EPAPER

BJP: జీతాలు పెంచాలి.. కొత్త పీఆర్సీకి బండి సంజయ్ డిమాండ్..

BJP: జీతాలు పెంచాలి.. కొత్త పీఆర్సీకి బండి సంజయ్ డిమాండ్..

BJP: ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తారీఖు జీతాలు ఇవ్వడమే కష్టమై పోతోంది సర్కారుకు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జీతాలు బాగా ఆలస్యం అవుతున్నాయి. ప్రభుత్వ తీరుపై ఉద్యోగులు విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఒకటో తేదీన జీతం వస్తుందనే అంచనాతో ఇప్పటికే EMI లు పెట్టుకున్న జాబ్ హెల్డర్స్ జీతాలు ఆలస్యం అవుతుండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.


ఇక, ధనిక రాష్ట్రమైన తెలంగాణను సీఎం కేసీఆర్ దివాళా తీయించారని.. జీతాలు కూడా టైమ్ కి ఇవ్వలేని దుస్థితికి దిగజార్చారంటూ సమయం వచ్చినప్పుడల్లా ప్రతిపక్షాలు రాజకీయ దాడి చేస్తూనే ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో.. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు మరింత పెంచాలంటూ కొత్త డిమాండ్ తీసుకొచ్చారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. వేతన సవరణ సంఘం (PRC) ఏర్పాటు చేసి పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగులకు జులై ఒకటి నుంచి జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ.. సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు.

ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లించకుండా ఉద్యోగుల హక్కులను కాలరాస్తున్నారని బండి సంజయ్ లేఖలో మండిపడ్డారు.
సీఆర్‌ బిస్వాల్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన తొలి పీఆర్‌సీ నివేదికను 2018 జులై ఒకటి నుంచి అమలు చేయాల్సినప్పటికీ.. 21 నెలలుగా అమలు చేయకుండా ఉద్యోగులు, ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తక్షణమే కొత్త ‘పే రివిజన్ కమిషన్‌’ (PRC)ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే, ఉద్యోగుల తరఫున బీజేపీ ఉద్యమిస్తుందని హెచ్చరించారు.


Related News

Johnny Master: ఢీ 11 లో ఎలిమినేట్.. జానీ మాస్టర్ ఇంత కథ నడిపారా.?

Prabhas – Hanu : గప్ చుప్ గా షూటింగ్… ఇంత సీక్రెట్ గా ఎందుకో..?

Hansika Motwani: అసభ్యకరంగా తాకాడు.. నొప్పి భరించలేకపోయా అంటూ హన్సిక ఎమోషనల్..!

Mokshagna: తొలి మూవీ బడ్జెట్ ఎంతో తెలుసా.. ఆల్ టైం రికార్డ్ సృష్టించబోతున్న బాలయ్య..!

Nagabubu: నాగబాబు సెటైరికల్ పోస్ట్.. జానీ మాస్టర్ కేనా..?

Jani Master : కేసులో మరో ట్విస్ట్.. కూపీ లాగనున్న మహిళా కొరియోగ్రాఫర్..!

Bigg Boss 8 Day 18 Promo: హౌస్ లో పెద్ద డ్రామా నడుస్తోందే.. సోనియా కి ఝలక్ ఇచ్చిన నబీల్..!

Big Stories

×