EPAPER

BRS: సీఎంలు మమత, స్టాలిన్, నితీష్ లు ఖమ్మంకు ఎందుకు రాలేదో తెలుసా?

BRS: సీఎంలు మమత, స్టాలిన్, నితీష్ లు ఖమ్మంకు ఎందుకు రాలేదో తెలుసా?

BRS: ఖమ్మం బీఆర్ఎస్ బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్. లక్షలాది మంది జనం తరలివచ్చారు. సీఎం కేసీఆర్ తో మరో ముగ్గురు ముఖ్యమంత్రులు వేదిక పంచుకున్నారు. మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కూడా హాజరయ్యారు. బీఆర్ఎస్ తరఫున భారీ మెసేజ్ ఇచ్చారు. అంతా బాగుంది.. కేంద్రానికి, బీజేపీకి బీఆర్ఎస్ అండ్ కో.. స్ట్రాంగ్ ఝలక్ ఇచ్చారు.


అయితే, ఖమ్మం సభకు వచ్చిన వారికంటే రాని వారి గురించే ఎక్కువ చర్చ నడుస్తోంది. ముగ్గురు సీఎంలు వచ్చారు సరే.. మరి ఆ ముగ్గురు ముఖ్యమంత్రులు ఎందుకు రాలేదనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ పేరు ఎత్తితేనే ఒంటికాలిపై లేచే.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్, బీహార్ సీఎం నితీష్ కుమార్ లు ఎందుకు హాజరుకాలేదనేది ఆసక్తికరం.

కేసీఆర్ కొందరినే కలుపుకుంటున్నారా? లేదంటే, ఆ ముగ్గురే కేసీఆర్ తో కలవడం లేదా? అనే అనుమానం వ్యక్తం అవుతోంది. గతంలో మమత, స్టాలిన్, నితీష్ లతో గులాబీ బాస్ కేసీఆర్ ఆయా రాష్ట్రాలకు వెళ్లి మరీ భేటీ అయ్యారు. బీజేపీ వ్యతిరేక రాజకీయాలపై చర్చించారు. భవిష్యత్తులో అంతా కలిసి పని చేస్తామని అప్పట్లో మెసేజ్ కూడా ఇచ్చారు. కానీ, ఆ సమయం వచ్చేసరికి.. ఆ ముగ్గురు ముఖ్యమంత్రులు సైడ్ అయిపోయారు. కేసీఆర్ పిలిచినా.. వారు తాము రామని అన్నారని అంటున్నారు.


బెంగాల్ దీదీ మమతా లెక్క వేరే ఉంది. ప్రధాని రేసులో తానే అందరికన్నా ముందున్నాననేది ఆమె భావన. అయితే గియితే తానే ప్రధాని కావాలి.. కలిస్తే గిలిస్తే కాంగ్రెస్ తోనే కలవాలనేది మమతా ఎజెండా. కేసీఆర్ లాంటి నేతలతో సఖ్యతగా ఉన్నా.. రాజకీయంగా కేసీఆర్ కంటే వెనుకే ఉండేందుకు ఆమె అంగీకరించక పోవచ్చు. ఇక, మమతకు కమ్యూనిస్టులంటే అస్సలు పడదు. కేసీఆరేమో కామ్రేడ్లతో కలిసిపోతున్నారు. ఇది ఇష్టం లేకే.. బీఆర్ఎస్ తో టచ్ మీ నాట్ అన్నట్టు మమతా ఉన్నారని తెలుస్తోంది.

తమిళనాడు సీఎం స్టాలిన్ ది మరో లెక్క. ఆయన ఇటీవలే మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారు. ప్రధాని కావాలనే కోరిక ఆయనకు ప్రస్తుతానికైతే లేదు. డీఎంకే పది కాలాల పాటు అధికారంలో పదిలంగా ఉంటే చాలనేది స్టాలిన్ లెక్క. మరి, తమిళనాడులో డీఎంకేకు కాంగ్రెస్ తో మంచి బంధం ఉంది. అందుకే, బీజేపీపై వ్యతిరేకత ఉన్నా.. గవర్నర్ తో గొడవలు ఉన్నా.. బీఆర్ఎస్ తో మాత్రం కలిసేది లేదన్నట్టు ఉన్నారు సీఎం స్టాలిన్. కాంగ్రెస్ వెంటే ఉంటానంటున్నారు ఆ తమిళతంబి.

ఇక, బీహార్ సీఎం నితీష్ కుమార్ ది మరో లెక్క. ప్రధాని రేసులో చాలాకాలంగా వినిపిస్తున్న పేరు నితీష్ కుమార్. బాగా వెనకబడి ఉన్న బీహార్ ను అభివృద్ధిలో పరుగులు పెట్టించారు నితీష్. అవినీతి లేని పాలన.. మిస్టర్ క్లీన్ ఇమేజ్ ఆయన సొంతం. తనకున్న మంచి ఇమేజ్ తో భవిష్యత్తులో తానే ప్రధాని కాగలననేది నితీష్ ఆలోచన. తనకు ఎవరు మద్దతు ఇచ్చినా తీసుకునే ఎత్తుగడలో ఉన్నారాయన. అందుకే, బీఆర్ఎస్ లాంటి వాటి వెనక తాను పడకుండా.. ఎప్పటికైనా బీజేపీ వ్యతిరేక పార్టీలు తన వెంటే నిలుస్తాయనే ధీమాతో.. ఆయన మొదటినుంచీ ఎలాంటి కూటములను ప్రోత్సహించడం లేదు. అందుకే, ఖమ్మం బీఆర్ఎస్ సభకూ రాలేదని అంటున్నారు.

అందుకే, ముగ్గురు ముఖ్యమంత్రులు రావడం కంటే కూడా.. ఖమ్మం సభకు రాని ఆ ముగ్గురు సీఎంల గురించే ఎక్కువ చర్చ నడుస్తోంది.

Related News

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Land Grabbing: వంశీరాం టు సోహిణి.. లిటిగేషన్స్ సో మెనీ.. కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Vegetables Price: కూరగాయల ధరలకు రెక్కలు.. జేబుకు చిల్లు.. ఇంతలా పెరగడానికి రీజనేంటి ?

Big Stories

×