Thandel: తండేల్.. టాలీవుడ్ లో ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. దానికి కారణాలు చాలానే ఉన్నాయి. మొట్ట మొదటి కారణం అంటే అక్కినేని నాగచైతన్య – సాయిపల్లవి కాంబో రీపీట్ కావడం. లవ్ స్టోరీ లాంటి భారీ హిట్ తరువాత ఈ జంట నటిస్తున్న చిత్రం కావడంతో నార్మల్ గానే అంచనాలు ఉంటాయి. ఇక రెండో కారణం డైరెక్టర్ చందూ మొండేటి. కార్తికేయ 2 లాంటి పాన్ ఇండియా సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న చందూ నుంచి వస్తున్న తదుపరి చిత్రం కావడం. ఇక మూడోది.. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ నిర్మించడం. ప్రస్తుతం హిట్ సినిమాలతో మంచి హైప్ మీద ఉన్న ప్రొడక్షన్ హౌస్.. తండేల్ ను నిర్మిస్తుండడంతో ఇంకా హైప్ పెరిగిపోయింది. ఇలా ఇవన్నీ కలిసి తండేల్ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని దాటాయి.
అక్కినేని కుటుంబం నుంచి వస్తున్న మొట్ట మొదటి పాన్ ఇండియా సినిమా కూడా ఇదే కావడం విశేషం. ఇప్పటికే తండేల్ నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. శ్రీకాకుళం మత్స్యకారుడు జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను చందు తెరకెక్కించాడు. ఇక ఈ సినిమా రిలీజ్ పై గత కొన్నిరోజులుగా సోషల్ మీడియా అంతా పెద్ద చర్చ జరుగుతున్న విషయం తెల్సిందే. మొదటి నుంచి కూడా ఈ సినిమా క్రిస్టమస్ కు వస్తుంది అన్నారు. అది పోయింది. ఆ తరువాత సంక్రాంతికి వస్తుంది అన్నారు.. అది కూడా పోయింది. ఇక ఇప్పుడు చివరికి ఫిబ్రవరి 7 అని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
Oscars 2025 : ఆస్కార్ రేసులో ఇండియన్ షార్ట్ ఫిల్మ్… కేన్స్ లోనూ బెస్ట్ మూవీగా అవార్డు
క్రిస్టమస్ కి, సంక్రాంతికి చాలా సినిమాలు ఉన్నాయి. కథ బావుంటే.. ఆ రేస్ లో రిలీజ్ చేయడానికి మేకర్స్ వెనుకాడరు. సాయిపల్లవి క్రేజ్ ఎలాగూ ఉంటుంది. గ్రామీణ కథ.. ప్రేక్షకులు ఆదరిస్తారు. ఇలాంటి అన్ని పాజిటివ్ వైబ్స్ పెట్టుకొని కూడా ఫిబ్రవరికి తండేల్ ఎందుకు రిలీజ్ చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే మేకర్స్ .. ఫిబ్రవరిలో ఎందుకు రిలీజ్ చేస్తున్నామో చెప్పారు. ప్రేమికుల రోజు వస్తుంది కదా.. ఆ సమయంలో అయితే ఇంకా ఎక్కువ రీచ్ ఉంటుంది అని రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు.
అయితే అసలు తండేల్.. ఫిబ్రవరి రిలీజ్ వెనుక అసలు కథ వేరే ఉందని తెలుస్తోంది. అదేంటంటే.. తండేల్ షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. 15 నుంచి 20 రోజులు వరకు షూటింగ్ చేయాల్సింది ఉంది. అసలు షూటింగ్ పెద్ద సమస్యే కాదు. ప్రమోషన్స్ చేస్తూనే షూటింగ్ ను ఫినిష్ చేయొచ్చు. ఇక్కడ సమస్య అంతా సముద్రంతోనే వచ్చింది. అంటే.. సగం సినిమా మొత్తం సముద్రం లోనే తీయాల్సి ఉంది. అక్కడ షూటింగ్ చేయాలి అంటే.. నేవీ అధికారుల పర్మిషన్ కావాలి. ఆ అనుమతి కోసం చిత్ర బృందం ప్రయత్నాలు సాగిస్తుంది. దీంతో పాటు వాఘా బోర్డర్ దగ్గర కూడా కొంత చిత్రీకరణ చేయాల్సి ఉంది. అక్కడ షూట్ చేయాలన్నా వారి పర్మిషన్ కూడా కావాలి. ఇలా అనుమతుల కోసమే సగం టైమ్ అయిపోతుంది. అందుకే సినిమాస్ ఆలస్యం అవుతూ వస్తుందని సమాచారం.
Lokesh Kanagaraj: ‘కూలీ’లో నాగార్జున క్యారెక్టర్ రివీల్ చేసిన లోకేష్.. పూనకాలే
ఇక ఈ అనుమతుల సమస్య కాకుండా సీజీ వర్క్ ఎలాగూ ఉంది. దాన్ని త్వరత్వరగా ఫినిష్ చేయడం అంత ఆషామాషీ పని కాదు. ఇవన్నీ సంక్రాంతి లోపు అవ్వవు. అందుకే తండేల్ ఫిబ్రవరిని ఎంచుకుంది. ఆ సమయం వరకు ఎలాగైనా షూటింగ్ ను ఫినిష్ చేసి రిలీజ్ చేయాలనీ చూస్తున్నారు. మరి ఈ సినిమాతో అక్కినేని నాగచైతన్య.. పాన్ ఇండియా హీరోగా మారతాడేమో చూడాలి.