EPAPER

Sankranti: బాలయ్య, చిరు సినిమాల్లో 10 పోలికలు.. అరే, నిజమేగా!

Sankranti: బాలయ్య, చిరు సినిమాల్లో 10 పోలికలు.. అరే, నిజమేగా!

Sankranti: వీరసింహారెడ్డి. వాల్తేరు వీరయ్య. సంక్రాంతి బరిలో దుమ్ము రేపుతున్నాయి. రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోతున్నాయి. వీరసింహారెడ్డి.. బాలయ్య ఫ్యాన్స్ కు విజువల్ ఫీస్ట్ గా నిలిచింది. వాల్తేరు వీరయ్య.. అన్నివర్గాలను అలరిస్తోంది. హిట్ టాక్ తో.. సంక్రాంతి అటెన్షన్ మొత్తాన్ని తమవైపే లాగేసుకున్నారు బాలకృష్ణ, చిరంజీవి.


ఒక్కరోజు గ్యాప్ తో వచ్చిన ఈ రెండు సినిమాల్లో పలు కామన్ పాయింట్స్ ఉన్నాయి. అవి అనుకోకుండా అలా కుదిరాయి. వాటిపై సోషల్ మీడియాలో హాట్ డిస్కషన్ నడుస్తోంది. నందమూరి ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్.. మీరు మేము సేమ్ టు సేమ్ అంటూ సేమ్ పించ్ లు పెట్టుకుంటున్నారు. గతంలో మీరా? మేమా? అంటూ పోట్లాడుకునే ఇరువురి ఫ్యాన్స్ ఇప్పుడిలా కామన్ పాయింట్స్ తో కలిసిపోవడం ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఆ 10 కామన్ పాయింట్స్ ఇవే….

–జనవరి 12న రిలీజ్ అయింది ‘వీర’సింహారెడ్డి. జనవరి 13న వాల్తేరు ‘వీర’య్య వచ్చింది. ఈ రెండు సినిమా టైటిల్స్ లో ‘వీర’ కామన్.


–బాలయ్య సరసన.. చిరంజీవికి జంటగా.. రెండిట్లోనూ శ్రుతిహాసనే హీరోయిన్.

–రెండు సినిమాల్లోనూ క్లైమాక్స్‌లో విలన్ తల తెగిపడుతుంది.

–సినిమాల్లో వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య పాత్రలు ఒకేలా ముగుస్తాయి.

–బాలయ్య, చిరు రోల్ ను ఎలివేట్‌ చేసే పాటలు, ఐటెమ్‌ సాంగ్స్‌ దాదాపు సేమ్ గా ఉంటాయి.

–రెండు సినిమాలు ఫస్ట్ హాఫ్ లో పలు సీన్లు ఫారిన్ లో చిత్రీకరించారు. వీరసింహారెడ్డి ఇస్తాంబుల్ వెళితే.. వీరయ్య మలేషియాను టచ్ చేశారు.

–వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య.. ఇద్దరి ఫస్ట్ ఫైట్ పడవలపై షూట్ చేసిందే కావడం మరింత ఆసక్తికరం.

–సెంటిమెంట్‌కు ప్రాధాన్యం ఇస్తూ వీరసింహారెడ్డిలో సవతి చెల్లి (వరలక్ష్మీ), వాల్తేరు వీరయ్యలో సవతి తమ్ముడు (రవితేజ) పాత్రలు ఆయా సినిమాల్లో కీలకంగా ఉన్నాయి.

–రెండు సినిమాల దర్శకులు ఆయా హీరోల అభిమానులే. గోపీచంద్‌ మలినేని.. బాలకృష్ణ ఫ్యాన్ కాగా, బాబీ చిరంజీవి అభిమాని.

–రెండు సినిమాలకీ మైత్రి మూవీ మేకర్సే నిర్మాతలు. రెండింటి ప్రొడక్షన్‌ డిజైనర్‌ ఒక్కరే. యాక్షన్‌ కొరియోగ్రఫీ, డ్యాన్స్‌ కొరియోగ్రఫీలో రెండు సినిమాలకు సేమ్ టీమ్ పని చేసింది.

Related News

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Land Grabbing: వంశీరాం టు సోహిణి.. లిటిగేషన్స్ సో మెనీ.. కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Vegetables Price: కూరగాయల ధరలకు రెక్కలు.. జేబుకు చిల్లు.. ఇంతలా పెరగడానికి రీజనేంటి ?

Big Stories

×