OTT Movie : భయపెడుతూ ఎంటర్టైన్ చేసే మూవీస్ ఏమైనా ఉన్నాయంటే అవి హర్రర్ మూవీస్ మాత్రమే. ఈ మూవీస్ లో అశ్లీలత తక్కువగా ఉండి భయపెట్టే సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ సినిమాలు కుటుంబ సమేతంగా చూసే విధంగా ఉంటాయి. అటువంటి ఒక మూవీ థియేటర్లలో మంచి టాక్ తెచ్చుకొని ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.
నెట్ ఫ్లిక్స్ (Netflix)
ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ ఒక ఇండోనేషియన్ మూవీ. ఒక కుటుంబానికి ఒక పాప నుంచి అనుకోని ప్రమాదం ఎదురవుతుంది. ఆ కుటుంబం ఆ పాప చుట్టూ ఈ మూవీ స్టోరీ నడుస్తుంది. మూవీ పేరు “ఆర్ ఓ హెచ్” (ROH) ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీలో వెన్నులో వణుకు పుట్టించే సన్నివేశాలు చాలానే ఉన్నాయి.
స్టోరీ లోకి వెళితే
ఒక అడవిలో ఒంటరిగా తల్లితో పాటు ఇద్దరు పిల్లలు నివసిస్తూ ఉంటారు. అబ్బాయి పేరు హేలన్,అమ్మాయి పేరు ఆశ. వీరుంటున్న చోటికి ఒక చిన్న అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి చాలా విచిత్రం గా ఉంటూ ఎవరితోనూ మాట్లాడకుండా ఉంటుంది. ఆ అమ్మాయికి వీళ్ళు ఆహారం ఇస్తారు. ఆ మరుసటి రోజు ఆ అమ్మాయి గొంతు కోసుకొని చచ్చిపోతూ, వచ్చే పున్నమి రోజు మీ కుటుంబం అంతా చచ్చిపోతారు అంటూ తను చచ్చిపోతుంది. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు అని ఆ తల్లి పిల్లలతో చెప్తుంది. ఈ వూహించని ఘటనతో భయపడిన ఆ పిల్లల తల్లి ఒక మంత్రగత్తే దగ్గరికి వెళుతుంది. ఆమె ఇదంతా ఒక సైతాన్ పని అని చెప్పి పూజలు చేస్తుంది. ఆ తర్వాత అడవిలో ఒక వ్యక్తి ఒక అమ్మాయి కోసం వెతుకుతున్నాను అంటూ మీకు ఏమైనా తెలుసా అని అడుగుతాడు. ఈ కుటుంబం మాకు ఏమీ తెలియదని చెప్తారు.
ఆ మరుసటి రోజు బయటకు వెళ్ళిన ఆశ కనపడకుండా పోతుంది. ఎక్కడికి వెళ్ళిందో అని ఆ తల్లి భయపడుతూ వెతుకుతూ ఉంటుంది. ఇంతలో ఆ చిన్న పాప గొంతు కోసుకున్న కత్తి హెలెన్ కి దొరుకుతుంది. అంతలోనే ఆ పాప దయ్యం రూపంలో ఆ పిల్లవాడిని వెంటాడుతుంది. చివరికి ఆ దయ్యం చేతిలో ఈ కుటుంబం ఏమైంది? ఇంతకీ వీళ్లింటికి వచ్చిన పాప ఎవరు? ఆ మంత్రగత్తే వీళ్ళకు సాయపడగలిగిందా? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతున్న “ఆర్ ఓ హెచ్” (ROH) అనే ఈ మూవీని తప్పకుండా చూడండి. హారర్ థ్రిల్లర్ సినిమాలను ఇస్టపడే మూవీ లవర్స్ కి ఇదొక బెస్ట్ మూవీ. గుండె ధైర్యం ఉన్నవాళ్ళే ఈ మూవీని చూడాలి, ఎందుకంటే అప్పుడప్పుడూ వచ్చే విజువల్స్ కి పై ప్రాణాలు పైకే పోతాయి.