EPAPER

BRS: జగన్ తెలంగాణలో అడుగుపెడితే.. ఆ ఆలోచన ఉందా రెడ్డీ?

BRS: జగన్ తెలంగాణలో అడుగుపెడితే.. ఆ ఆలోచన ఉందా రెడ్డీ?

BRS: రానురాను.. నేనురాను.. అంటున్నారు జగన్. తనకు తెలంగాణ రాజకీయాలపై అసలేమాత్రం ఆసక్తి లేదంటున్నారు. ఏపీనే నా రాష్ట్రం.. ఏపీలోనే నా భవితవ్యం.. అంటూ పదే పదే చెబుతున్నారు. ఖమ్మంలో మీటింగ్ పెట్టిన చంద్రబాబును.. రెండు కళ్ల సిద్దాంతం అంటూ విమర్శించారు. చంద్రబాబుకు ఇక్కడ కాకపోతే అక్కడ.. తానుమాత్రం ఇక్కడే.. అంటూ స్టేట్ మెంట్లు ఇచ్చారు. కానీ.. రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదంటారు. అలానే, ప్రస్తుత జగన్ అభిప్రాయమూ పర్మినెంట్ కాకపోవచ్చని చెబుతున్నారు. ఎందుకంటే, సీఎం కేసీఆర్.. బీఆర్ఎస్ అంటూ ఏపీలో ఎంట్రీ ఇస్తున్నారు. నీ రాష్ట్రానికి వస్తా.. నీ ఓటు బ్యాంకును దెబ్బ తీస్తా.. అంటే జగన్ ఊరుకుంటారా? దోస్త్ దోస్తే.. రాజకీయం రాజకీయమే అంటున్నారు. ఆ వాదనకు మరింత బలం చేకూరేలా.. ఇటీవల వైపీసీ ఫైర్ బ్రాండ్ లీడర్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరింత మంట రాజేస్తున్నాయి.


ఏపీలో బీఆర్ఎస్ కు ఏం పని? అనేది బైరెడ్డి డైరెక్ట్ క్వశ్చన్. జగన్ తలుచుకుంటే.. ఒక్కసారి తెలంగాణలో అడుగుపెడితే.. అక్కడ ప్రకంపనలే.. అంటూ హెచ్చరించారు. తెలంగాణలో జగన్ కు వీరాభిమానులు ఉన్నారని.. అన్న సై అంటే ప్రభుత్వాలే తల్లకిందులు అవుతాయంటూ వార్నింగ్ ఇచ్చారు.

బైరెడ్డి ఏదో తనదైన స్టైల్ లో పంచ్ డైలాగులు చెప్పారా.. లేదంటే, పార్టీలో జరుగుతున్న అంతర్గత చర్చల సమాచారం మేరకే ఇలాంటి వ్యాఖ్యలు చేశారా? అనే చర్చ నడుస్తోంది. తెలంగాణలో జగన్ కు అభిమానులు ఉన్నారనేది వాస్తవం. హైదరాబాద్ లో వైసీపీ శ్రేణుల ఉనికి బలంగానే ఉంది. గ్రామగ్రామాన వైఎస్సార్ అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం వారంతా.. రేవంత్ రెడ్డిలో వైఎస్సార్ ను చూస్తున్నారు. షర్మిల నేనున్నానంటూ తిరుగుతున్నా.. ఆమెకు ఆదరణ తక్కువే. జగన్ వస్తే మాత్రం లెక్క మారిపోతుందనే టాక్ అయితే ఉంది.


అయితే, జగన్ కు అలాంటి ఆలోచనేమీ లేదని అంటున్నారు. ఏపీలోకి బీఆర్ఎస్ వస్తే.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి.. పరోక్షంగా వైసీపీకే లాభం జరుగుతుందని అంచనా వేస్తున్నారు. ప్రధానంగా ‘కాపు’ కేంద్రంగానే కేసీఆర్ రాజకీయం చేస్తారని అంటుండగా.. అలా జరిగితే జనసేన ఓటు బ్యాంకుకు డ్యామేజ్ జరిగి.. మళ్లీ జగన్ కే ప్రయోజనం కలుగుతుందని లెక్కేస్తున్నారు. ఇలా ఎలా చూసినా ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీ వల్ల జగన్ కే లాభం అంటున్నారు. తనకింత సహాయం చేయబోతున్న కేసీఆర్ ను టార్గెట్ చేసేలా.. జగన్ తెలంగాణ రాజకీయాల్లో అడుగు పెట్టే అవకాశం తక్కువేనని విశ్లేషిస్తున్నారు. వైసీపీ యువనేత.. బైరెడ్డి మీడియా అటెన్షన్ కోసమే అలా మాట్లాడి ఉంటాడని అంటున్నారు.

Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×