Rahasyam Idam Jagath: సైన్స్ ఫిక్షన్, మైథాలాజీ థ్రిల్లర్‌గా రూపొందుతున్న చిత్రమే ‘రహస్యం ఇదం జగత్’. మన పురాణాలు, ఇతిహాసాల గురించి, చాలామందికి తెలియని శ్రీచక్రం గురించి చర్చిస్తూ ఓ కొత్త అనుభూతిని కలిగించబోతున్న సినిమా ఇది. రాకేష్ గలేబి, స్రవంతి పత్తిపాటి, మానస వీణ, భార్గవ్ గోపీనాథం ముఖ్యతారలుగా ఈ సినిమా తెరకెక్కింది. సింగిల్ సెల్ యూనివర్శ్ ప్రొడక్షన్ పతాకంపై కోమల్ ఆర్ భరద్వాజ్ దర్శకత్వంలో పద్మ రావినూతుల, హిరణ్య రావినూతుల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నవంబర్ 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్బంగా దర్శకుడు కోమల్ ఆర్ భరద్వాజ్ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
శ్రీ చక్రంపై పరిశోధన
‘‘దర్శకుడిగా ఒక వైవిధ్యమైన కథతో రావాలని అనుకుంటున్న సమయంలోనే ఈ కథ నన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఇండియాకు చెందిన శ్రీ చక్రం గురించి అమెరికాలో అన్వేషణ జరిగింది. శ్రీ చక్రం గురించి తవ్వకాలు జరిగిన ప్రదేశం నేను ఉండే ప్లేస్‌కు చాలా దగ్గరగా ఉంటుంది. అది నన్ను బాగా ఇన్‌స్పైర్ చేసింది. ఈ కథను ఇంట్రెస్టింగ్‌గా చెప్పొచ్చు అనిపించింది. మన కథను, మన పురాణాల కథను తీసుకుని ఫిక్షన్‌ను యాడ్ చేసి కథ చెప్పాలి అనుకున్నాను. వామ్ హోల్ కాన్సెప్ట్‌తో ఇతర లోకాలకు ట్రావెల్ కావొచ్చు. సైన్స్ ప్రకారం వామ్‌హోల్స్‌తో ట్రావెల్ చేస్తే ఇంకో టైమ్‌లోకి వెళతాం అని చెప్పే కథ ఇది’’ అంటూ సినిమాపై ఆసక్తి క్రియేట్ చేశారు కోమల్ ఆర్ భరద్వాజ్.
Also Read: బఘీర మూవీ పై యంగ్ హీరో అసహనం.. కెరియర్ పై దెబ్బేసుకుంటారా..?
హనుమంతుడితో కనెక్షన్
‘‘ఇలాంటి కథను సింపుల్‌గా చెప్పాను. ఇందులో కథకు తగ్గట్టుగా క్యారెక్టర్స్, ఎలిమెంట్స్ ఉంటాయి. క్యారెక్టర్ ట్రావెల్స్‌లో ఈ కథలన్నీ బయటికొస్తాయి. ఈ సినిమాలో నటించింది అంతా కొత్తవాళ్లే. ఇలాంటి కథలకే కొత్తవాళ్లే కరెక్ట్. హనుమంతుడు ఒక లోకం నుంచి ఇంకొక లోకానికి ప్రయాణించాడు. అయితే దీని వెనుక వామ్ హోల్ అనే కాన్సెప్ట్ వుంది. హనుమంతుడు సాధన చేసి దేవుడయ్యాడు. అక్కడి వరకు వెళ్లాడు. ఇలాంటి కథలు సాధారణ మనుషులకు జరిగితే మన కథలు ఎలా మారాతాయి అనేది ఈ సినిమా. నా దగ్గర మంచి కథలు ఉన్నాయి. ఈ ఎక్స్‌పీరియన్స్‌తో నా లోపాలు సరిదిద్దుకుంటాను. నేను ఏ సినిమా తీసిన ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని కథలతోనే సినిమా చేస్తాను’’