EPAPER

Maoist: మెడికల్ మాఫియాకు మావోయిస్టుల స్ట్రాంగ్ వార్నింగ్.. రాక్షసుల్లా మారారంటూ ఆజాద్ ఆగ్రహం..

Maoist: మెడికల్ మాఫియాకు మావోయిస్టుల స్ట్రాంగ్ వార్నింగ్.. రాక్షసుల్లా మారారంటూ ఆజాద్ ఆగ్రహం..

Maoist: రోగం వస్తే చాలు.. జలగల్లా డబ్బు పీల్చేస్తుంటాయి కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు. దగ్గు వచ్చిందని హాస్పిటల్ కి వెళ్లినా.. రకరకాల టెస్టులు, స్కానింగులతో అడ్డంగా దోచేసుకుంటారు వైద్యులు. ఠాగూర్ సినిమాలో చూపించినట్టు.. డెడ్ బాడీకి చికిత్స చేస్తున్నట్టు నటించి పైసా వసూల్ చేసే కేటుగాళ్లు ఉన్నారు. సిటీల్లోనే పరిస్థితి ఇలా ఉంటే.. ఇక గ్రామాల సంగతి మరీ దారుణం. ఇక, గిరిజన ప్రాంతాల్లో అయితే నిలువు దోపిడే. అందుకే, భద్రాచలం మెడికల్ మాఫియా దారుణాలపై తాజాగా మావోయిస్టు పార్టీ కన్నెర్ర జేసింది. ఇలానే చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఆ మేరకు ఆజాద్ పేరుతో ఓ బహిరంగ లేఖ రిలీజ్ చేసింది. ఆ లెటర్ లో ఉన్నది ఉన్నట్టుగా….


“మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన భద్రాచలం ఇప్పుడు మెడికల్ మాఫియాకు కాసులు కురిపిస్తోంది. పూర్తి ఏజెన్సీ ప్రాంతం కావడంతో గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని సంపాదనే ధ్యేయంగా ఆసుపత్రులు పనిచేస్తున్నాయి. ప్రజల ఆరోగ్యాన్ని బూచిగా చూపి వారిని భయబ్రాంతులకు గురిచేసి రోగుల రక్తం పిండుకుంటున్నారు. ఛత్తీస్ గడ్, ఒడిస్సా, ఆంధ్ర ప్రాంత గిరిజనులు, గిరిజనేతరులతో పాటు స్థానిక తెలంగాణ ప్రాంత ప్రజలను వైద్యం పేరుతో రోజుల తరబడి ఆసుపత్రుల్లో ఉంచి అవసరం లేకున్నా రకరకాల పరీక్షలు చేస్తున్నారు. ల్యాబ్‌లు, ఆసుపత్రులు, వైద్యులు ప్రజలను డబ్బుల కోసం హింసిస్తున్నారు.

ప్రజల ప్రాణాలు ఇప్పుడు ఆసుపత్రులకు డబ్బులు కురిపించే అవకాశాలుగా మారాయి. ప్రజల నమ్మకానికి తూట్లు పొడుస్తూ కొందరు వైద్యులు రాక్షసుల్లా తయారయ్యారు. పెద్దోళ్లు.. పేదోళ్ళనే తేడాలు లేకుండా రోగుల రక్తం జలగల్లా పీల్చుతున్నారు. ఆరోగ్య సమస్యలను అలుసుగా చేసుకుని మనిషిలో రకరకాల పరీక్షల పేర్లతో భయాన్ని సృష్టిస్తూ ఆసుపత్రి గల్లలను కొల్లలుగా నింపుకుంటున్నారు. ప్రైవేటు ఆసుపత్రి మొదలుకొని ప్రభుత్వ ఆసుపత్రి వరకు కాసుల కక్కుర్తి మరిగిన వైద్యులు జనాలను పీడించుకుతింటున్నారు.


ముఖ్యంగా భద్రాచలం ప్రభుత్వ వైద్యశాలలో పని చేసే వైద్యులు సైతం తమ సొంత క్లీనిక్ లకు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ప్రభుత్వ పని వేళలను విస్మరిస్తున్నారు. సమయానికి రోగికి అందించాల్సిన వైద్యాన్ని నిర్లక్ష్యం చేయడమే కాకుండా, ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగుల్లో లేనిపోని అబద్దపు అపోహలతో భయాన్ని పెంచి తమ సొంత క్లీనిక్స్‌ని తరలించుకుంటున్నారు.

ప్రధానంగా మెడికల్ మాఫియాగా మారిన వైద్య వృత్తి ఫార్మ కంపెనీలతో జతకడుతూ తక్కువ ధరకు అమ్మాల్సిన మందులను బ్రాండుల పేర్లతో ఎక్కువ ధరలకు అమ్ముకుంటున్నారు. ఇక్కడి వైద్యులు మనుషులకి కరెన్సీ నోట్లు ముద్ర చేసే యంత్రాల్లా భావిస్తూ నోటికి వచ్చిన టెస్టుల పేర్లు చెబుతూ, ఖరీదైన మందుల పేర్లు రాస్తూ పేద ప్రజలను రాబందుల్లా పీక్కుతింటున్నారు.

భద్రాచలం మెడికల్ మాఫీయాకు హెచ్చరిక..!
ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే వైద్యులు వారి సమయాన్ని పూర్తిగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేటాయించకుండా ఇలానే ప్రవర్తిస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. గిరిజన ప్రాంతమైన భద్రాచలం ప్రాంతంలో సంపాదనే ధ్యేయంగా ప్రైవేటు ఆసుపత్రులను ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో నివసించే గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని కోట్లకు పడగెత్తిన వైద్యులు, ల్యాబ్, మెడికల్ షాప్‌ల యజమానులు తమ పద్ధతిని మర్చుకొక పోతే ప్రజాకోర్టు‌లో శిక్ష తప్పదు.”

Tags

Related News

Johnny Master : జానీ మాస్టర్ పై వేటు.. కేసు పెట్టడం పై ఆ హీరో హస్తం ఉందా?

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Big Stories

×