EPAPER

Errabelli: ఎర్రబెల్లికి బీజేపీ గాలం? ఈటల డీల్? అందుకే ఆ వ్యాఖ్యలా? కేసీఆర్ సీరియస్?

Errabelli: ఎర్రబెల్లికి బీజేపీ గాలం? ఈటల డీల్? అందుకే ఆ వ్యాఖ్యలా? కేసీఆర్ సీరియస్?

Errabelli: తెలంగాణ పాలిటిక్స్ ఫుల్ పీక్స్ లో ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో ఊహించలేని పరిస్థితి. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. ప్రతీ ఎమ్మెల్యే స్థానం అత్యంత కీలకం. ఇలాంటి సందర్భంలో.. ఏకంగా 25 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని.. వారిని మార్చితే బాగుంటుందంటూ.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.


నిజమేనా? అంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై నెగటివ్ ఉందా? అనే చర్చ నడుస్తోంది. తన వాదనకు మరింత బలం చేకూరేలా.. తాను సొంతంగా సర్వేలు చేయించానని.. ఆ ఆధారంగానే ఈ విషయం చెబుతున్నానని మరింత క్లారిటీ ఇచ్చారు ఎర్రబెల్లి. దయాకర్ రావు లాంటి కీలక నేత ఇలాంటి కామెంట్లు చేయడంతో బీఆర్ఎస్ కు బాగా డ్యామేజ్ జరిగిపోయింది. ఒక్కో సీటు ముఖ్యమైన చోట.. ఏకంగా 25 మంది ఎమ్మెల్యేలు ఓడిపోతారనేలా ఆయన పేల్చిన బాంబు.. ప్రగతి భవన్ నూ షేక్ చేసింది.

ఇప్పటికే దయాకర్ రావు సోదరుడు ప్రదీప్ రావు బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరారు. వరంగల్ ఈస్ట్ నుంచి పోటీ చేస్తారని అంటున్నారు. అటు, పాలకుర్తి నియోజకవర్గంలో దయాకర్ రావుకు ఈసారి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని చెబుతున్నారు. వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలవడంతో సహజంగానే ప్రజల నుంచి రిజెక్షన్ వస్తోంది. అటు, కాంగ్రెస్ తరఫున జంగా రాఘవరెడ్డి అనే బలమైన నేత బరిలో ఉండటం.. ఆయనకు దయాకర్ రావు బద్దశత్రువైన కొండా మురళి అండదండలు దండిగా ఉండటంతో.. ఈసారి ఎర్రబెల్లికి పాలకుర్తిలో టఫ్ ఫైట్ తప్పదంటున్నారు. ఆయనపై ఉన్న వ్యతిరేకతకు ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా తోడైతే.. ఓటమి తప్పదనే ప్రచారం జరుగుతోంది. అందుకే, బీఆర్ఎస్ కాకుండా బీజేపీ నుంచి పోటీ చేస్తే.. ఫ్రెష్ లుక్ తో.. మళ్లీ ఫ్రెష్ గా గెలవ వచ్చనే ఆలోచన చేస్తున్నారని నియోజకవర్గంలో టాక్ నడుస్తోంది.


అటు, బీజేపీ సైతం బలమైన నేతల వేటలో పడింది. ఇప్పటికే దయాకర్ రావు సోదరుడికి కాషాయ కండువా కప్పేయగా.. అన్నను మాత్రం ఎందుకు వదిలేయాలని అనుకుంటోందట. ఎర్రబెల్లి లాంటి స్ట్రాంగ్ లీడర్ ని బీజేపీలో చేర్చుకుంటే.. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రభావం చూపే ఛాన్స్ ఉంటుందనేది బీజేపీ లెక్క. అందుకే, ఈసారి గెలిచేది బీజేపీనే అని.. పాలకుర్తి టికెట్టు, మంత్రి పదవి పక్కా అంటూ కమలం పార్టీ నుంచి ఎర్రబెల్లికి ఆఫర్ వచ్చిందని అంటున్నారు. పాత మిత్రుడు, బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందరే స్వయంగా ఎర్రబెల్లి విషయం డీల్ చేస్తున్నారని తెలుస్తోంది.

సిట్టింగులందరికీ టికెట్లు ఇవ్వడం కేసీఆర్ స్ట్రాటజీ. ఈసారి కూడా అందరికీ టికెట్లు పక్కా అంటున్నారు. మరి, కేసీఆర్ కే ఝలక్ ఇచ్చేలా.. ఎర్రబెల్లి సర్వేలు చేయించడం.. 25 మందిపై వ్యతిరేకత ఉందని.. వారిని మార్చాలంటూ.. బహిరంగ వేదికగా ప్రస్తావించడం చిన్న విషయమా? ఎర్రబెల్లిలాంటి సీనియర్ మోస్ట్ లీడర్ ఇలాంటి లూజ్ టాక్ ఊరికే చేసుంటారా? ఇలాంటి ధిక్కారధోరణిని గులాబీ బాస్ సహించగలరా?

ఏ మామూలు నాయకుడో అయితే ఇప్పటికే సీరియస్ యాక్షన్ తీసుకుని ఉండేవారు. అక్కడున్నది మంత్రి ఎర్రబెల్లి కావడంతో యాక్షన్ డోసు తగ్గింది. సీనియర్ నేత కావడం, బలమైన నాయకుడు అవడం.. సొంత సామాజిక వర్గం.. ఇలా అనేక కారణాలతో దయాకర్ రావుపై కాస్త దయ చూపించారట కేసీఆర్. సెక్యూరిటీ తగ్గించడం గట్రా చేయకుండా.. ఫోన్ చేసి క్లాస్ ఇచ్చారని అంటున్నారు. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దని, అత్యుత్సాహం పనికిరాదని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారని తెలుస్తోంది. కట్ చేస్తే, తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని ఎర్రబెల్లి రొటీన్ స్టేట్ మెంట్ ఇచ్చి ఆ ఇష్యూ నుంచి సైడ్ అయిపోయారు. మరి, బీఆర్ఎస్ నుంచి కూడా పక్కకు జరుగుతారా? తమ్ముడి దారిలో అన్న కూడా బీజేపీలో చేరుతారా? టీడీపీని వీడి బీఆర్ఎస్ లో చేరిన ఎర్రబెల్లికి.. బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరడం ఏమంత కష్టం? అంటున్నారు.

Related News

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Land Grabbing: వంశీరాం టు సోహిణి.. లిటిగేషన్స్ సో మెనీ.. కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Vegetables Price: కూరగాయల ధరలకు రెక్కలు.. జేబుకు చిల్లు.. ఇంతలా పెరగడానికి రీజనేంటి ?

Big Stories

×