించేవాళ్లు ఇంట్లో శ్రీచకాన్ని ఉంచి పూజించవచ్చు. శుచి శుభ్రత పాటించే వారు శ్రీచక్రార్చరన చేయచ్చు. సంప్రదాయాన్ని పాటించకుండా ఉండేవాళ్లు శ్రీచక్రాన్ని ఇట్లో పెట్టుకుంటే ప్రతికూలతను ఎదుర్కోవాల్సి వస్తుందని శాస్త్రం చెబుతోంది. భక్తి భావంతో పూజ చేసే వాళ్లు మంచి ఫలితాలు పొందవచ్చు.

శ్రీచక్రాన్ని ఇంట్లో ఉంచుకున్నప్పుడు వారానికోసారైనా అభిషేకం చేయాలి. చింతపండుతో కాని నిమ్మరసంతో కాని శుభ్రం చేసి అభిషేకం చేయాలి. అలాగే ప్రతీ రోజు కుంకుమార్చన వేయాలి.మూడు వేళ్లతో కుంకుమ చల్లుతూ శ్రీమాత్రేనమః మంత్రాన్ని జపించాలి. కనీసం బెల్లముక్కైనా నైవేద్యం పెట్టాలి. ప్రతీ రోజు స్నానం చేసి వేసుకున్న బట్టలతోనే శ్రీచక్రాన్ని ముట్టుకోవాలి.


శ్రీ చక్రం గొప్ప కవిత అయిన త్రిపుర సుందరి దేవి రూపురేఖలు. సైన్స్ ప్రకారం, శ్రీ చక్రం ఒక కేంద్ర బిందువు, ఒక త్రిభుజం, అష్టభుజి, లోపలి వ్యాసార్థం, బయటి వ్యాసార్థం, చతుర్భుజం, అష్టాహెడ్రల్, అష్టభుజి, వృత్తం చతురస్రంతో రూపొందించబడింది. చక్రంలో ఎనిమిది రేకులు , పద్నాలుగు రేకులు కలిగిన రెండు చక్రాలు, వాటి చుట్టూ మూడు వృత్తాలు మరియు నాలుగు స్తంభాలతో ఒక చదరపు నాలుగు వైపులా తెరుచుకుంటాయి

Follow this link more updates:- Bigtv

Related News

Lucky Rashi from Durga Sasthi 2024: దుర్గా షష్ఠి నుండి ఈ రాశులకు వరుసగా 119 రోజులు లక్ష్మీ అనుగ్రహం

Mahalaya Surya Grahan 2024: మహాలయలో సూర్యగ్రహణం, ఈ 3 రాశుల వారి జీవితంలో అన్నీ అద్భుతాలే

Surya Grahan 2024: త్వరలో సూర్య గ్రహణం.. ఈ రోజు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి

Vriddhi Yog Horoscope: ఈ రాశుల వారిపై ప్రత్యేక యోగం వల్ల కోటీశ్వరులు కాబోతున్నారు

Guru Vakri 2024 : మరో 20 రోజుల్లో బృహస్పతి తిరోగమనం కారణంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందబోతున్నారు

Budh Shani Yuti Horoscope: బుధ-శని సంయోగంతో ఈ 3 రాశుల వారు సంపదను పొందబోతున్నారు

Horoscope 19 September 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఊహించని ధనలాభం!

Big Stories

×