EPAPER

Vande Bharat: విశాఖలో వందే భారత్‌ రైలుపై రాళ్ల దాడి.. అందుకేనా?

Vande Bharat: విశాఖలో వందే భారత్‌ రైలుపై రాళ్ల దాడి.. అందుకేనా?

Vande Bharat: విశాఖలో వందే భారత్‌ రైలుపై రాళ్ల దాడి జరిగింది. కంచరపాలెంలో వందే భారత్ పై కొందరు దుండగులు రాళ్లు విసిరారు. ఆ రాళ్ల దాడితో రైలు కిటికీ అద్దాలు పగిలాయి. విశాఖ స్టేషన్‌ నుంచి కోచ్‌ కాంప్లెక్స్‌కు ట్రైన్‌ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. వందే భారత్ రైలుపై రాళ్లు విసిరిన దుండగుల కోసం రైల్వే పోలీసులు గాలిస్తున్నారు.


ఇటీవల బెంగాల్ లోనూ వందే భారత్ రైలుపై కొందరు రాళ్లు విసిరిన ఘటన అప్పట్లో రాజకీయంగా దుమారం లేపింది. కేంద్రం-బీజేపీ మీద కోపంతో టీఎంసీ కార్యకర్తలో ఈ రాళ్ల దాడికి పాల్పడ్డారని కమలనాథులు ఆరోపించారు. అయితే, ఆ దాడి జరిగింది బెంగాల్ లో కాదని.. బీహార్ లో అని ఆ తర్వాత విచారణలో తేలింది.

తాజాగా, విశాఖలో వందే భారత్ రైలుపై అదే విధంగా రాళ్ల దాడి జరగడం ఆకతాయిల పనిగా చూడలేం అంటున్నారు. కేంద్రంపై, మోదీ విధానాలపై ఆగ్రహంగా ఉన్న వర్గమే ఇలా రైలుపై రాళ్లు విసిరి ఉంటారని అనుమానిస్తున్నారు. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖలో పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుండగా.. ఇప్పుడిలా వందే భారత్ రైలుపై రాళ్లతో దాడి చేసి కేంద్రానికి నిరసన సెగ తెలియజేశారా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Tags

Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×