జిడ్డు చర్మంతో బాధపడేవారు ముల్తానీ మిట్టిని వాడేందుకు ప్రయత్నించండి. జిడ్డు చర్మం కలవారికి మొటిమలు త్వరగా వచ్చేస్తాయి. అందుకే వారు తరచూ ముఖాన్ని శుభ్రం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖంపై ఉత్పత్తి అయిన జిడ్డును పీల్చేందుకు అప్పుడప్పుడు ముల్తానీ మిట్టి మాస్క్‌ను వేసుకునేందుకు ప్రయత్నించండి.
జిడ్డు చర్మం కలవారికి కొంచెం పని చేసినా కూడా చెమట, జిడ్డు పట్టేస్తాయి. దీనివల్ల చర్మ రంధ్రాలు పూడుకుపోతాయి. ఎప్పుడైతే చర్మ రంధ్రాలు పూడుకుపోతాయో, మొటిమలు రావడం మొదలవుతుంది. అందుకే జిడ్డు చర్మం కలవారు తరచూ ముఖాన్ని శుభ్రం చేసుకుంటూ ఉండాలి. వీరికి ముల్తానీ మిట్టి ఉత్తమంగా పనిచేస్తుంది. మెరిసే ఛాయను అందిస్తుంది. చర్మం జిడ్డుగా మారకుండా కాపాడుతుంది. మొటిమలు కూడా రాకుండా అడ్డుకుంటుంది. ముల్తాని మిట్టితో ఎలాంటి ఫేస్ మాస్కులు ప్రయత్నించవచ్చో తెలుసుకోండి.
వేపా ఆకులు
వేప ఆకులు అధికంగానే లభిస్తాయి. ఆ వేప ఆకులను ఏరి ఇంటికి తెచ్చుకోండి. వేపలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఇన్ఫ్లమేషన్ గుణాలు అధికంగా ఉంటాయి. వేప ఆకులు, ముల్తానీ మిట్టి కలిపి ఫేస్ మాస్కుని తయారు చేయొచ్చు. వేపాకులను మిక్సీలో వేసి నీళ్లు పోసి మెత్తని పేస్టులా చేసుకోవాలి. దాన్ని ఒక గిన్నెలో వేయాలి. ఆ వేప పేస్టులో ముల్తానీ మిట్టిని కూడా కలిపి ముఖానికి మాస్కులా వేసుకోవాలి. పావుగంట సేపు అలా వదిలేయాలి. వారానికి రెండుసార్లు ఇలా ఫేస్ మాస్క్ వేసుకుంటే మీకు ఎంతో మార్పు కనిపిస్తుంది. జుట్టుకు, చర్మం గలవారికి ఈ మాస్క్ ఉత్తమంగా పనిచేస్తుంది. ఫేస్ మాస్క్ వేసుకున్నాక గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ వేసుకుంటూ ఉంటే మీ ముఖం కాంతివంతంగా మారుతుంది.
చందనంతో..
చందనం ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. చందనాన్ని నూరి ఒక గిన్నెలో వేసుకోండి. అందులోనే ముల్తానీ మిట్టిని కూడా కలపండి. అలాగే రోజ్ వాటర్ కూడా వేసి బాగా కలపండి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించండి. 20 నిమిషాలు పాటు అలా వదిలేసి చల్లని నీటితో కడిగేసుకోండి. వారానికి ఇలా రెండుసార్లు చేస్తే మీ ముఖం నిగారింపుగా మారుతుంది. మృదువుగా ఉంటుంది.తాకితే చాలు సున్నితంగా అనిపిస్తుంది. చర్మానికి కాంతి కూడా వస్తుంది. కాబట్టి అప్పుడప్పుడు ఇలా చందనం, ముల్తానీ మట్టి కలిపి ఫేస్ మాస్క్ గా వేసుకోవడానికి ప్రయత్నించండి.
తులసి ఆకులు
తులసి ఆకులు, ముల్తానీ మిట్టి కలిపి కూడా ఫేస్ మాస్కులు వేసుకోవచ్చు. ఇది జిడ్డు చర్మం కలవారికి ఎంతో ఉపయోగపడుతుంది. తులసిలో క్రిమిసంహారక లక్షణాలు కూడా ఉంటాయి. తాజా తులసి ఆకులను తీసుకొని శుభ్రంగా కడగండి. వాటిని ఒక గ్లాసు నీటిలో వేసి మరిగించండి. ఆ తర్వాత వాటిని వడకట్టి ఒక స్ప్రే బాటిల్ లో వేయండి. ఆ స్ప్రే బాటిల్‌తో ముఖంపై ఆ నీటిని స్ప్రే చేసుకోండి. ఆ తర్వాత ముల్తానీ మిట్టిని ముఖంపై ఫేస్ మాస్క్ లాగా వేసుకోండి. అది ఎండిపోయాక సాధారణ నీటితో శుభ్రపరచుకోండి. అంతే మీ ముఖంపై ఉన్న జిడ్డు, మురికి పోతాయి. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ వంటివి కూడా రాకుండా ఉంటాయి. మొటిమలు వచ్చే అవకాశం కూడా చాలా వరకు తగ్గుతుంది.
Also Read: జుట్టు సమస్యలతో అలసిపోయారా..? ఈ ఒక్క హెయిర్ ఆయిల్ ట్రై చేయండి
కలబంద జెల్
కలబంద జెల్ తో కూడా ముఖానికి ఫేస్ ప్యాక్ ను వేసుకోవచ్చు. కలబంద జెల్ ను సేకరించి ఒక గిన్నెలో వేసుకోండి. అందులోనే ముల్తానీమిట్టి కూడా వేసి బాగా కలిపి ముఖానికి పట్టించండి. అలోవెరా జెల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. చర్మాన్ని తేమవంతంగా చేసి హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. కాబట్టి అప్పుడప్పుడు అలోవెరా జెల్, ముల్తానీ మిట్టి కలిపి మాస్క్ లా వేసుకోవాల్సిన అవసరం ఉంది. చర్మం హైడ్రేటెడ్ గా ఉంటే ముఖం కాంతివంతంగా ఉంటుంది. ముఖం కోసం తరచూ ఎక్కువ నీటిని తాగుతూ ఉండాలి. ఎంతగా నీరు తాగితే అంతగా చర్మం మెరుపును సంతరించుకుంటుంది.
నోట్: ఈ టిప్స్ పాటించే ముందు నిపుణుల సలహా తీసుకోండి. అందరికీ ఈ చిట్కాలు ఒకేలా పనిచేయకపోవచ్చు. ఈ ఆర్టికల్ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇందులో పేర్కొన్నఅంశాలకు ‘బిగ్ టీవీ’ నెట్ వర్క్ ఎటువంటి బాధ్యత వహించడదని గమనించగలరు.