EPAPER

Revanthreddy : దళిత, గిరిజన ఆత్మగౌరవ సభ సూపర్ సక్సెస్.. పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యం : రేవంత్ రెడ్డి

Revanthreddy : దళిత, గిరిజన ఆత్మగౌరవ సభ సూపర్ సక్సెస్.. పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యం : రేవంత్ రెడ్డి

Revanthreddy : నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లిలో కాంగ్రెస్ నిర్వహించిన దళిత, గిరిజన ఆత్మగౌరవ సభలో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. కేసీఆర్ పాలనలో దళితులు , గిరిజనులపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని మండిపడ్డారు. పాలమూరు గడ్డలో దొరలు, పాలకులు.. దళితులపై, గిరిజనులపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు.


హామీల సంగతేంటి?
2018 ఎన్నికల సమయంలో పాలమూరు సభలో కేసీఆర్ ఇచ్చిన హామీల సంగతేంటని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మార్కెండేయ ప్రాజెక్టు వద్ద కూర్చుని కట్టిస్తానన్న కేసీఆర్ ఎందుకు మాట తప్పారని నిలదీశారు. నాగర్ కర్నూలు ప్రజలను మోసం చేసిన కేసీఆర్ ను నాగం జనార్ధన్ రెడ్డి నిలదీస్తే ఆయనను ఇబ్బంది పెట్టారని రేవంత్ మండిపడ్డారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నాగం జనార్ధన్ రెడ్డి చొరవ వల్ల వచ్చిందని తెలిపారు. 5 లక్షల ఎకరాలకు నీరు అందించే ఈ ప్రాజెక్టును వైఎస్ ఆర్ పూర్తి చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలోనే తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులన్నీ నిర్మించారని స్పష్టం చేశారు. ప్రాజెక్టులపై చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.

దళిత, గిరిజనుల గొంతు నొక్కుతున్నారు..
తెలంగాణలో దళితులు, గిరిజనుల గొంతును కేసీఆర్ నొక్కుతున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. దళితులకు 3 ఎకరాల భూమి , డబులు రూమ్ ఇళ్లు, ఎస్సీ వర్గీకరణ హామీలు ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో దళితులు, గిరిజనులే కేసీఆర్ కు బుద్ధి చెప్తారని అన్నారు. కేసీఆర్ తన మంత్రివర్గంలో మాదిగలకు ఎందుకు స్థానం కల్పించలేదని ప్రశ్నించారు.


పార్టీని గెలిపిస్తా.. సీఎం పదవిపై క్లారిటీ..
కాంగ్రెస్ దళిత, గిరిజనుల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ కృషి చేస్తోందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ లో అంతర్గత కలహాలు ఉన్నాయి అనుకుంటున్నారని కానీ మానిక్ రావ్ ఠాక్రే ఇన్ ఛార్జ్ గా వచ్చాక పార్టీలో ఇక పంచాయితీలు లేవన్నారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14 ఎమ్మెల్యే సీట్లలో కాంగ్రెస్ ను గెలిపించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించే బాధ్యత తానే తీసుకుంటానన్నారు. కాంగ్రెస్ అధిష్టానం సీఎంగా ఎవర్ని నిర్ణయించినా మోసుకెళ్లి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెడతానని స్పష్టం చేశారు. దొరల కోసమే బీఆర్ఎస్ , పెట్టుబడిదారుల కోసం బీజేపీ ఉన్నాయని కానీ…దళిత, గిరిజనుల కోసం ఉన్న పార్టీ కాంగ్రెస్ అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

సభ సూపర్ సక్సెస్..
నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లిలో కాంగ్రెస్ నిర్వహించిన దళిత, గిరిజన ఆత్మగౌరవ సభ సూపర్ సక్సెస్ అయ్యింది. గిరిజన వ్యక్తి వాల్యా నాయక్ పై దాడికి నిరసనగా సభ నిర్వహించారు. సభలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితోపాటు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణిక్‌రావు ఠాక్రే, సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ సభకు జనం పోటెత్తారు. కాంగ్రెస్ కు ఉన్న కార్యకర్తలు బలం ఎంత స్ట్రాంగో చూపించారు. సభ ప్రాంగణమంతా కాంగ్రెస్ శ్రేణులతో నిండిపోయింది. దీంతో సభ వేదికపైకి రావడానికి రేవంత్ , ఠాక్రే కు చాలా సమయం పట్టింది. ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ నిర్వహించిన ఏ సభకు ఈ స్థాయిలో జనం పోటెత్తలేదు. మాజీ మంత్రి , సీనియర్ నేత నాగం జనార్ధన్ రెడ్డి నేతృత్వంలో ఈ సభను నిర్వహించారు. ఏర్పాట్లన్నీ ఆయనే దగ్గర ఉండి పర్యవేక్షించారు. సభను విజయవంతం చేయడానికి తీవ్రంగా కృషి చేశారు. అందుకు తగ్గట్టుగానే సక్సెస్ సాధించారు.

Related News

Kaleshwaram project: కాళేశ్వరం ప్రాజెక్టు.. కమిషన్ పబ్లిక్ విచారణ, తడబడ్డ అధికారులు

Road Accident in Philippines: ఫిలిప్పీన్స్‌లో రోడ్డు ప్రమాదం.. తెలుగు వైద్య విద్యార్థి దుర్మరణం

Dussehra Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవుల తేదీలు ఇవే!

Ex-Gratia to Gulf Victims: గల్ఫ్ బాధితులకు ఎక్స్ గ్రేషియా.. నేటి నుంచే ప్రవాసి ప్రజావాణికి శ్రీకారం

Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు కీలక పరిణామం.. వారికి రెడ్‌ కార్నర్‌ నోటీసులు!

Cabinet Meeting: నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

Cash for Vote Scam: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

Big Stories

×