EPAPER

Sankranti History: ప్రాంతానికో సంక్రాంతి ఎలా పుట్టింది.

Sankranti History: ప్రాంతానికో సంక్రాంతి ఎలా పుట్టింది.

Sankranti History:సంక్రాంతి అంటే మార్పు . సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయనంకు మారే సమయం. ఖగోళ పరంగా చూస్తే 96 రకాల సంక్రాంతులున్నాయి. 9 గ్రహాలు ఒకరాశి నుంచి మరోక రాశిలోకి మారుతూ ఉంటాయి. అలా లెక్కపెడితే 108 సంక్రమణలు ఉంటాయి. కానీ వీటిలో సూర్యుడు సంక్రమణ చేస్తే లెక్కలోకి తీసుకుంటారు. సూర్యుడి సంక్రమణ ఫలితాలు విశేషంగా ఉంటాయి. సూర్యుడు ఒక్కో రాశిలోకి మారేటప్పుడు ఒక్కో సంక్రమణ వస్తుంది.


సంక్రాంతి అని తెలుగునాట అన్నా మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో సంక్రాత్ అని పిలిచినా జనవరి 15న ఒకే విధంగా జరుపుకునే పండుగ సంక్రాంతి. మిగిలిన భారతీయ పండుగలకు విభిన్నంగా నిలబడటానికి కారణం మకర సంక్రాంతికి ఒక తేదీ నిర్ణయించడమే.. రాష్ట్రాల వారీగా విభిన్న సాంస్కృతిక రూపాలలో, విభిన్నపేర్లతో జరుపుకున్నప్పటికీ రైతు పండించిన పంట ఇంటికొచ్చే వేళలో చేసుకునే పెద్దపండుగ మకర సంక్రాంతి. ఆంధ్రప్రదేశ్ లో ఈ పండగ 3 రోజులు జరుపుతారు, మొదటి రోజు భోగి పండుగ . ఆరోజు ఇళ్లముందు, ప్రదాన కూడళ్లలో భోగి మంటలు వేస్తారు. మరునాడు సంక్రాంతి . కొత్త బియ్యం, పాలు, బెల్లంతో చేసిన పొంగలి వంటకం తయారు చేస్తారు.

ఢిల్లీ హర్యానాలలో సక్రాత్ లేదా సంక్రాంతిపేరుతో ఈ పండుగ జరపుకుంటారు. ఈరోజు నేతితో చేసిన హల్వా, ఖీర్ ప్రత్యేకంగా తయారు చేస్తారు. బావలకు బావమరుదులు కొత్త బట్టలు పెడతారు దీన్ని సిధ్ధ అని పిలుస్తారు. పెళ్లైన మహిళలు తమ అత్తమామలకు బహుమతులు ఇస్తారు దీన్ని మననా అంటారు. పురుషులందరూ కలిసి ఒక చోట కూర్చుని హుక్కా పీల్చుకుంటుంటే మహిళలు జానపదాలు పాడుతూ ఆడతారు.


రాజస్థాన్, గుజరాత్ లో ఉత్తరయన్ అని, పంజాబ్ లో లోహిరి, పేరుతో సంక్రాంతిని జరుపుకుంటారు . తమిళనాడులో పొంగల్ పేరుతో , కర్ణాటకలోను పెద్దపండుగ కిందే నిర్వహిస్తారు. ప్రకృతి పట్ల కృతజ్ఞత, ప్రేమను ప్రకటించే పండుగల్లో సంక్రాంతికి ప్రాధాన్యముంది. పంటలే ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న నేపధ్యంలో కొత్త పంట చేతికి వచ్చేది ఈ రోజుల్లోనే.

Tags

Related News

Sun Transit Horoscope: సూర్యుని దయతో ఈ రాశుల వారికి గోల్డెన్ టైం రాబోతుంది

Tirumal Laddu: పవిత్ర తిరుమల లడ్డూ తయారీలో 8 మంది కీలక పాత్ర, ఇంతకీ వాళ్లు ఎవరో తెలుసా?

Tulasi Plant: తులసి పూజ ఎప్పుడు చేయాలి, వాయు పురాణం ఏం చెబుతోందంటే..

Horoscope 20 September 2024: ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే! శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం!

Lucky Rashi from Durga Sasthi 2024: దుర్గా షష్ఠి నుండి ఈ రాశులకు వరుసగా 119 రోజులు లక్ష్మీ అనుగ్రహం

Mahalaya Surya Grahan 2024: మహాలయలో సూర్యగ్రహణం, ఈ 3 రాశుల వారి జీవితంలో అన్నీ అద్భుతాలే

Surya Grahan 2024: త్వరలో సూర్య గ్రహణం.. ఈ రోజు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి

Big Stories

×