EPAPER

Bhogi Significance and Celebrations : భోగిరోజు ఈ ఒక్క పని చేయండి చాలు

Bhogi Significance and Celebrations : భోగిరోజు ఈ ఒక్క పని చేయండి చాలు

Bhogi Significance and Celebrations : తెలుగు ప్రజలు జరుపుకునే అతి పెద్ద పండుగ సంక్రాంతి. ఆంధ్రా, రాయలసీమ ప్రజలు సంక్రాంతిని నాలుగు రోజుల పాటు జరుపుకుంటారు. తెలంగాణ ప్రాంతంలో మాత్రం మూడు రోజుల పండగ జరుపుకుంటారు.భోగి రోజు మొదట ఆరాధించాల్సిన దైవం సూర్యుడు. భోగాలను కలిగించే భోగి రోజు ఇంట్లో వాడకుండా పడి ఉన్న చెక్క సామాన్లను ఒక చోట పడేసి ఆవు పేడతో పిడకలు ఏర్పాటు చేసి కట్టెల పేర్చి కర్పూరంతో భోగిమంట వెలిగించాలి. భోగమంట అగ్నిదేవుడి ఆరాధనకు నిదర్శనం. సూర్య భగవానుడు మకరరాశిలోకి ప్రవేశించి సమయం అది. భోగి రోజు నువ్వుల నూనె రాసుకుని స్నానం ఆచరించాలి. తర్వాత అగ్నిదేవాయ నమః అంటూ భోగమంటలు వేసి నమస్కారం చేయాలి. భోగి మంటల ద్వారా మనలో ఉన్న చెడును, బద్దకాన్ని భోగిమంటల్లో వేసి.. ఇవాళ్టి నుంచి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తామని కోరుకుంటారు.


భోగిమంటలు వేసిన తర్వాత అక్కడ కోలాటం చేయాలి. గోకుల కృష్ణుడు గోవర్ధినగిరిని ఎత్తిన రోజు అదే. కాబట్టి కొత్త బియ్యంతో ఆవు పాలుతో చేసిన వంటకం చేసి, భోగి పళ్లతో సూర్యభగవానుడికి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని అందరికి పంచిపెట్టాలి. దీని వల్ల ఆరోగ్యప్రదమైన జీవితం అందరికి కలుగుతుంది. పిల్లలకు భోగిపళ్లు పోయడం వల్ల ఆయుష్షు కలుగుతుందని శాస్త్రం చెబుతోంది. మట్టితో చేసిన బొమ్మల కొలువు ఇంటికి అందాన్నిఇస్తుంది. గౌరీదేవి బొమ్మ పెట్టి పూజ చేస్తారు. ఈ పూజ వల్ల పెళ్లి కాని యువతకు ఎలాంటి ఆటంకం లేకుండా కళ్యాణం జరుగుతుంది.

ధనుర్మాసం నేలంతా ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటినే ఈ భోగి మంటలలో వాడుతారు. దేశి ఆవు పేడ పిడకలని కాల్చడంతో గాలి శుద్ధి అవుతుంది. సుక్ష్మక్రిములు నశిస్తాయి. ప్రాణవాయువు గాలిలోకి అధికంగా విడుదల అవుతుంది. దాని గాలి పీల్చడం ఆరోగ్యానికి మంచిది. భోగి రోజునే గోదాదేవి శ్రీరంగ నాథుడ్నివివాహం చేసుకుంది. అందుకే భోగిని భోగవంతమైన రోజుగా చెబుతుంటారు. వైష్ణవ ఆలయాల్లో జరిగే ఈ కళ్యాణ వేడుక తిలకించేందుకు రెండుకళ్లు సరిపోవు. శ్రీరంగనాథుడి, గోదాదేవికి కళ్యాణం నిర్వహించి ఆ అక్షింతలు తలపై వేసుకుంటే పరిపూర్ణ ఆరోగ్యం, ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. భోగి రోజు ఈ కళ్యాణ వేడుక చూసిన అవివాహితులకు కళ్యాణ యోగం, పెళ్లైన వారికి జీవితంలో సంతోషం తథ్యం. భోగి ముగిశాక సూర్యుడు దక్షిణాయణం నుంచి ఉత్తరాయణానికి మరలుతాడు. ఆ రోజే మకరరాశిలోకి అడుగుపెడతాడు.


Follow this link for latest updates :-Bigtv

Related News

Dussehra 2024 Date: ఈ ఏడాది దసరా పండుగ ఏ రోజున జరుపుకుంటారు ? శుభ సమయం, ప్రాముఖ్యత వివరాలు ఇవే..

Sun Transit Horoscope: సూర్యుని దయతో ఈ రాశుల వారికి గోల్డెన్ టైం రాబోతుంది

Tirumal Laddu: పవిత్ర తిరుమల లడ్డూ తయారీలో 8 మంది కీలక పాత్ర, ఇంతకీ వాళ్లు ఎవరో తెలుసా?

Tulasi Plant: తులసి పూజ ఎప్పుడు చేయాలి, వాయు పురాణం ఏం చెబుతోందంటే..

Horoscope 20 September 2024: ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే! శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం!

Lucky Rashi from Durga Sasthi 2024: దుర్గా షష్ఠి నుండి ఈ రాశులకు వరుసగా 119 రోజులు లక్ష్మీ అనుగ్రహం

Mahalaya Surya Grahan 2024: మహాలయలో సూర్యగ్రహణం, ఈ 3 రాశుల వారి జీవితంలో అన్నీ అద్భుతాలే

Big Stories

×