EPAPER

Team India : టాలెంట్ ఫ్లేయర్స్ ఎక్కువ మంది ఉండటమే టీమిండియా సమస్యా..?

Team India : టాలెంట్ ఫ్లేయర్స్ ఎక్కువ మంది ఉండటమే టీమిండియా సమస్యా..?

Team India : ఈ ఏడాదిలోనే వన్డే వరల్డ్ కప్ జరగబోతోంది. టీమిండియా 2011లో చివరిసారిగా వన్డే వరల్డ్ కప్ సాధించింది. టీ20 వరల్డ్ సాధించి 15 ఏళ్లు దాటింది. ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది. ఐసీసీ ఛాంపియన్ ట్రోఫి గెలిచి 9 ఏళ్లు దాటింది. ఇలా భారత్ ఐసీసీ ట్రోఫి కోసం దాదాపు దశాబ్దకాలంగా ఎదురుచూస్తోంది. లోపం ఎక్కడుంది? దైప్వాక్షిక సిరీస్ లో అద్భుతంగా రాణిస్తున్న టీమిండియా ఐసీసీ టోర్నిలో విజేతగా నిలవడంలో విఫలవుతోంది. వన్డే, టెస్టుల్లో 58 శాతం విజయాలు నమోదు చేస్తున్న భారత్.. టీ20ల్లో 70 శాతం విజయాలు అందుకుంటుంది. కానీ వరల్డ్ కప్ కి వచ్చే సరికి ఒట్టి చేతులతో తిరిగి వస్తోంది. కోహ్లీ కెప్టెన్సీలో ఒక్క ఐసీసీ ట్రోఫి కూడా దక్కలేదు. చివరిగా ధోని భారత్ కు 3 ఐసీసీ ట్రోఫిలు అందించాడు. ఇప్పుడు రోహిత్ కెప్టెన్సీలోనూ తొలి టీ20 వరల్డ్ కప్ లో సెమీస్ లో ఇంటిదారి పట్టింది భారత్ జట్టు.


ఈ ఏడాదే వన్డే వరల్డ్ కప్ జరగబోతోంది. ఇప్పుడు శ్రీలంకతో వన్డే సిరీస్ జరుగుతోంది. తర్వాత స్వదేశంలో ఆస్ట్రేలియాతో సిరీస్ కు సిద్ధమవుతోంది. వన్డేలు, టీ20లతోపాటు టెస్టులు ఆడబోతోంది. ఇప్పటికే టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ రేసులో ఆసీస్ ,భారత్ ముందంజలో ఉన్నాయి. దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు పోటీ పడుతున్నా… ఫైనల్ భారత్- ఆసీస్ జట్ల మధ్య జరిగే ఛాన్స్ ఉంది. మరి ఈసారైనా కప్ సాధిస్తారా?

బ్యాటింగ్ కు ఢోకాలేదు..
భారత్ జట్టులో సీనియర్ ఫ్లేయర్లకు కొదవలేదు. సచిన్ ఎరలో ఆట ప్రారంభించిన ఆటగాళ్లు ఇప్పటికీ చాలా మంది జట్టులో ఉన్నారు. కోహ్లీ, శిఖర్ ధావన్, రోహిత్, అశ్విన్, జడేజా ఇలాంటి స్టార్లు అందరూ సచిన్ తో కలిసి ఆడిన వారే. అలాగే యువ టాలెంట్ కు ఢోకాలేదు. మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ టీ20ల్లో వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్ గా ఉన్నాడు. అలాగే శ్రేయస్ అయ్యర్ మూడు ఫార్మాట్లలో నిలకడగా రాణిస్తున్నాడు. ఇషాన్ కిషన్ బంగ్లాదేశ్ పై వన్డేలో డబుల్ సెంచరీ కొట్టి ఓపెనర్ స్థానానికి పోటీ పడుతున్నాడు. శుభ్ మన్ గిల్ అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాడు. బ్యాటింగ్ వరకు భారత్ కు ఢోకాలేదు.


ఆల్ రౌండర్ల కొరత
హార్థిక్ పాండ్యా, రవీంద్ర జడేజా ఆల్ రౌండర్లగా తగిన న్యాయం చేస్తున్నారు. అటు బంతితో ఇటు బ్యాట్ తో రాణిస్తున్నారు. అయితే తరచూ గాయాల పాలవడం పెద్ద మైనస్ పాయింట్. కీలక టోర్నిలో ఇలాంటి ఆటగాళ్ల సేవలు అందుబాటులో లేకపోతే జట్టు వారి లోటును భర్తీ చేయడం కష్టం . అలాగే ఈ మధ్య కాలంలో అక్షర్ పటేల్.. జడేజా స్థానంలో జట్టులోకి వచ్చి
ఇటు బౌలింగ్ లోనే కాకుండా..బ్యాట్ తో నూ మెరుపులు మెరిపిస్తున్నాడు. ఈ ముగ్గురు తప్పితే మరో ఆల్ రౌండర్ జట్టుకు అందుబాటులో లేడు. శార్థుల్ ఠాకూర్, దీపక్ చాహర్ బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉన్నా.. వాళ్లు బౌలింగ్ లోనూ, బ్యాటింగ్ నిలకడైన ప్రదర్శన చేయలేకపోతున్నారు.

ఫాస్ట్ బౌలర్లు..గాయాల బెడద
బూమ్రా, భువనేశ్వర్, షమీ ఈ ముగ్గురు సీనియర్లు జట్టులో ఒకసారి ఆడిన సందర్భాలు చాలా తక్కువ. ఎందుకంటే ఈ ముగ్గురిలో ఎప్పుడు ఎవరు గాయపడతారో తెలియదు. సిరాజ్, ఉమ్రాన్ మాలిక్ లాంటి ఆటగాళ్లు ఇచ్చిన అవకాశాలు వినియోగించుంటున్నా వారికి మరింత అనుభవం రావాల్సి ఉంది. ఫాస్ట్ బౌలర్ల గాయాల బెడద టీమిండియాకు ఇబ్బందులు తెచ్చిపెడుతోంది.

స్పిన్నర్లు
చాహల్, కులదీప్ స్పిన్నర్ల కోటా జట్టులో ఉన్నారు. అయితే చాహల్ ఈ మధ్యకాలంలో భారీగా పరుగులు ఇచ్చేస్తున్నాడు. కులదీప్ కు రెగ్యులర్ ఫ్లేయర్ గా జట్టులో స్థానం దక్కడంలేదు.
కూర్పే సమస్య
భారత్ జట్టుకు కూర్పు ప్రధాన సమస్యగా మారింది. శ్రీలంక సిరీస్ కు ఇషాన్ కిషన్ , సూర్యకుమార్ లాంటి ఫ్లేయర్లను బెంచ్ కే పరిమితం చేయాల్సి వచ్చింది. బ్యాటింగ్ ఆర్డర్ లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. టాలెంట్ ఉన్న బ్యాటర్లు ఎక్కువగా టీమిడింయాకు అందుబాటులో ఉన్నారు. అయితే వీరికి రోటేషన్ పద్దతిలో అవకాశాలు కల్పిస్తున్నారు. మరి వరల్డ్ కప్ కు ఎలాంటి జట్టును ఎంపిక చేస్తారో చూడాలి.

Tags

Related News

Johnny Master : జానీ మాస్టర్ పై వేటు.. కేసు పెట్టడం పై ఆ హీరో హస్తం ఉందా?

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Big Stories

×