kukkuteswar temple:- కుక్కే సుబ్రమణ్య దేవాలయానికి వెళ్ళితే భక్తులకు వల్మిక మృత్తికా అంటే పుట్ట మన్ను ప్రసాదరూపంలో అందిస్తారు. మృత్తికా ప్రసాదాన్ని ఎవరు ధరిస్తారో వారికీ నాగుల భయం ఉండదు. నాగ దేవతల అనుగ్రహం ఉంటుంది. ఎవరైతే కలలో పాములు ఎక్కువుగా కనబడుతుంటయో అటువంటి వారు మృత్తికా ప్రసాదాన్ని ధరిస్తే సర్పాల భీతి తొలగిపోతుంది. కుక్కే సుబ్రమణ్య స్వామి ఆలయం కర్ణాటకలోని మంగళూరు సమీపంలోని దక్షిణ కన్నడ జిల్లా సుల్లి తాలూకాలోని సుబ్రమణ్య గ్రామంలో ఉంది. నిర్మలమైన పశ్చిమ కనుమల ఈ ఆలయం ఉంది. శివుని కుమారుడైన సుబ్రమణ్యను సర్పాలన్నిటికీ అధిపతిగా పూజిస్తారు.
కుక్కే సుబ్రమణ్య ఆలయంలో పూజించే ప్రధాన దేవత సుబ్రమణ్య స్వామి . ఈ ఆలయం తూర్పు ముఖంగా ఉంది మరియు ప్రధాన ద్వారం గర్భగుడి వెనుక భాగంలో ఉంది. భక్తులు పడమటి నుండి ప్రధాన గోపురం ద్వారా తూర్పు నుండి లోపలి చతుర్భుజంలోకి ప్రవేశిస్తారు.శ్రీ సుబ్రమణ్య బొమ్మ, వాసుకి విగ్రహం శేషా విగ్రహం కనిపిస్తాయి. లోపలి ప్రవేశించేటప్పుడు భక్తులు వారి చొక్కాలు విప్పి లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. గర్భగుడి ప్రవేశ ద్వారం మధ్య సిల్వర్ ప్లేటెడ్ గరుడ కంబా ఉంది. ఈ స్తంభం గర్భగుడి లోపల నివసించే వాసుకి యొక్క విష శ్వాస నుండి భక్తులను రక్షిస్తుందని నమ్మకం.
సర్ప దోష శాంతికి చేసే ప్రక్రియలకు ఈ పవిత్ర దేవాలయం ప్రసిద్ది. ఈ గుడిలోని ప్రధాన పర్వ దినం తిపూయం నాడు వేలాదిగా యాత్రికులు వస్తారు. దీంతో పాటు ఆశ్లేష బలి పూజ, సర్ప సంస్కారం అనే మరో రెండు ప్రధానమైన సర్ప దోష పూజలు కూడా చేస్తారు. నవంబర్ నెలాఖరు లేదా డిసెంబర్ మొదటి వారంలో నిర్వహించే చంపా షష్టి వేడుక లేదా ఉత్సవం నాడు మూడు రోజులపాటు ‘మాదే స్నాన’ జరుపుతారు. ఈ ఆచారం ప్రకారం మొదట బ్రాహ్మణులు విస్తరాకులలో భోజనం చేస్తారు. వారు తిని వదిలేసిన ఆకులను అక్కడే ఉంచుతారు. ఊర్లోని దళితులు, గిరిజనులు వచ్చి ఆ ఆకుల పై ‘పొర్లు దండాలు’ పెడతారు. ఇలా చేస్తే వారి చర్మ వ్యాధులు తగ్గిపోతాయని, వారి పాపాలు తొలగిపోతాయని నమ్మకం.
Follow this link for more updates:- Bigtv