EPAPER

RRR: చంద్రబాబుకు ఎన్టీఆర్ థ్యాంక్స్.. ఏంటి సంగతి?

RRR: చంద్రబాబుకు ఎన్టీఆర్ థ్యాంక్స్.. ఏంటి సంగతి?

RRR: నాటు నాటుకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్. RRRకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు. భారతీయులంతా గర్వించే సందర్భం. తెలుగువారు రొమ్ము విరుచుకుని మరీ ఇది మా సినిమా.. మాకొచ్చిన అవార్డు అంటూ సంబరపడే సమయం. గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కించుకున్న RRR టీమ్ కు ప్రముఖులు, సెలబ్రిటీల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని మోదీ నుంచి ఏపీ సీఎం జగన్ వరకూ అంతా విషెష్ చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు సైతం RRR బృందాన్ని ప్రశంశించారు. ఇక్కడే ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.


చంద్రబాబు చేసిన ట్వీట్ కు RRR హీరో జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. “థ్యాంక్యూ మావయ్యా” అంటూ రిప్లై ఇచ్చారు. ఇదే ఇప్పుడు రాజకీయంగా ఇంట్రెస్టింగ్ పాయింట్. చంద్రబాబు ట్వీట్ లో ఎక్కడా ఎన్టీఆర్ ను కోట్ చేయలేదు. ఎమ్.ఎమ్.కీరవాణి, ఎస్.ఎస్.రాజమౌళి అండ్ ఎంటైర్ టీమ్ అంటూ మాత్రమే అన్నారు. ఆ ట్వీట్ చూసి.. ఎన్టీఆరే రియాక్ట్ అయ్యారు. తన పేరు లేకున్నా.. తనకు ట్యాగ్ చేయకున్నా.. చంద్రబాబు చెప్పిన విషెష్ పై RRR టీమ్ సభ్యుడిగా స్పందించారు. అయితే, ఈ స్పందనే ఇప్పుడు చర్చనీయాంశమైంది.

చంద్రబాబుకు, ఎన్టీఆర్ కు మధ్య గ్యాప్ ఉందనే ప్రచారం ఎప్పటినుంచో జరుగుతోంది. వారిద్దరూ కుటుంబ సభ్యులుగా సన్నిహితంగా కనిపించిన సందర్భాలు తక్కువే. గతంలో టీడీపీ కోసం జూనియర్ విస్తృత ప్రచారం చేయగా.. ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో మళ్లీ రాజకీయల వైపు చూడలేదు. అయితే, లోకేశ్ కోసమే ఎన్టీఆర్ ను తొక్కేశారనే ప్రచారం జరిగింది. ఆ గ్యాప్ అలా అలా కంటిన్యూ అవుతోంది. ఇటీవల ఏపీ అసెంబ్లీలో నారా భువనేశ్వరిపై వైసీపీ ఎమ్మెల్యేలు అసందర్భ కామెంట్లు చేసినప్పుడు.. ఎన్టీఆర్ ఓ వీడియో రిలీజ్ చేశారు. అందులో, చాలా జాగ్రత్తగా బ్రాడ్ మేనర్ లో మాట్లాడారు. ఎన్టీఆర్ అంత స్మూత్ గా రియాక్ట్ కావడంపైనా ఓ సెక్షన్ విమర్శలు చేసింది.


అయితే, లేటెస్ట్ గా ఓ న్యూస్ పలు వెబ్ సైట్లలో కనిపిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ అమెరికా నుంచి తిరిగి రాగానే చంద్రబాబును కలుస్తారనేది ఆ కథనాల సారాంశం. ఎందుకు కలుస్తారు? ఏం మాట్లాడుకుంటారు? అనే దానిపై ఒక్కో సైట్ ఒక్కో రకంగా స్టోరీ అల్లేసింది. ఇలాంటి ప్రచారం జరుగుతున్న సమయంలో.. RRRకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం.. చంద్రబాబు ఆ మూవీ టీమ్ కు కంగ్రాట్స్ చెప్పడం.. అందుకు ‘థ్యాంక్యూ మావయ్య’ అంటూ ఎన్టీఆర్ ఉత్సాహంగా రిప్లై ఇవ్వడం.. అంతా సంథింగ్ సంథింగ్ అంటున్నారు. మళ్లీ చంద్రబాబు-ఎన్టీఆర్-టీడీపీ కాంబినేషన్ రాబోతోందా? అనే ఆసక్తి కనబరుస్తున్నారు.

మరోవైపు, అంతలేదు.. అదేదో క్యాజువల్ గా ఇచ్చిన రిప్లై అనే వాదన కూడా వినిపిస్తోంది. చంద్రబాబుకే కాదు.. జగన్ కు, మోదీకి సైతం తారక్ థ్యాంక్స్ చెప్పారని అంటున్నారు. అయితే, జగన్ ట్వీట్ లో స్పెషల్ గా తారక్ పేరును కోట్ చేశారు కాబట్టి, ఆయనకు తిరిగి రిప్లై ఇచ్చారంటే అర్థం ఉంది. అదే, చంద్రబాబు తన ట్వీట్లో తారక్ పేరు ప్రస్తావించకున్నా.. ఎన్టీఆర్ థ్యాంక్స్ చెప్పడంతో పొలిటికల్ గుసగుస మొదలైంది.

Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×