EPAPER

Sridhar Babu on BRS: బీఆర్ఎస్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్.. ఈ ప్రశ్నలకు జవాబిచ్చే దమ్ముందా అంటూ సవాల్, ఏం అడిగారంటే?

Sridhar Babu on BRS: బీఆర్ఎస్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్.. ఈ ప్రశ్నలకు జవాబిచ్చే దమ్ముందా అంటూ సవాల్, ఏం అడిగారంటే?

⦿ బీఆర్ఎస్‌ విమర్శలకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
⦿ 10 ప్రశ్నలకు సమాధానాలు కావాలని బహిరంగ లేఖ
⦿ లేనిపోని ఆరోపణలు వద్దంటూ ఆగ్రహం
⦿ తమది ప్రజా పాలనగా చెప్పిన మంత్రి


హైదరాబాద్, స్వేచ్ఛ: Sridhar Babu on BRS: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు 11 నెలలు అవుతోంది. చాలా తక్కువ సమయంలోనే ప్రజా సంక్షేమం కోసం సంచలన నిర్ణయాలు తీసుకున్నామని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. కానీ, మహిళలకు ఆర్టీసీలో ఫ్రీ ప్రయాణం తప్ప ఏదీ సరిగ్గా అమలు కావడం లేదని బీఆర్ఎస్ నేతల ఆరోపణ. రోజూ ఏదో ఒక అంశంలో గులాబీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలకు పది ప్రశ్నలు సంధించారు మంత్రి శ్రీధర్ బాబు. తమపై చేస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ బహిరంగ లేఖ విడుదల చేసిన ఆయన, ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

మంత్రి ప్రశ్నలు ఇవే
1. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన 1200 మంది విద్యార్థులు, యువకుల కుటుంబాలను బీఆర్ఎస్ పెద్దలు ఎందుకు విస్మరించారో ఇప్పుడైనా జవాబు చెప్పగలరా?


2. 2014 జూన్ 14న ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన తీర్మానంలో 1200 బలిదానాలు జరిగినట్టు కేసీఆర్ స్వయంగా పేర్కొన్నారు. ఆ తర్వాత అనేక సార్లు మాట మార్చి అమరుల సంఖ్యను 585కు కుదిస్తూ వేర్వేరు ఉత్తర్వుల్లో వెల్లడించారు. మిగిలిన 615 మంది ఏమై పోయారో పదేళ్ల విధ్వంస పాలనలో ఎప్పుడైనా ఆత్మ విమర్శ చేసుకున్నారా?

3. ప్రాణత్యాగం చేసిన అమరుల కుటుంబాలకు రూ.10 లక్షల నగదు, గృహ వసతి, సాగు భూమి, కుటుంబానికో ఉద్యోగం, ఉచిత విద్య, వైద్యం ఇప్పిస్తామని ఎన్నో హామీలిచ్చారు. చివరకు కొద్ది మందికి నగదు, ఉద్యోగాలు ఇచ్చినా మిగిలిన హామీలను ఇప్పటికీ నెరవేర్చలేదు. బిడ్డలను, కుటుంబ పెద్దలను కోల్పోయిన ఆ కుటుంబాల గురించి కారు పార్టీ పెద్దలు ఎందుకు మాట్లాడటం లేదు?

4. అధికారంలోకి వస్తే దళితుడిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెడతామన్న పెద్దలు అసలా మాటే అననే లేదని నాలుక మడత పెట్టింది వాస్తవం కాదా. దళిత కుటుంబాలకు ఇస్తామన్న 3 ఎకరాల భూమి నీటి మూట అయింది వాస్తవం కాదా?

5. తెలంగాణ తల్లిగా సోనియమ్మను పొగిడిన నోళ్లతోనే మీరు ఆ కుటుంబాన్ని కించ పరుస్తున్న విషయం ప్రజలకు తెలియదనుకుంటున్నారా? పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తామన్నది ఎవరు? మాట తప్పింది ఎవరు? తెలంగాణను ఇచ్చిన సోనియమ్మ, రాహుల్ గాంధీలు అకస్మాత్తుగా శత్రువులు ఎలా అయ్యారు? రాజకీయంగా అదృశ్యమైపోతామన్న భయంతోనే కదా ఈ ప్రేలాపనలన్నీ.

6. అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగం అనేది ఉండదు అని ఆశలు కల్పించి కల్పించకుండా మోసగించింది మీరు కాదా?

7. గ్రూప్ 1 పరీక్ష పేపర్ లీక్ అయినా సమర్థించుకున్న చరిత్ర ఎవరిది? నోటిఫికేషన్ విడుదల చేసిన మూడేళ్లలో సరిగ్గా పరీక్షలు నిర్వహించలేని అసమర్థత ఎవరిది? న్యాయస్థానాల జోక్యంతో పరీక్షలు రద్దు చేయాల్సిన పరిస్థితికి మీరు బాధ్యలు కాదా? నిరుద్యోగుల ఉసురు పోసుకుంది ఎవరో ప్రత్యేకంగా చెప్పాలా?

8. ఇళ్లు లేని పేదలందరికీ డబుల్ బెడ్రూం నివాసాలు నిర్మించి ఇస్తామని అరచేతిలో వైకుంఠం చూపించి పదేళ్లలో మీరు కట్టింది ఎన్ని? పంపిణీ చేసింది ఎన్నో గుండెపై చేయివేసుకుని చెప్పగలరా? కేజీ టు పీజీ విద్య హామీ అసలు మీకు గుర్తుందా?

9. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఏడు జిల్లాల్లోని 16,40,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని నమ్మబలికారు. మరి లక్ష ఎకరాలైనా సాగులోకి వచ్చిందా? మేడిగడ్డ నిర్మాణ లోపాల గురించి, అంచనా వ్యయం రూ.40 వేల కోట్ల నుంచి రూ.లక్షా 40 వేల కోట్లకు పెంచడంపైన విచారణ జరుగుతోంది కాబట్టి వ్యాఖ్యానించదల్చుకోలేదు. కానీ, ఈ వాస్తవాలన్నీ ప్రజలకు తెలియదని అనుకుంటున్నారా?

Also Read: Revanth Speech : రాహుల్ గాంధీ మాటే.. మాకు శాసనం.. చెప్పాం అంటే చేసి చూపిస్తాం

10. మేం నిత్యం ప్రజల్లోనే ఉంటున్నాం. మా అధినేత రాహుల్ గాంధీ దేశమంతా పర్యటిస్తున్నారు. రాష్ట్రానికీ వచ్చి వెళ్లారు. మరి జనం మధ్యకు వెళ్లంది మీరా, మేమా? అధికారం కోల్పోయాక ఇంటికే పరిమితమై బయటకు రానిది మీ పార్టీ అధినేత కాదా? రాహుల్ గాంధీని తక్కువ చేసి మాట్లాడితే పెద్దోళ్లమై పోతామని భ్రమ పడుతున్నట్టున్నారు. ఆయన జాతీయ నేత. ఉప ప్రాంతీయ పార్టీగా మారి ఉనికి కోల్పోతున్న రాజకీయ పక్షం నాయకులు మీరు.

Related News

Revanth Speech : రాహుల్ గాంధీ మాటే.. మాకు శాసనం.. చెప్పాం అంటే చేసి చూపిస్తాం

Warangal : రెండో రాజధానిగా వరంగల్ – మాస్టర్‌ ప్లాన్‌పై మెుదలైన కసరత్తులు?

Rahul In HYD : తెలంగాణ కుల సర్వే దేశానికి ఓ దిక్సూచీ.. రాహుల్ ఆసక్తికర కామెంట్లు..

Rahul Gandhi : రాష్ట్రానికి చేరుకున్న రాహుల్.. కులగణన పై కీలక మీటింగ్..

Viral News: నేనే పరమశివుడిని.. ఆరడుగుల గొయ్యి త్రవ్వండి.. పూనకంతో ఊగిన బాలుడు.. ఎక్కడంటే?

Caste Census Survey: బుధవారం నుంచి తెలంగాణ వ్యాప్తంగా కులగణన సర్వే

Big Stories

×