EPAPER

ChatGPT: గూగుల్‌ గుబుల్.. దూసుకొస్తున్న చాట్‌జీపీటీ!

ChatGPT: గూగుల్‌ గుబుల్.. దూసుకొస్తున్న చాట్‌జీపీటీ!

ChatGPT:సాంకేతిక ప్రపంచంలో సరికొత్త ఆవిష్కరణ సిద్ధమవుతోంది. అదే చాట్‌జీపీటీ! ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో తయారైన చాట్‌జీపీటీ… ఇప్పుడు గూగుల్‌కు సవాల్‌ విసురుతోంది. ప్రయోగ దశలో ఉండగానే రెండు వారాల్లో 10 లక్షల మంది యూజర్లను దాటిన చాట్‌జీపీటీ… వచ్చే రెండేళ్లలో గూగుల్‌ను అధిగమిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గూగుల్‌కు గట్టి పోటీ ఇస్తుందని భావిస్తోంది కాబట్టే… చాట్‌జీపీటీలో మైక్రోసాఫ్ట్‌ భారీగా పెట్టుబడి పెట్టేందుకు… ఆ కంపెనీతో చర్చలు జరుపుతోంది. చాట్‌జీపీటీ మాతృ సంస్థ ఓపెన్‌ఏఐలో ఇప్పటికే 1 బిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెట్టిన మైక్రోసాఫ్ట్‌… మరో 10 బిలియన్‌ డాలర్లు ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపుతోంది.


కంపెనీలో షేర్‌ హోల్డర్ల వాటాలను విక్రయించాలని ఓపెన్‌ఏఐ నిర్ణయించింది. కంపెనీ విలువను 29 బిలియన్‌ డాలర్లుగా లెక్కగట్టిన ఓపెన్ఏఐ… పెట్టుబడుల కోసం మైక్రోసాఫ్ట్‌ సహా కొన్ని వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థలతో చర్చలు జరుపుతోంది. డీల్ కుదిరితే ఓపెన్ఏఐలో మైక్రోసాఫ్ట్‌కు 49 శాతం, ఇతర ఇన్వెస్టర్లకు 49 శాతం వాటా దక్కే అవకాశం ఉంది. కృత్రిమ మేధ సాయంతో ఓపెన్ఏఐ తయారు చేసిన సాఫ్ట్‌వేరే చాట్‌జీపీటీ. 2015లో శాన్‌ఫ్రాన్సిస్కోలో శామ్‌ ఆల్ట్‌మన్‌, ఎలాన్‌ మస్క్‌ కలసి 100 కోట్ల డాలర్లతో ఓపెన్ఏఐని ప్రారంభించారు. 2018లో రాజీనామా చేసిన మస్క్… పెట్టుబడులు మాత్రం పెడుతూనే ఉన్నారు. ప్రస్తుతానికి ప్రయోగాత్మక దశలో ఉన్న చాట్‌జీపీటీ… వినియోగదారులకు ఉచితంగా అందుబాటులోనే ఉంది. ఓపెన్‌ఏఐ.కామ్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి… దాన్ని వాడి చూడొచ్చు. తన బింగ్‌లోనూ ఏఐ తరహా ఫీచర్‌ జోడించాలని భావిస్తున్న మైక్రోసాఫ్ట్‌… తద్వారా గూగుల్‌ను దెబ్బకొట్టాలని చూస్తోంది.

కోట్ల పదాలతో కూడిన ఏఐ లాంగ్వేజ్‌ ప్రాసెసింగ్‌ జీపీటీ-3ని… ఓపెన్‌ఏఐ రూపొందించింది. ప్రస్తుతం 175 బిలియన్‌ రకాల పెరామీటర్లతో కూడిన అత్యంత భారీ, శక్తిమంతమైన ఏఐ లాంగ్వేజ్‌ ప్రాసెసింగ్‌గా దీన్ని భావిస్తున్నారు. 300 బిలియన్‌ పదాలను జీపీటీ వ్యవస్థలో అమర్చారు. మనిషి మాదిరే రాతపూర్వక ఆవిష్కరణలు, అనువాదాల్లో కూడా జీపీటీ ఎంతో కచ్చితంగా ఉంటుంది. గూగుల్‌లాగా ప్రశ్నలకు సమాధానాలను లిస్ట్‌ చేయటంతో ఆగకుండా… సులభంగా అర్థమయ్యేలా చాట్‌జీపీటీ సమాధానాలను రాతరూపంలో రాస్తుంది. ఏవైనా అంశంపై కొత్త వ్యాసం కావాలన్నా, పరిశోధన పత్రాలు కావాలన్నా రాసిస్తుంది. టాపిక్‌ చెబితే, దానికి తగ్గట్లు కొత్త కవితలు, లేఖలు కూడా తక్షణమే రాసిస్తుంది. మనుషుల మాదిరే వివిధ భాషలను అర్థం చేసుకొని సమాధానం ఇస్తుంది. పిచ్చాపాటీ కబుర్లు చెప్పడంతో పాటు జోక్‌లూ వేస్తంది. యూజర్ల ప్రశ్నలకు సమాధానాలిచ్చే చాట్‌బోట్‌లు ఇప్పటికే అందుబాటులో ఉన్నా… వాటి పరిధి చాలా పరిమితం. అయితే అత్యంత వేగంగా, ఎదురుగా మనిషి కూర్చుని చెప్పినట్లే చెప్పడం చాట్‌జీపీటీ ప్రత్యేకత. అందుకే దీన్ని చూసి గూగుల్ ఆందోళన చెందుతోంది. ఎల్లో పేజెస్‌ను గూగుల్‌ ఎలా అయితే దెబ్బతీసిందో… చాట్‌జీపీటీ కూడా గూగుల్‌ను అలాగే దెబ్బకొట్టబోతోందని నిపుణులు చెబుతున్నారు. దాంతో… చాట్‌జీపీటీకి దీటైన సాఫ్ట్‌వేర్‌ను రూపొందించేందుకు గూగుల్ తీవ్రంగా శ్రమిస్తోంది.


TechMan : ఐ-ఫోన్ కొనే ముందు ఈ వీడియో చూడండి

Related News

Tirumala Laddu Politics: లడ్డూ కాంట్రవర్సీ.. దేవదేవుడి ప్రసాదంపైనే ఇన్ని రాజకీయాలా ?

Ys jagan vs Balineni: బాంబ్ పేల్చిన బాలినేని.. జగన్ పతనం ఖాయం

Israel Hezbollah War: యుద్ధంలో నయా వెపన్.. ఇక ఊచకోతే

YCP Leaders to Join in Janasena : గేట్లు తెరిచిన పవన్.. వైసీపీ ఖాళీ?

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Big Stories

×