EPAPER

Ponguleti : బీజేపీలోకి పొంగులేటి.. అమిత్ షాతో భేటీ! తుమ్మల సైతం?.. కేసీఆర్ కు కంగారే..

Ponguleti : బీజేపీలోకి పొంగులేటి.. అమిత్ షాతో భేటీ! తుమ్మల సైతం?.. కేసీఆర్ కు కంగారే..

Ponguleti : బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ మారడం ఖాయమని తేలిపోయింది. ఆయన బీజేపీలోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు . పొంగులేటితో బీజేపీ అధిష్టానం నేరుగా మంతనాలు జరుపుతోంది. ఈ నెల 18న అమిత్ షాతో పొంగులేటి భేటీ అవుతారని తెలుస్తోంది. అదే రోజు ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ నిర్వహించబోతున్నారు. అందుకే గులాబీ బాస్ కు షాక్ ఇచ్చేలా కాషాయ నేతలు పావులు కదుపుతున్నారు. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్‌లో గత కొంత కాలంగా అసంతృప్తి రాగాలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ నేతల వైఖరిపై పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పొంగులేటి చేస్తున్న కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి.


కారులో కుమ్ములాటలు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అధికార బీఆర్‌ఎస్‌లో అంతర్గత విభేదాలు తీవ్రరూపు దాల్చాయి. పొంగులేటి బీఆర్‌ఎస్‌ను వీడతారని ప్రచారం చాలా రోజుల నుంచి జరుగుతోంది. ఈ మధ్య కాలంలో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు… పార్టీ అధిష్ఠానంపై అసంతృప్తికి నిదర్శనంలా కనిపిస్తున్నాయి. ఇటీవల అనుచరులతో నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న పొంగులేటి….. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం ఖాయమని స్పష్టం చేశారు. అయితే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తానో ఇప్పుడే చెప్పలేనని అప్పుడే పార్టీ మార్పుపై హింట్ ఇచ్చారు. బీఆర్ఎస్‌లో తనకు లభించింది ఏంటో అనేది అందరూ చూస్తూనే ఉన్నారని అనడం హాట్ టాపిక్ గా మారింది.

పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తీరుపై బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆగ్రహాన్ని తన చర్యల ద్వారా చూపించారు. ప్రభుత్వం ఆయనకు కల్పించిన భద్రతను కుదించింది. త్రీ ప్లస్‌ త్రీ భద్రతను టు ప్లస్‌ టుకు తగ్గించింది. ఆయనకు కొనసాగిస్తున్న ఎస్కార్ట్ వాహనాన్ని తొలగించింది. కొన్నేళ్ల నుంచి బీఆర్ఎస్ తరఫున పదవి ఆశిస్తున్న పొంగులేటికి నిరాశే ఎదురైంది రాజ్యసభ సీటు ఖాయమనే చర్చ సాగింది. కానీ కేసీఆర్ మాత్రం అవకాశం ఇవ్వలేదు. కనీసం తన వర్గానికి కూడా పార్టీలో ప్రాధాన్యత దక్కడం లేదనే అసంతృప్తిని పొంగులేటి వ్యక్తపరుస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ మారడమే మంచిదనే నిర్ణయానికి వచ్చేశారు.


తుమ్మల అదేబాట..?
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్టీ మారతారనే ప్రచారం ఇప్పటికే తెరపైకి వచ్చింది. బీఆర్ఎస్ అధిష్టానం తీరుపై తుమ్మల గత కొంత కాలంగా అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. ఇటీవల ఆయన తన అనుచరులతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు.

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లా కీలకంగా మారింది. తెలంగాణలో పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నాలు ప్రారంభించారు.
ఇటీవల ఖమ్మంలోనే సభ నిర్వహించారు. ఖమ్మం నా గుమ్మం అంటూ చంద్రబాబు స్పష్టం చేశారు. వైస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల పాలేరు నుంచి పోటీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అక్కడే పార్టీ కార్యాలయాన్ని ఇప్పటికే ప్రారంభించారు. మరో వైపు బీజేపీ సైతం ఇక్కడి కీలక నేతలను తమ వైపు ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దీంతో ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు ఉమ్మడి ఖమ్మం జిల్లా చుట్టూ తిరుగుతున్నాయి.

Related News

Jani Master: అవును.. నేను చేసింది తప్పే.. పోలీసుల ముందు నేరం అంగీకరించిన జానీ..!

Star Heroine: ఈ హీరోయిన్ క్రేజ్ మామూలుగా లేదుగా.. 50 సెకండ్ల కోసం రూ.5కోట్లా..?

Fear Teaser: సస్పెన్స్ థ్రిల్లర్ గా ఫియర్ టీజర్.. అద్భుతమైన పర్ఫామెన్స్ తో హైప్ పెంచేసిన వేదిక.!

Jani Master : ‘మాస్టర్ అమాయకుడు’ రోజురోజుకు పెరుగుతున్న మద్దతు… ఎంత మంది సపొర్ట్ చేశారంటే..?

Bigg Boss 8 Day 19 Promo: కఠిన నిర్ణయం తీసుకున్న బిగ్ బాస్..సైలెంట్ అయిన కంటెస్టెంట్స్ ..!

Squid Game Season 2 Teaser: టీజర్ రిలీజ్ చేసిన నెట్ ఫ్లిక్స్.. ఈ భయంకరమైన ఆట చూడడానికి సిద్ధమా..?

Johnny Master: ఢీ 11 లో ఎలిమినేట్.. జానీ మాస్టర్ ఇంత కథ నడిపారా.?

Big Stories

×