EPAPER

KCR: కేసీఆర్ ‘కాపు’ కార్డు.. ఆ ఇద్దరికీ ‘ఏపీ’ లెక్కుందా?

KCR: కేసీఆర్ ‘కాపు’ కార్డు.. ఆ ఇద్దరికీ ‘ఏపీ’ లెక్కుందా?

KCR: కేసీఆర్ ను రాజకీయ చాణక్యుడు అంటారు కొందరు. ఆయన చేసే ప్రతీ పనిలోనూ, ఆయన మాట్లాడే ప్రతీ మాటలోనూ.. ఏదో రాజకీయం దాగే ఉంటుందని చెబుతారు. కేసీఆర్ నిద్రపోతూ కూడా ఆలోచిస్తారనేది ఓ మీడియా అధినేత తరుచూ అనే మాట. అలాంటి కేసీఆర్.. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడం చాలామందికి షాకింగ్ విషయమే. ఆయనకు అంత సీనుందా? అనే విమర్శలే ఎక్కువ. అలాంటి విమర్శలను లెక్క చేయకుండా.. ఓ లెక్క ప్రకారం ముందుకు సాగుతున్నారు గులాబీ బాస్. కర్నాటక ఎన్నికలపై మొదటగా ఫోకస్ పెడతామని ప్రకటించి.. ఏపీ పాలిటిక్స్ లో వేగంగా ముందడుగులు వేస్తుండటం ఆసక్తికరం. ఏపీలో బీఆర్ఎస్ కండువా ఎవరు కప్పుకుంటారని అంతా అనుకుంటుండగా.. వారందరినీ అవాక్కయ్యేలా చేస్తూ రిటైర్డ్ ఐఏఎస్, మాజీ జనసేన కీలక నేత తోట చంద్రశేఖర్ ను ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిని చేసి ఆశ్చర్యపరిచారు. రావెల కిశోర్ బాబు లాంటి మాజీ మంత్రి సైతం బీఆర్ఎస్ లో చేరడం ఆసక్తికరం.


ఏరికోరి తోట చంద్రశేఖర్ నే ఏపీ బీఆర్ఎస్ చీఫ్ ను చేయడం వెనుక ‘కాపు’ వ్యూహం ఉందంటూ ప్రచారం జరిగింది. కాపుల ఓట్ల కోసమే గులాబీ ‘తోట’ అంటూ వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఏపీలో కాపు రాజకీయం కాక మీదుండగా.. ఆ వర్గాన్ని చీల్చి.. జనసేనను దెబ్బకొట్టి.. పరోక్షంగా తన రహస్య మిత్రుడు జగన్ కు లబ్ది చేకూర్చడానికే ఇదంతా అంటూ విశ్లేషణలు వచ్చాయి. ఇలాంటి రాజకీయ దుమారం నడుస్తుండగానే.. మరో వ్యూహాత్మక ‘కాపు’ పావు కదిపారు కేసీఆర్.

తెలంగాణ సీఎస్ గా శాంతికుమారి. అనూహ్యంగా ఆమెకు కీలక పదవి వరించింది. రేసులో పలువురు సీనియర్లు ఉన్నా.. శాంతికుమారినే సీఎస్ గా ఎంపిక చేశారు సీఎం కేసీఆర్. అయితే, శాంతికుమారికి సీఎస్ పదవి ఇవ్వడంపై ఏపీ బీఆర్ఎస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. అదేంటి? వారికేంటి? అని ఆరా తీస్తే.. శాంతికుమారి సైతం ‘కాపు’ అని తెలిసింది.


ఏపీ మహిళ. అందులోనూ ‘కాపు’. సీఎస్ గా శాంతికుమారి ఎంపిక వెనుకా రాజకీయ వ్యూహం ఉందనే వాదన వినిపిస్తోంది. ఏపీ మహిళను అత్యున్నత కుర్చీలో కూర్చోబెట్టడంతో.. కేసీఆర్ ఆంధ్రులకు వ్యతిరేకి అనే ముద్రను కాస్త కడిగేసుకున్నారు. పలువురు సీనియర్లు ఉన్నా.. వేరే వారికి అవకావం ఉన్నా.. ఏపీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న అధికారిని సీఎస్ గా నియమించి ఆంధ్రుల ఆదరణ చూరగొనచ్చనేది కేసీఆర్ లెక్క అంటున్నారు. ఇక్కడ టూ బర్డ్స్ ఎట్ వన్ షాట్. అటు ఏపీ మహిళ.. అందులోనూ కాపు వర్గానికి చెందిన ఆఫీసర్. ఈ నిర్ణయంతో మరోమారు కాపుల మార్కులు కొట్టేసే ఛాన్స్ ఉంటుందనేది కేసీఆర్ ఆలోచన కావొచ్చని చెబుతున్నారు.

ఇటు సీఎస్ గా శాంతికుమారి.. అటు ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షునిగా తోట చంద్రశేఖర్. ఇద్దరూ కాపులే. ఇంతవరకూ ఏ ఏపీ సీఎం చేయనట్టుగా.. కేసీఆర్ కాపులకు పెద్దపీఠ వేస్తున్నారనే భావన. ఏపీలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కాపునే సీఎం అంటూ ప్రచారం. కాపులకు ఇంతకన్నా ఇంకేం కావాలంటూ ఆ వర్గాన్ని బీఆర్ఎస్ వైపు మళ్లించే వ్యూహం..అంటున్నారు విశ్లేషకులు. ఉద్యమ సమయంలో ప్రాంతీయ వాదాన్ని వాడుకున్నట్టుగానే.. ఏపీలో కేసీఆర్ కాపు సెంట్రిక్ పాలిటిక్సే చేస్తారనే వాదన వినిపిస్తోంది. అయితే, ప్రస్తుతం పవన్ ను కాపు హీరోగా చూస్తున్న ఆ వర్గమంతా.. అంతఈజీగా కేసీఆర్ వైపు మళ్లుతుందా? ఎంతోకొంత షిఫ్ట్ అయినా అది ఎవరికి లాభం? ఎవరికి నష్టం? అంటూ లెక్కలేస్తున్నారు రాజకీయ పండితులు.

Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×