EPAPER

Nexon price reduction:- ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో పెరుగుతున్న పోటీ.. నెక్సాన్ ధర తగ్గింపు

Nexon price reduction:- ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో పెరుగుతున్న పోటీ.. నెక్సాన్ ధర తగ్గింపు

Nexon price reduction:- దేశంలో ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో పోటీ వేగంగా పెరుగుతోంది. అనేక కంపెనీలు తమ ఎలక్ట్రిక్ వెహికల్స్ లాంచ్ చేస్తుండటంతో… ఇప్పటికే మార్కెట్లో ఉన్న కంపెనీలు… పోటీని ఎదుర్కోవడం కోసం ధరలు తగ్గించక తప్పడం లేదు. తాజాగా టాటా మోటార్స్‌ తన నెక్సాన్‌ ఈవీ ధరలను సవరించింది. నెక్సాన్‌ ఈవీ ప్రారంభ ధర ఇప్పటి వరకు రూ.14.99 లక్షలు ఉండగా… దాన్ని రూ.50 వేలు తగ్గించి, రూ.14.49 లక్షలకు సవరించింది… టాటా మోటార్స్. ఇకపై నెక్సాన్‌ ఈవీ ప్రైమ్‌ వాహనాల ఎక్స్‌షోరూమ్‌ ప్రైస్ రూ.14.49 నుంచి రూ.16.99 లక్షల మధ్య ఉండనుంది.


నెక్సాన్‌ ఈవీ మాక్స్‌ ధర రూ.16.49 లక్షల నుంచి మొదలవుతుంది. ఇందులో హయ్యెండ్ వేరియంట్ ధర రూ.18.99 లక్షలు. నెక్సాన్‌ ఈవీ మాక్స్‌ వేరియంట్ మోడళ్లు ఫుల్ చార్జింగ్‌తో 437 కిలోమీటర్లు వెళ్తుండగా… ఆ రేంజ్ ను ఇప్పుడు 453 కిలోమీటర్లకు పెంచారు. దీని కోసం ప్రస్తుత నెక్సాన్‌ ఈవీ మాక్స్‌ ఓనర్లు… ఫిబ్రవరి 15 నుంచి డీలర్ల దగ్గర సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ పొందాల్సి ఉంటుంది. నెక్సాన్‌ ఈవీ మోడళ్లన్నింటికీ బుకింగ్స్ తీసుకుంటున్నామని, కొత్త నెక్సాన్‌ ఈవీ మాక్స్‌ ఎక్స్‌ఎమ్‌ వేరియంట్‌ డెలివరీ 2023 ఏప్రిల్‌ నుంచి ప్రారంభమవుతాయని టాటా మోటార్స్ వెల్లడించింది.

రెండు రోజుల కిందటే మహీంద్రా అండ్ మహీంద్రా… తన తొలి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అయిన ఎక్స్‌యూవీ 400ను లాంచ్ చేసింది. రూ.15.99 లక్షల ప్రారంభ ధరతో ఆ కారు లభ్యమవుతుందని ప్రకటించింది. మరికొన్ని కంపెనీలు కూడా తమ తొలి ఎలక్ట్రిక్ కార్లను త్వరలో లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతున్నాయి. అందుకే… నెక్సాన్ ఈవీ ధరలను టాటా మోటార్స్ తగ్గించిందని భావిస్తున్నారు. కొత్త మోడళ్లు వచ్చే కొద్దీ పోటీ మరింత తీవ్రమై… ఎలక్ట్రిక్ కార్ల ధరలు ఇంకా దిగివస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.


Follow this link for more updates:- Bigtv

Tags

Related News

Comedian Ali: బ్రేకింగ్.. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన కమెడియన్ ఆలీ

Amit Shah: ఉగ్రదాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు.. అమిత్ షా ఆదేశాలు

CM Chandrababu comments: చంద్రబాబు హెచ్చరిక, తిరుమల నుంచే ప్రక్షాళన, ఆ ఒక్కటి తప్ప..

Flagpole in Temples: దేవాలయాల్లో ధ్వజస్తంభాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తారు..? వాటిపై ఉండే కలశాలల మర్మమేమిటి..?

Central Cabinet: కేంద్రమంత్రులుగా బండి సంజయ్, కిషన్ రెడ్డి..?

AP CID Raids: వాసుదేవరెడ్డి ఇంటిపై ఏపీ సీఐడీ సోదాలు.. లిస్టులో చాలామంది!

Virat Kohli: న్యూయార్క్‌లో ఐసీసీ అవార్డు అందుకున్న విరాట్ కోహ్లీ

Big Stories

×