Viral News: నేనే పరమ శివయ్యను.. నా మాట వినండి.. అక్కడ గొయ్యి త్రవ్వండి నేను బయట పడతానంటూ ఓ బాలుడు హల్చల్ చేశాడు. పూనకం వచ్చినట్లుగా ఊగుతూ, గ్రామంలో హల్చల్ చేయగా ఆ గ్రామస్తులు అసలు ఆ బాబు ఏమి చెబుతున్నాడో, ఏమి చేయాలో అర్థం కానీ పరిస్థితిలో ఉన్నారట. అంతేకాదు ఆ బాలుడు మీడియాతో కూడా పూనకంలోనే మాట్లాడడం విశేషం. ఈ విషయం వైరల్ గా మారగా, చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు ఆ ఊరి బాట పడుతున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు, కమలాపురం గ్రామంలో అశోక్ అనే బాలుడు మంగళవారం ఉన్నట్లుండి ఒక్కసారిగా పూనకంతో ఊగిపోయాడు. ఎప్పుడూ లేనివిధంగా అశోక్ పూనకంతో ఊగుతుండగా, కుటుంబ సభ్యులు, గ్రామస్థులకు అసలు విషయం చెప్పేశారు. ఇంతకు అసలు ఆ బాలుడు ఏమి చెబుతాడోనంటూ అందరూ గుమికూడారు. ఇక అశోక్ తన వాక్కు చెప్పడం ప్రారంభించాడు. ఆ వాక్కులో తాను పరమ శివుడినని, తాను చెప్పిన ప్రదేశంలో ఆరడుగుల గొయ్యి తవ్వితే నందీశ్వరుడు, శివుడి విగ్రహాలు బయటపడతాయని చెప్పారు.
అసలే కార్తీక మాసం.. పరమ శివయ్యకు ప్రీతికరమైన మాసమిది. అటువంటి మాసంలో బాలుడు పూనకంతో ఊగిపోతూ.. ఆరడుగుల గొయ్యి తవ్వాలని కోరడంతో గ్రామస్తులు చర్చలు సాగిస్తున్నారు. ఈ విషయం చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలకు తెలియడంతో, భారీగా బాలుడి వాక్కు వినేందుకు కమలాపురం చేరుకుంటున్నారు. అయితే సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు కూడా గ్రామానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు.
Also Read: BRS Leaders on KTR: నువ్వు చెప్తే వినాలా? కేటీఆర్‌కి మాజీ ఎమ్మెల్యేల ఝలక్
బాలుడు చెబుతున్న ప్రాంతం అటవీ శాఖ పరిధిలోకి వస్తుండగా, శివుడి విగ్రహాలు బయటపడితే గుడి కట్టిస్తామని, లేదంటే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లాలని ఫారెస్ట్ అధికారులు కోరుతున్నారట. ఇంతకు బాలుడు చెప్పినట్లుగా ఆ ప్రాంతంలో నందీశ్వరుడు, శివుడి విగ్రహాలు బయటపడతాయా లేదా అన్నది ఆరడుగుల గొయ్యి తవ్వితే గానీ తెలియని పరిస్థితి. కాగా అప్పటికే సమాచారం అందుకున్న మీడియా ప్రతినిధులు బాలుడి వద్దకు చేరుకొని, మాట్లాడాలని కోరగా బాలుడు అదే రీతిలో చెప్పడం విశేషం. మొత్తం మీద బాలుడు పరమశివుడినని చెప్పడం, అలాగే భవిష్యత్ గురించి కొన్ని వాక్కులు చెబుతుండగా గ్రామస్తులు ఆశ్చర్య పోతున్నారట. ఇందులో ఎంత వాస్తవం ఉందో లేదో కానీ, ఈ ఘటన వైరల్ గా మారింది.
నేనే పరమ శివుడిని అంటూ 15 ఏళ్ల బాలుడు హల్చల్
ఆరడుగుల గొయ్యి తవ్వితే నందీశ్వరుడు, శివుడి విగ్రహాలు బయటపడతాయని అంటున్న అశోక్ అనే బాలుడు
శివుడి విగ్రహాలు బయటపడితే గుడి కట్టిస్తామని, లేదంటే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లాలన్న ఫారెస్ట్ అధికారులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా… pic.twitter.com/2BXuGB5ju2
— BIG TV Breaking News (@bigtvtelugu) November 5, 2024