EPAPER

January 17 , Veera Simha Reddy – Waltair Veerayya:- వీర సింహుడిపై వీర‌య్య‌దే పైచేయి..

January 17  ,  Veera Simha Reddy – Waltair Veerayya:- వీర సింహుడిపై వీర‌య్య‌దే పైచేయి..

Veera Simha Reddy – Waltair Veerayya:- 2023 సంక్రాంతి రేసులో నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో రెండు సినిమాల మధ్య మాత్రమే ప్రధాన పోటీ సాగింది. ముందుగా జనవరి 12న నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా న‌టించిన వీర సింహా రెడ్డి విడుద‌లైంది. భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్‌తో విడుద‌లైన ఈ చిత్రం తొలి రోజున అంచనాల‌ను మించి హిట్ అయ్యింది. తొలి రోజునే ఈ చిత్రం రూ.54 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించింది. ఆ త‌ర్వాత రోజు అంటే జ‌న‌వ‌రి 13న మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టించిన ‘వాల్తేరు వీరయ్య’ విడుదలైంది. తొలి రోజున ఈ చిత్రం రూ.50 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించింది.


వీర సింహా రెడ్డి, వాల్తేరు వీర‌య్య పోటాపోటీగా తెలుగు రాష్ట్రాల్లో ర‌న్ అయ్యాయి. నాలుగు రోజుల్లో బాల‌కృష్ణ సినిమా రూ.104 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్స్‌ను సాధించింది. చిరంజీవి మూవీ అయితే మూడు రోజుల్లోనే రూ.108 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించింది. ఈ లెక్క‌ల ప్ర‌కారం చూస్తే మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీర‌య్య‌దే ఈ సంక్రాంతి బ‌రిలో పైచేయి అని చెప్పాలి. ఫ్యాక్ష‌న్ బాల‌య్య కంటే వింటేజ్ చిరంజీవినే చూడ‌టానికే ప్రేక్ష‌కులు ఆస‌క్తి చూపిస్తున్నార‌నేది ట్రేడ్ వ‌ర్గాల స‌మాచారం. సాలిడ్ సినిమా ప‌డితే చిరంజీవి స‌త్తా ఏంట‌నేది వాల్తేరు వీర‌య్య ప్రూవ్ చేసింద‌ని చెప్పొచ్చు. ఓవ‌ర్ సీస్ వ‌సూళ్ల విష‌యంలోనూ వాల్తేరు వీర‌య్య సినిమాకు 1.7 మిలియ‌న్ డాల‌ర్స్ వ‌స్తే.. వీర సింహా రెడ్డి మూవీ 1.3 మిలియ‌న్ డాల‌ర్స్‌ను రాబ‌ట్టింది. ఓవ‌రాల్‌గా ఓ రోజు ఆల‌స్య‌మైన‌ప్ప‌టికీ వీర సింహుడి కంటే వీర‌య్య‌నే బెస్ట్ అనిపించుకుంటూ క‌లెక్ష‌న్స్ రూపంలో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర స‌త్తా చూపించేస్తున్నాడు మ‌రి.

Follow this link for more updates:- Bigtv


Related News

Akhil Akkineni: అయ్యగారిలో ఇంత కసి ఉందా.. నాగర్జున వ్యాఖ్యలు వైరల్

Renu Desai: ప్లీజ్ సాయం చెయ్యండి.. హెల్ప్‌లెస్‌గా ఉన్నాను.. రేణు దేశాయ్ వేడుకోలు

Jani Master : జానీకి రిమాండ్ విధించిన కోర్టు… బెయిల్ పరిస్థితి ఏంటంటే..?

Fear Teaser: సస్పెన్స్ థ్రిల్లర్ గా ఫియర్ టీజర్.. అద్భుతమైన పర్ఫామెన్స్ తో హైప్ పెంచేసిన వేదిక.!

Jani Master : లీగల్‌గా పోరాడుతా.. లైంగిక ఆరోపణలపై ఫస్ట్ టైమ్ స్పందించిన జానీ మాస్టర్

Jani Master : ‘మాస్టర్ అమాయకుడు’ రోజురోజుకు పెరుగుతున్న మద్దతు… ఎంత మంది సపొర్ట్ చేశారంటే..?

Bhanumathi: ఉన్నతంగా బ్రతికిన భానుమతి.. చరమాంకంలో దీనస్థితికి చేరుకోవడానికి కారణం..?

Big Stories

×