EPAPER

YCP Leaders : బాబు చేతిలో జోకర్ పవన్.. జనసేనానిపై వైసీపీ కౌంటర్ ఎటాక్..

YCP Leaders : బాబు చేతిలో జోకర్ పవన్.. జనసేనానిపై వైసీపీ కౌంటర్ ఎటాక్..

YCP Leaders : శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన యువశక్తి సభలో ఏపీ ప్రభుత్వంపై జనసేనాని పవన్ కల్యాణ్ చేసిన విమర్శలు పొలిటికల్ హీట్ ను పెంచాయి. పవన్ పై వైసీపీ నేతలు కౌంటర్ ఎటాక్ కు దిగారు. తనను సంబరాల రాంబాబు అని వ్యాఖ్యానించడం అంబటి సెటైర్లు వేశారు. ‘ నేను సంబరాల రాంబాబునైతే.. నువ్వు కల్యాణాల పవన్‌వి’ అని అంబటి రాంబాబు ట్వీట్‌ చేశారు. పీకే అంటే పిచ్చి కుక్క అని, పవన్‌.. చంద్రబాబు జోకర్‌వి అని విమర్శించారు.


పవన్‌ తనపై చేసిన వ్యాఖ్యలకు మంత్రి రోజా ఘాటుగా సమాధానమిచ్చారు. డైమండ్ రాణి అని సంబోధించడంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండుసార్లు గెలిచిన తాను.. రెండుచోట్ల ఓడిపోయిన నీతో తిట్టించుకోవాలా అంటూ రోజా మండిపడ్డారు.

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే వీరమరణం తప్పదనే విషయాన్ని పవన్‌‌ ముందే ఒప్పేసుకున్నారంటూ
కామెంట్‌ చేశారు. ఐటీశాఖ మంత్రి పేరు పవన్ కు తెలియదన్నారు. కనీసం భార్యల పేర్లైనా గుర్తున్నాయా? గుర్తుపెట్టుకోవాలి కదా! బహుశా ప్యాకేజీ ఇచ్చిన చంద్రబాబు పేరు మినహా ఎవరి పేరు గుర్తుండదేమో? అంటూ పవన్‌పై సెటైర్లు వేశారు.


కాపులను మూట కట్టి తీసుకెళ్లి చంద్రబాబు కాళ్ల దగ్గర పెట్టేద్దామనే ఆలోచన పవన్ కు ఉందేమోనని అమర్నాథ్ మండిపడ్డారు. వైఎస్ఆర్‌సీపీ తప్ప బీజేపీ , సీపీఐ, సీపీఎం , బీఎస్పీ తోపాటు అన్ని రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకున్నారని మండిపడ్డారు. ఈసారి నీ బెండు తీయడం ఖాయమని ఘాటుగా విమర్శించారు. చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీ తీసేసుకో.. ఇవ్వాల్సిన అందరికీ భరణాలు ఇచ్చేసేయ్ అంటూ సెటైర్లు వేశారు. ముత్తైదువులను పక్కన కూర్చోబెట్టుకుంటావు అందులోకి ఒక వెన్నుపోటు దారుడు ఉన్నాడని బాబుపై సెటైర్‌ వేశారు.

పవన్ కల్యాణ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల పేర్లు చెప్పగలిగితే..తాను రాజకీయాలు వదిలేసి వెళ్లిపోతానని మంత్రి అమర్నాథ్‌ వ్యాఖ్యానించారు. సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అద్భుతమైన ప్రజా మోద కార్యక్రమాల వల్ల 2024లో ఆయనే ముఖ్యమంత్రి అవుతారని మంత్రి గుడివాడ అమర్నాథ్‌ విశ్వాసం వ్యక్తం చేశారు.

Related News

ysrcp petition: తిరుమల లడ్డూ వివాదం.. హైకోర్టులో వైసీపీ పిటిషన్, కాకపోతే కోర్టు..

Ex MP Nandigam Suresh’s house: ఇదేం కేసు.. వైసీపీ మాజీ ఎంపీ ఇంట్లో సోదాలు, నోటీసులిచ్చిన పోలీసులు

Tirumala Prasadam row: తిరుమల లడ్డూ వివాదం, రామ్ జన్మభూమి ట్రస్ట్.. రమణ దీక్షితులు రియాక్ట్, శారదా పీఠం సైలెంట్ వెనుక..

Pawan Kalyan: తిరుమల లడ్డూ వివాదం.. డిప్యూటీ సీఎం పవన్ సంచలన పోస్ట్

Shani effect to Jagan: జగన్‌ను వెంటాడుతున్న శని, పుష్కర‌కాలంపాటు..

CM Chandrababu warning: తిరుపతి లడ్డూ వివాదం, నిన్ను వదలా అంటున్న సీఎం.. అయోధ్య వరకూ

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Big Stories

×