EPAPER

AP High Court : ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. అప్పటి వరకు జీవో నెం.1 సస్పెండ్..

AP High Court : ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. అప్పటి వరకు జీవో నెం.1 సస్పెండ్..

AP High Court : ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్ తగిలింది. రాష్ట్రంలోని రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీల నిర్వహణకు అనుమతులు లేవంటూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 1ని హైకోర్టు సస్పెండ్ చేసింది. ఈ నెల 23 వరకు ఆ జీవోను సస్పెండ్‌ చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.


జీవో నెం.1ని రద్దు చేయాలని కోరుతూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. ప్రతి పక్షాల గొంతు నొక్కేందుకు ప్రభుత్వం కుట్ర పూరితంగా జీవో జారీ చేసిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనల తర్వాత ప్రభుత్వం జారీ చేసిన జీవో నిబంధనలకు విరుద్ధంగా ఉందని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ అభిప్రాయం వ్యక్తం చేసింది. జీవో నెంబర్ 1ని ఈ నెల 23 వరకు సస్పెండ్ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 20కి వాయిదా వేసింది.

జీవో నంబర్ 1ని ప్రభుత్వ తీసుకురావగానే రాష్ట్ర ప్రభుత్వంపై అన్ని రాజకీయ ప్రక్షాల నుంచి విమర్శలు వచ్చాయి. ఆ జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. హైదరాబాద్ లో చంద్రబాబు, పవన్ భేటీ తర్వాత ఇదే విషయాన్ని ప్రస్తావించారు. జీవో నెంబర్ 1 ని ప్రభుత్వం ఉపసంహరించుకునే వరకు పోరాడతామని చెప్పారు. ఈ జీవోను రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. హైకోర్టు తాజా ఆదేశాల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం జీవోను ఉపసంహరించుకుంటుందా? హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసి జీవో అమలుకే ప్రయత్నం చేస్తుందా చూడాలి. నెల్లూరు జిల్లా కందుకూరు, గుంటూరులో టీడీపీ సభల్లో తొక్కిసలాట దుర్ఘటనలు జరిగి మొత్తం 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్ ప్రభుత్వం…జీవో నెంబర్ 1 ను తీసుకొచ్చింది.


Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×