EPAPER

Missing Dog Reward: మేలైనజాతి కుక్క.. ఆచూకీ తెలిపితే రూ.20000.. వెతికిపెట్టండి ప్లీజ్!

Missing Dog Reward: మేలైనజాతి కుక్క.. ఆచూకీ తెలిపితే రూ.20000.. వెతికిపెట్టండి ప్లీజ్!

Missing Dog Reward| జంతువులంటే కొంతమంది చాలా ఇష్టం. వాటిని చాలా ప్రేమ, జాగ్రత్తగా పెంచుకుంటూ ఉంటారు. ఒక్కరోజు అవి కనిపంచకపోతే ఆ జంతుప్రేమికులు తల్లడిల్లిపోతారు. ఏదో.. తమ బిడ్డ తప్పిపోయినట్లు. తాజాగా ఒక మేలు జాతి రకం కుక్కను పెంచుకుంటున్న దంపతులు తమ డాగీ కనిపించడంలేదని బాధపడిపోతూ సోషల్ మీడియాలో ఒక ప్రకటన ఇచ్చారు. తాము ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కుక్క తప్పింపోయిందని చెబుతూ.. దాన్ని గురించి వివరాలన్నీతెలిపి.. కుక్క ఆచూకీ తెలిపితే.. రూ.20000 బహుమానం ఇస్తామని ప్రకటించారు.


వివరాల్లోకి వెళితే.. హర్యాణా రాష్ట్రంలోని గురుగ్రామ్ నగరానికి చెందిన కాస్త సంపన్న దంపతులు తమ కుక్క సీజర్, సీజర్‌ను చూసుకునే కేర్ టేకర్ తో సహా తాజ్ మహల్ చూద్దామని ఆగ్రా నగరానికి వచ్చారు. ఆగ్రాలోని తాజ్ వ్యూ 5 స్టార్ హోటల్ లో ఒక గది తీసుకున్నారు. అయితే నవంబర్ 3, 2024న కుక్క, దాని కేర్ టేకర్ ను హోటల్ వద్దనే ఉండమని చెప్పి.. భార్యాభర్తలిద్దరూ నగరంలో విహరించడానికి వెళ్లారు.

వారిద్దరూ ఆగ్రాలో ముందుగా ఫతేహ్ పూర్ సిక్రీకి వెళ్లారు. తాజ్ వ్యూ హోటల్ నుంచి ఫతేహ్ పూర్ సిక్రీ దూరం ఒక గంట. దంపతులు ఉదయం 7.30 గంటలకు హోటల్ నుంచి బయలుదేరి ఫతేహ్ పూర్ సిక్రీ చేరుకున్నారు. మరోవైపు హోటల్ లో సీజర్ (కుక్క)ను తీసుకొని దాని కేర్ టేకర్ రూమ్ నుంచి బయటకు వచ్చింది. అక్కడే మరో కుక్కను చూసి సీజర్ తన కేర్ టేకర్ చేతుల్లో నుంచి తప్పించుకొని పరుగులు తీసింది. ఆ తరువాత కొంతదూరం తరువాత మాయమైంది. దీంతో కుక్క కేర్ టేకర్.. దానికోసం పరిసరాల్లో అంతా వెతికాడు. అప్పుడు ఉదయం 9 గంటలవుతోంది. దాదాపు గంట తరువాత వెతికి వెతికి విసిగిపోయి.. సీజర్ కేర్ టేకర్ యజమానులకు ఫోన్ చేసి విషయం చెప్పింది.


Also Read: ఏడాది సంపాదన ఒక్కనెలలోనే.. అందాలతో వ్యాపారం చేసే ఎయిర్ హోస్టెస్!

సీజర్ పై బెంగపెట్టుకున్న భార్యభర్తలు ఫతేహ్ పూర్ సిక్రీ నుంచి బయలు దేరి ఇంటికి చేరుకునే లోపు మరో గంట పట్టింది. ఆ తరువాత దాని సీజర్ యజమాని దానికోసం చుక్కపక్కలంతా గాలించాడు. చివరికి తన కుక్క కోల్పోయినట్లు పోలీసులకు తెలిపాడు.

పోలీసులు విచారణ ప్రారంభించి సీసీటీవి వీడియోలు చూడగా.. సీజర్ ఆగ్రాలోని తాజ్ మహల్ మెట్రో స్టేషన్ వద్ద ఉదయం 9.25 గంటలకు కనిపించినట్లు తెలిసింది. దీంతో స్టేషన్ పరిసరాల్లో, హోటల్ పరిసరాల్లో, షాజహాన్ పార్క్, ఆగ్రా గోల్ఫ్ లాంటి ప్రదేశాల్లో దాని యజమానులు వెతకడం ప్రారంభించారు. కానీ ఫలితం లేదు. చివరికి విసిగిపోయి. సోషల్ మీడియాలో తమ కుక్క సీజర్ ఆచూకీ తెలిపినా.. లేదా దాన్ని పట్టించినా రూ.20 వేలు బహుమానం ఇస్తామని ప్రకటించారు.

కుక్క జాతి: ఇండియన్ గ్రే హౌండ్ (హిమాచల్ ప్రదేశ్), వయసు : 9 సంవత్సరాలు.. పేరు : సీజర్. చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఆచూకీ తెలపాల్సిన నెంబర్లు: +91-7838899124, +91-7838387881, +91-9834078956. ఫేస్ బుక్ ఐడీ- (https://www.facebook.com/greenappplemojito), ఇన్‌స్టాగ్రామ్ ఐడీ – (@greenapplemojito), ట్విట్టర్ (@patrakasturi).

Related News

Viral Video: రెండు బెర్తుల నడుమ స్పెషల్ సీట్, ఎలా వస్తాయ్ బ్రో ఇలాంటి ఐడియాలు!

Air Hostess Earnings: ఏడాది సంపాదన ఒక్కనెలలోనే.. అందాలతో వ్యాపారం చేసే ఎయిర్ హోస్టెస్!

Optical Illusion: వస్తువులన్నీ చిందర వందరగా ఉన్న ఈ గదిలో 3 చిప్స్ ప్యాకెట్స్ ఉన్నాయి.. కనుక్కోండి చూద్దాం!

Viral Video: రైలు కింద పడి రెండు ముక్కలైన యువకుడు, బంగ్లాదేశ్ లో ఘోరం

Viral video: బాబూ! అది స్లీపర్ బెర్త్ కాదు, మెట్రో రైల్- మరీ అలా పడుకుంటే ఎలా?

Kurnool: క‌ర్నూలులో వింత ఆచారం..కానీ పాటిస్తే ఆ స‌మ‌స్య‌లు దూరం!

Big Stories

×