EPAPER

coconut trees in independent houses ? : ఇండిపెండెంట్ ఇళ్లల్లో కొబ్బరి చెట్టు పెంచుకోవచ్చా…

coconut trees in independent houses ? : ఇండిపెండెంట్ ఇళ్లల్లో కొబ్బరి చెట్టు పెంచుకోవచ్చా…

coconut trees in independent houses ? : మనం నివాసం ఉంటున్న ఇంట్లో ఎలాంటి చెట్లుండాలి.. ఏ చెట్టుంటే శుభం ఫలితం కలుగుతుంది.. ఉండకూడని చెట్లేవైనా ఉన్నాయా.. అనే ప్రశ్నలకు బ్రహ్మవైవర్త పురాణం శ్రీకృష్ణ జన్మఖండం ఉత్తరార్థం 103 అధ్యాయంలో కనిపిస్తుంది. శ్రీకృష్ణుడు స్వయంగా విశ్వకర్మకు ఈ చెట్ల విశేషాలను వివరించాడు. ఇళ్ళ ఆవరణల్లో శుభకరమైన చెట్లు, పూలతీగలు, ఫలాలనిచ్చే వృక్షాలు ఉండాలని విశ్వకర్మను కృష్ణుడు వివరించాడు. గృహస్థులు ఉండే గృహాల ఆవరణలో కొబ్బరి చెట్టు ధన ప్రదంగా భావించాలి.


ఇంట్లో మొక్కలని పెంచుకునే వారు సింహ ద్వారానికి ఎదురుగా కాని, కిటికీల పక్కన కాని చెట్లను పెంచకూడదు. ఇలా చేయటం వలన ఇంటి యజమానికి కీడు జరిగే ప్రమాదం వుంది.దక్షిణాన పోకచెట్టు, కొబ్బరి చెట్టు పెంచరాదుతూర్పు ఉత్తరం ముఖద్వారముగా ఉన్న ఇళ్లకు ఇంటి వెనుక భాగంలో కొబ్బరి చెట్లను పెంచవచ్చు. పడమర, దక్షిణ సింహద్వారం కలిగిన ఇళ్లకు ఇంటి ముందు
భాగంలో పెంచుకోవచ్చు.కొబ్బరి చెట్లను గృహ ఆవరణలో తూర్పు, ఉత్తరం దిక్కుల్లో పెంచకూడదు. ఇవి ఇంటికన్నా ఎక్కువ ఎత్తు పెరుగుతాయి. తూర్పులో ఎత్తుగా పెరిగే చెట్లతో సూర్యరశ్మి ఇంట్లో సరిగా రాదు. దీనివల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి.

ఉత్తరంలో ఇంటికంటే ఎత్తుగా పెరిగే చెట్లు ఉంటే ఉత్తర ధ్రువ ప్రభావం మారి ప్రతికూల ఫలితం ఉంటుంది. అందుకే ఈ దిక్కుల్లో పెద్ద చెట్లను పెంచకూడదు.వాస్తు ప్రకారం దక్షిణం, పడమర దిశలు బరువులు మోసే దిక్కులు. ఈ దిక్కుల్లో ఎంత బరువుంటే అంత మంచిది.ఇంటి ఆవరణలో పడమర దక్షిణ దిక్కుల్లో ఇంటికి దూరంగా కాంపౌండ్ కి దగ్గర్లో కొబ్బరి చెట్లను వేసుకోవచ్చు. మరి తప్పని పరిస్థితిలో తూర్పు ఉత్తరం ముఖం ఇళ్లకు ఆగ్నేయ, వాయవ్యాలలో ఇంటిముందు వేసుకోవచ్చు.


Follow this link for more updates:-Bigtv

Tags

Related News

Bhadra Mahapurush Rajyog Horoscope: ఈ రాశి వారిపై ప్రత్యేక రాజయోగంతో జీవితంలో భారీ అభివృద్ధి

Dussehra 2024 Date: ఈ ఏడాది దసరా పండుగ ఏ రోజున జరుపుకుంటారు? శుభ సమయం, ప్రాముఖ్యత వివరాలు ఇవే

Sun Transit Horoscope: సూర్యుని దయతో ఈ రాశుల వారికి గోల్డెన్ టైం రాబోతుంది

Tirumal Laddu: పవిత్ర తిరుమల లడ్డూ తయారీలో 8 మంది కీలక పాత్ర, ఇంతకీ వాళ్లు ఎవరో తెలుసా?

Tulasi Plant: తులసి పూజ ఎప్పుడు చేయాలి, వాయు పురాణం ఏం చెబుతోందంటే..

Horoscope 20 September 2024: ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే! శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం!

Lucky Rashi from Durga Sasthi 2024: దుర్గా షష్ఠి నుండి ఈ రాశులకు వరుసగా 119 రోజులు లక్ష్మీ అనుగ్రహం

Big Stories

×