Lokesh Kanagaraj: పరాజయమే ఎరుగని దర్శకుల లిస్ట్ లో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఒకడు. నగరం సినిమాతో డైరెక్టర్ గా కెరీర్ ను మొదలుపెట్టిన లోకేష్.. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరువాత లోకేష్.. ఖైదీ సినిమాతో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ను మొదలుపెట్టాడు. మధ్యలో మాస్టర్ సినిమాను పక్కన పెడితే.. ఖైదీ, విక్రమ్, లియో LCU నుంచి వచ్చినవే. అన్ని సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి.
లియో తెలుగులో అంతగా విజయాన్ని అందుకోలేకపోయినా.. తమిళ్ లో మాత్రం మంచి విజయాన్నే అందుకుంది. ఇక ఈ సినిమా తరువాత లోకేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కూలీ. రజినీకాంత్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. కమల్ హాసన్ డై హార్ట్ ఫ్యాన్ అయిన లోకేష్.. రజినీని కూలి సినిమాలో ఎలా చూపిస్తాడా.. ? అని అభిమానులందరూ వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.
Manchu Manoj : కెరీర్ ను నిలబెట్టుకోవడానికి తండ్రి బాటలో… మంచు మనోజ్ విలన్ వేషాలు వర్కవుట్ అయ్యేనా?
రజినీకాంత్- లోకేష్ ఈ కాంబో చాలా బాక్సాఫీస్ దద్దరిల్లడానికి.. కానీ, ఇంకా స్టార్ క్యాస్టింగ్ ని యాడ్ చేసి.. సినిమాపై అంచనాలను పెంచేశాడు. ముఖ్యంగా కింగ్ నాగార్జునను రంగంలోకి దింపడం మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. మొట్ట మొదటిసారి నాగ్.. హీరోగా కాకుండా వేరే హీరోల సినిమాలో కనిపించడం. జైలర్ సినిమాలోలా కింగ్ కేవలం క్యామియో ఏమో అని అభిమానులందరూ అనుకున్నారు. కానీ, ఈ సినిమాలో నటించే ప్రతి స్టార్ కూడా క్యామియో కాదని.. వారికి సపరేట్ స్టోరీ ఉంటుందని లోకేష్ చెప్పుకొచ్చాడు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో లోకేష్ మాట్లాడుతూ.. “కూలీ అనేది ఇతర భాషల స్టార్స్ అందరూ వచ్చి ముఖం చూపించే కేమియో సినిమా కాదు. ప్రతి ఒక్కరికీ సాలిడ్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఇది సరైన ప్యాన్ ఇండియన్ ఫిల్మ్. నాగార్జున క్యారెక్టర్ ఏది అయితే ఉన్నదో.. అది సినిమాకు చాలా కీలకం. షోబిన్, ఉపేంద్ర వారి పాత్రలకు కూడా ప్రాముఖ్యత ఉంటుంది. ఈ సినిమా కోసం రజినీ సార్ ఎంతో కష్టపడుతున్నారు. నాకన్నా ముందే ఆయన సెట్ లో ఉంటారు.
Thandel Release Date: ‘తండేల్’ రిలీజ్ డేట్ ఇదే.. సేఫ్ డేట్‌ను అనౌన్స్ చేసిన మేకర్స్..?
ఇక అమీర్ ఖాన్ కూడా ఈ సినిమాలో భాగమా.. ? అని అంటే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్ని మేకర్స్ ఫ్యాన్స్ కు తెలుపుతున్నారు. నేను అలాంటి విషయాలను చూడడం లేదు” అని చెప్పుకొచ్చాడు. మేకర్స్ చెప్తారు అన్నాడు కానీ, అమీర్ ఇందులో లేడు అని చెప్పకపోవడంతో.. కచ్చితంగా అమీర్ ఖాన్ కూడా ఇందులో ఉన్నాడని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇక దీంతో నాగార్జున విలన్ పాత్రలోనే కనిపిస్తాడని, రజినీ- నాగ్ కు ఫైట్ సీక్వెన్స్ కనుక ఉంటే ఫ్యాన్స్ కు పూనకాలే అని కామెంట్స్ పెడుతున్నారు. ఇకపోతే ఈ సినిమా వచ్చే సమ్మర్ కి రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాతో లోకేష్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.