EPAPER

Pawan Kalyan : మీ నాన్న వైఎస్‌నే ఎదుర్కొన్నా.. నువ్వెంత?.. జగన్ పై పవన్ ఫైర్..

Pawan Kalyan : మీ నాన్న వైఎస్‌నే ఎదుర్కొన్నా.. నువ్వెంత?.. జగన్ పై పవన్ ఫైర్..

Pawan Kalyan : శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన యువశక్తి సభలో పవన్‌ కల్యాణ్ ఎవడ్రా మనల్ని ఆపేది అంటూ తన ప్రసంగం ప్రారంభించారు. ఏపీ ప్రభుత్వాన్ని , సీఎం జగన్ ను ఏకిపారేశారు.
సీఎంకు గ్యాంబ్లింగ్‌ పిచ్చి అని ఈ మధ్యే తెలిసిందన్నారు. ఖైదీ నంబర్‌ 6093 కూడా తన గురించి మాట్లాడితే ఎలా? అని ప్రశ్నించారు. సరైన రాజు లేకపోతే సగం రాజ్యం నాశనం అవుతుందని.. సలహాలిచ్చేది సజ్జల అయితే రాజ్యం పూర్తిగా నాశనం అవుతుందని విమర్శించారు. మంత్రి ధర్మాన ప్రసాదరావుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఒక నేత ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రం సాధిస్తానంటున్నారని మీకు పదవులు లేకపోతే రాష్ట్రాన్ని ముక్కలు చేస్తారా? అని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర రాష్ట్రం ఇస్తే అప్పడంలా నమిలేస్తారని ఆరోపించారు. రాష్ట్రాన్ని ముక్కలు చేస్తామంటే .. మిమ్మల్ని ముక్కలు చేస్తామంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు జనసేనాని. ప్రభుత్వం 1280 ఎకరాలు తాకట్టు పెడితే ఉత్తరాంధ్రపై ప్రేమ ఏమైందని ధర్మానను ప్రశ్నించారు.


పెళ్లిళ్లపై సీఎం జగన్ చేసిన వ్యాఖలకు పవన్ కౌంటర్ ఇచ్చారు. ఇది మూడు ముక్కల ప్రభుత్వం.. 3 ముక్కల సీఎం అని విమర్శించారు. విడాకులు ఇచ్చి తాను పెళ్లిళ్లు చేసుకున్నానని స్పష్టం చేశారు. మీ నాన్న వైఎస్‌నే ఎదుర్కొన్నా.. నువ్వెంత? పంచెలూడదీసి కొడతానని అప్పట్లోనే సవాల్‌ చేశానని గుర్తు చేశారు. అన్నీ తెగించే రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టంచేశారు. ప్యాకేజీ అంటే చెప్పు తీసుకుని కొడతానని గతంలోనే చెప్పానని మళ్లీ ఎవడైనా ప్యాకేజీ అంటే.. ఏం చేస్తానో చూడండి అని వార్నింగ్ ఇచ్చారు. సంబరాల రాంబాబూ పిచ్చి కూతలు ఆపండి అని మంత్రి అంబటి రాంబాబును ఉద్దేశించి విమర్శించారు. తాను బతికున్నంత వరకూ యుద్ధం చేస్తూనే ఉంటానని తేల్చిచెప్పారు. కులం మద్దతివ్వకపోయినా ఫర్లేదు కానీ కులాల మధ్య చిచ్చుపెట్టి గెలవాలనుకోవట్లేదని పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు.

తనకు అవకాశం ఇస్తే ఉత్తరాధ్ర వెనుబాటుతనాన్ని రూపుమాపుతానని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. ఉత్తరాంధ్ర వలసలు ఆపుతా, అభివృద్ధి చేస్తా చెప్పారు. జనసైనికులు కేవలం నినాదాలిస్తే సరిపోదని పోలింగ్‌ రోజు ఓటు వేసే వరకు ఆ కసి ఉండాలని సూచించారు. గత ఎన్నికల్లో చట్ట సభల్లో పోరాడే శక్తి ఇవ్వలేదన్నారు. అందుకే ప్రజా క్షేత్రంలో పోరాడుతున్నాని చెప్పారు. రెండో చోట్లా ఓడిపోయానని ఆ డైమండ్‌ రాణి రోజా కూడా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వైసీపీకి 30 మంది ఎంపీలు ఉండి ఏం ప్రయోజనమన్నారు. జనసేనకు 10మంది ఎమ్మెల్యేలు ఉన్నా బలంగా పోరాడే వాడిని స్పష్టం చేశారు. ‘బీమ్లానాయక్‌’ రిలీజ్‌ అపితే రూ.30 కోట్లు నష్టం వస్తే భరించ లేదా? అని పవన్‌ అన్నారు.


తన కోసం తొలి ప్రేమ, ఖుషి సినిమాల వరకే పోరాటం చేశానని చెప్పారు. సినిమాల విజయం ద్వారా ఆనందం కలగలేదన్నారు. సామాన్యుల కష్టం తనను ఆనందంగా ఉండనివ్వలేదన్నారు. నాయకుల నిజ వ్యక్తిత్వాలు చిరాకు, బాధ కలిగించాయని చెప్పారు. రాష్ట్ర విభజన జరిగిన తీరు చూసి బాధ కలిగిందని తెలిపారు. ప్రతీ సన్నాసితో తిట్లు పడుతున్నా బాధ కలగట్లేదన్నారు. సాటి మనుషుల కోసం జీవించడం గొప్ప విషయంగా భావిస్తున్నాన్నారు.

శ్రీకాకుళం గొప్పతనానికి గిడుగు రామ్మూర్తి జీవితమే నిదర్శనమన్నారు. శ్రీశ్రీ కవిత్వం, రావిశాస్త్రి, చాసో రచనలు స్ఫూర్తినిచ్చాయని తెలిపారు. ఉత్తరాంధ్ర పోరాటగడ్డ.. కళింగ ఆంధ్ర కాదు.. కలియబడే ఆంధ్ర. నేను గెలుస్తానో? ఓడుతానో? తెలియదు.. కానీ, పోరాటమే తెలుసు. గూండాలను ఎలా ఎదుర్కోవాలో బాగా తెలుసు. రణస్థలంలో మాట ఇస్తున్నా.. కడ శ్వాస వరకు రాజకీయాలను వదలను అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

పూర్తి స్థాయి రాజకీయ నాయకులం అని కొందరు చెబుతారని దేశంలో పూర్తి స్థాయి రాజకీయ నాయకులు ఎవరు ఉన్నారు? అని ప్రశ్నించారు. అందరూ వ్యాపారాలు, కాంట్రాక్టులు చేస్తూనే రాజకీయాల్లో ఉన్నారని , కపిల్ సిబల్‌, చిదంబరం లాంటి వారు న్యాయవాద వృత్తిలో కొనసాగుతూనే రాజకీయాల్లో ఉన్నారని తెలిపారు. అందుకే తాను కూడా రాజకీయాల్లో ఉంటూనే సినిమాలు చేస్తున్నానని పవన్ స్పష్టం చేశారు.

Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×