EPAPER
Kirrak Couples Episode 1

RevanthReddy: రేవంత్ రెడ్డి ఇంకా డోస్ పెంచాలా?.. బండి సంజయే రోల్ మోడలా?

RevanthReddy: రేవంత్ రెడ్డి ఇంకా డోస్ పెంచాలా?.. బండి సంజయే రోల్ మోడలా?

RevanthReddy: ధర్నా చౌక్ దగ్గర ఆందోళన చేసింది కాంగ్రెస్. ‘నిధులు, విధులపై సర్పంచ్‌ల శంఖారావం’ నిర్వహించింది. ఆ కార్యక్రమంలో సర్కారుపై రేవంత్ రెడ్డి రెచ్చిపోయారు. బీఆర్ఎస్ అంటే భస్మాసుర హస్తమంటూ.. కేసీఆర్, కేటీఆర్ లను ఉరి తీయాలంటూ.. పవర్ ఫుల్ డైలాగ్స్ వదిలారు. అక్కడున్న సర్పంచ్ లంతా చప్పట్లు కొట్టారు. అంతా బాగుంది. ఆ తర్వాత డీజీపీ ఆఫీసుకు వెళ్లి.. నాగర్ కర్నూల్ జిల్లాలో కాంగ్రెస్ నేతలపై జరిగిన దాడులపై ఫిర్యాదు చేశారు. అలా.. రేవంత్ డైరీలో మరో రోజు ముగిసింది. ఈ మొత్తం కార్యక్రమంపై మీడియా అంతంతమాత్రం కవరేజ్ ఇచ్చింది.


చాలా? ఈ డోస్ సరిపోతుందా? ఓ మూలన చిన్న నిరసన చేయడం.. ఓ ఆఫీసులో ఫిర్యాదు చేయడం.. ప్రస్తుత పరిస్థితులకు ఈ స్థాయి రాజకీయం సరిపోతుందా? రేవంత్ రెడ్డి అంటేనే డైనమిక్ పాలిటిక్స్. అందులో నో డౌట్. ఆయన గత రాజకీయమంతా దూకుడుగానే సాగింది. కానీ, ఎప్పుడైతే బీజేపీ మెయిన్ స్ట్రీమ్ లోకి వచ్చిందో.. అప్పటి నుంచి నిత్యం బీజేపీ న్యూసే. రేవంత్ కంటే బండి సంజయే ఫైర్ బ్రాండ్ లీడర్ గా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. చిన్న ఇష్యూనైనా పెద్దదిగా మార్చడంలో కమలనాథులు సక్సెస్ అవుతున్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ మరింత రాటుదేరాల్సిన అవసరం కనిపిస్తోందని చెబుతున్నారు.

ఎగ్జాంపుల్ కి కామారెడ్డి రైతుల ఆందోళనే తీసుకుంటే.. మాస్టర్ ప్లాన్ లో భాగంగా తమ పంటపొలాలు పోతున్నాయంటూ ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. బాధిత రైతులంతా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. వేలాది మంది అన్నదాతలు కలెక్టరేట్ మీదకు దండు కట్టారు. బారికేడ్లు, ఇనుప కంచెలు దాటారు. పోలీసులతో హోరాహోరీ తలబడ్డారు. రాష్ట్రమంతా ఆ న్యూస్ హైలైట్ అయింది. రోజంతా మీడియాలో నాన్ స్టాప్ కవరేజ్ ఇచ్చింది. కట్ చేస్తే, అదే రోజు రాత్రి కామారెడ్డిలో వాలిపోయారు బండి సంజయ్. ఆత్మహత్య చేసుకున్న రాములును పరామర్శించారు. అక్కడి నుంచి నేరుగా ఛలో కలెక్టరేట్ నిర్వహించారు. ఏకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడే కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగడంతో.. ఫుల్ మైలేజ్ వచ్చింది. పోలీసులు బండి సంజయ్ ను బలవంతంగా అరెస్ట్ చేయడంతో.. మరింత పాపులారిటీ. ఆ వెంటనే కలెక్టర్ దిగొచ్చి.. మీడియా ముందు వివరణ ఇచ్చుకున్నారు. అలా, ఒక్క నిర్ణయంతో రైతు పోరాట క్రెడిట్ ను తమ ఖాతాలో వేసుకుంది బీజేపీ. మరి, అదే పని కాంగ్రెస్ ఎందుకు చేయలేకపోయింది?


గతంలో జనగాం జిల్లాలో బీజేపీ కార్యకర్తలను పోలీసులు కొడితే.. పార్టీ అధ్యక్షునిగా బండి సంజయ్ నేరుగా జనగాం వెళ్లి మరీ ధర్నాకు దిగారు. ఏ చిన్న ఘటనైనా కార్యకర్తలకు తాను అండగా ఉంటాననే మెసేజ్ ఇచ్చారు. మరిప్పుడు నాగర్ కర్నూల్ లో కాంగ్రెస్ వాదులపై దాడులు జరిగితే.. రేవంత్ రెడ్డి మాత్రం హైదరాబాద్ లో డీజీపీ ఆఫీసులో కంప్లైంట్ ఇచ్చారని.. వారిద్దరి మధ్య అంత తేడా ఉందని గుర్తు చేస్తున్నారు.

అయితే, ఈ ఆరోపణలకు కాంగ్రెస్ సైతం గట్టి సమాధానమే ఇస్తోంది. ఇదంతా కాంగ్రెస్ ను తొక్కేసేందుకు.. బీఆర్ఎస్, బీజేపీ కలిసి ఆడుతున్న కుట్ర అంటోంది. పార్టీ తరఫున ఏ చిన్న కార్యక్రమానికి పిలుపు ఇచ్చినా పోలీసులు కాంగ్రెస్ నేతలను హౌజ్ అరెస్టులు చేస్తున్నారు. అనేక సందర్భాల్లో రేవంత్ రెడ్డిని సైతం ఇంట్లో నుంచి బయటకు రానీయలేదు. అదే, బండి సంజయ్ మాత్రం హైదరాబాద్ నుంచి కామారెడ్డి వెళ్లే వరకూ ఏ పోలీసులూ ఆపలేదు. బీఆర్ఎస్+బీజేపీ కుమ్మక్కు.. తెలంగాణ ప్రజలారా, మీకు అర్థమవుతోందా? అంటూ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ లో చేసిన ఆరోపణపై ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆలోచిస్తే.. నిజమే అనిపిస్తోందని అంటున్నారు.

ఇక, బీజేపీకి కేసీఆర్ సహకరిస్తున్నారనే దానికి మరో ఉదాహరణ కూడా చూపిస్తున్నారు. సోషల్ మీడియాలో కేటీఆర్ కుటుంబంపై అనేక ట్రోల్స్ వస్తుంటాయి. అందులో, అనేకం బీజేపీకి లబ్ది జరిగేలా ఉంటాయి. మెజార్టీ ట్రోల్స్ కాషాయ పార్టీ సానుభూతుల నుంచే ఉంటాయి. బీజేపీ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ నుంచే రోజూ సుప్రభాతంలా పోస్టులు వస్తుంటాయి. అలాంటిది, వారందరినీ వదిలేసి.. ఏదో కొన్ని పోస్టులను సాకుగా చూపించి.. కాంగ్రెస్ వార్ రూమ్ పై సైబర్ క్రైమ్ పోలీసులు దాడి చేయడం.. కాంగ్రెస్ పార్టీ డేటాను తీసుకెళ్లడం.. అంతా గేమ్ ప్లాన్ లో భాగమే అంటున్నారు. సునీల్ కనుగోలు, మల్లు రవిలకు 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడుతున్నారు. అదే, బీజేపీ తరఫు పోస్టులపై సర్కారు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని.. దీన్నిబట్టి ఆ రెండు పార్టీలు మిలాకత్ అయ్యాయని తెలిసిపోతోందనేది కాంగ్రెస్ వాదన. ఇక, కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా సీనియర్ల తిరుగుబాటు.. ఇలా రేవంత్ రెడ్డి ముందరి కాళ్లకు అనేక బంధనాలు. అయినా, వీటన్నిటినీ నెగ్గుకొస్తూ.. రేవంత్ రెడ్డి యాక్టివ్ పాలిటిక్సే చేస్తున్నారని.. త్వరలో ప్రారంభం కానున్న పాదయాత్రతో కాంగ్రెస్ సత్తా ఏంటో తెలుస్తోందని అంటున్నారు.

Related News

Young India Skill University: ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ తో స్కిల్ హబ్ గా తెలంగాణ..

Tirumala Laddu Politics: లడ్డూ కాంట్రవర్సీ.. దేవదేవుడి ప్రసాదంపైనే ఇన్ని రాజకీయాలా ?

Ys jagan vs Balineni: బాంబ్ పేల్చిన బాలినేని.. జగన్ పతనం ఖాయం

Israel Hezbollah War: యుద్ధంలో నయా వెపన్.. ఇక ఊచకోతే

YCP Leaders to Join in Janasena : గేట్లు తెరిచిన పవన్.. వైసీపీ ఖాళీ?

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

Big Stories

×