EPAPER

US woman blind : సముద్రంలో స్నానం.. చూపు కోల్పోయిన అమెరికా మహిళ, అసలు ఏమైంది?

US woman blind : సముద్రంలో స్నానం.. చూపు కోల్పోయిన అమెరికా మహిళ, అసలు ఏమైంది?

US woman blind : సరదాగా సముద్ర స్నానానికి వెళ్లిన ఓ మహిళకు.. అత్యంత దారుణమైన అనుభవం ఎదురైంది. తన జీవితంలో ఎన్నడూ ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనంతో ఆమె ఒక్కసారిగా ద్రిగ్భాంతిలోకి వెళ్లిపోయింది. ఆమె తన అనుభవం చెబుతుంటే.. సముద్రంలో స్నానానికి వెళ్లాలి అనుకునే చాలా మందిలో భయాన్ని కలుగుతోంది. వామ్మో.. ఇలా కూడా జరుగుతుందా.? అనిపిస్తున్న ఈ సంఘటన ఏంటంటే..?


యూఎస్ కు చెందిన 23 ఏళ్ల బ్రూక్లిన్ మెక్‌కాస్లాండ్ అనే మహిళ.. ఈ ఏడాది ఆగస్టులో తన స్నేహితులతో కలిసి అలబామాను సందర్శించింది. సరదాగా అంతా కలిసి సముద్ర స్నానానికి వెళ్లారు. ఆమెకు అంతుకు ముందు నుంచే దృష్టి లోపం ఉండడంతో కాంటాక్ట్ లెన్స్ వినియోగిస్తోంది. దాంతో.. స్నానం చేసే సమయంలోనూ వాటని తీయకుండా.. అలాగే సముద్రంలోకి దిగిపోయింది. అంతా.. సరదాగా గడిపారు. కానీ, ఆ తర్వాత కొన్ని రోజులకే.. సంతోషమంతా మాయమైపోయింది. ఆమె జీవితం చీకటిమయమైంది. సముద్రంలో స్నానం చేసే సమయంలో కార్నియాను దెబ్బతీనిన అరుదైన పరాన్నజీవి అకాంతమీబా కెరాటిటిస్ (AK) ఇన్‌ఫెక్షన్ సోకింది. దాంతో ఆమె కుడి కన్ను పూర్తిగా చూపు కోల్పోయింది.

తనకు అంతకు ముందే దృష్టి లోపం ఉండడం, ఇన్ ఫెక్షన్ సోకిన తర్వాత లక్షణాలు సైతం మిగతా వాటిలానే ఉండడంతో.. మామూలు సమస్యే అనుకుని కొన్ని స్టెరాయిడ్‌లు, మరికొన్ని చుక్కల మందుల్ని వినియోగించింది. ఆ తర్వాత కానీ.. అసలు విషయం తెలియలేదు. ఎందరో వైద్యులు, మరెన్నో వైద్య పరీక్షల తర్వాత కానీ.. ఆమెకు సోకింది అరుదైన ఇన్ ఫెక్షన్ అని తెలిసింది. ఈ ఇన్ ఫెక్షన్ కారణంగా.. తాను అప్పటి వరకు తన జీవితంలో అనుభవించని బాధను చూశానని చెప్పిన ఆమె.. తన కుడి కన్ను పూర్తిగా కోల్పోయనట్లు ఆవేదన వ్యక్తం చేసింది.
ఆమెకు సోకిన ఇన్ ఫెక్షన్ చాలా అరుదైనదని చెప్పిన వైద్యులు.. వీటిని ఔషధాలను కేవలం యూకేలో మాత్రమే లభిస్తాయని చెప్పారు. ఈ కారణంగానే.. ఆమె వైద్యానికి తన స్థోమతకు మించి ఖర్చవుతుండడంతో.. GoFundMe పేజీ ద్వారా నిధుల్ని సమీకరిస్తున్నారు. దాంతో ఆమె సమస్య అందరికీ తెలిసింది.


Also Read :  ఏడాది సంపాదన ఒక్కనెలలోనే.. అందాలతో వ్యాపారం చేసే ఎయిర్ హోస్టెస్!

ఈ ట్రీట్మెంట్ చాలా నెమ్మదిగా పనిచేస్తుందని చెప్పిన ఆమె.. తన అదృష్టం కొద్దీ, అనేక కంటి వైద్య నిపుణుల పరీక్షల తర్వాతనైనా, అసలు సమస్యను గుర్తించగలిగామని పేర్కొంది. అసలు కారణం కనుక్కోలేకపోతే, ఇంకేమైయ్యేదో అని బాధ పడుతోంది. తనలా.. ఇంకెవరూ కాంటాక్ట్ లెన్స్ తో నీటిలోకి దిగవద్దని కోరుతోంది.

Related News

Homemade Hair Oil: అందమైన పొడవాటి జుట్టుకోసం.. ఈ స్పెషల్ హెయిర్ ఆయిల్‌ను ట్రై చేయండి..

Egg 65 Recipe: దాబా స్టైల్లో ఎగ్ 65 రెసిపీ చేసేయండి, రుచి అదిరిపోతుంది

Broccoli and Cancer: తరచూ ఈ కూరగాయను మీరు తింటే క్యాన్సర్‌ను అడ్డుకునే సత్తా మీకు వస్తుంది

Ghee: మెరిసే చర్మం కోసం కాస్మెటిక్స్ వాడాల్సిన అవసరం లేదు, ఒకసారి నెయ్యిని ప్రయత్నించండి

Potato Manchurian: పొటాటో మంచూరియా ఇంట్లోనే చేసే విధానం ఇదిగో, రెసిపీ చాలా సులువు

Health Tips: మీ వంటింట్లో ఉండే ఈ వస్తువులు మీ కుటుంబ సభ్యుల రోగాలకు కారణమవుతున్నాయని తెలుసా?

Big Stories

×