Janasena Leader Kiran Royal: తిరుపతికి చెందిన జనసేన నేత కిరణ్ రాయల్ విమర్శించే తీరే వేరు. వ్యంగ్యంగా మాటల తూటాలు పేల్చడంలో జనసేనలో ఈయన తరువాతే ఎవరైనా. అందుకే కాబోలు తనదైన స్టైల్ లో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, రోజాలపై విమర్శలు గుప్పించారు కిరణ్ రాయల్.
అంబటి రాంబాబు కాదు ఆంబోతు రాంబాబు. చొక్కా లేకుండా అరగంట, గంట ఉండటం మీకు అలవాటేగా.. ఎందుకు తిరుమల పవిత్రతకు భంగం కలిగించారు? మీ పద్ధతి మారదా.. టీటీడీ సుమోటోగా ఈ విషయాన్ని స్వీకరించి, కేసు నమోదు చేయాలి. ఈరోజు బ్యాడ్జీలను ఆపకుంటే, రేపు హద్దులు మీరుతారంటూ తిరుపతికి చెందిన జనసేన నేత కిరణ్ రాయల్ అన్నారు. అలాగే మాజీ మంత్రి రోజాను ఉద్దేశించి రోజవ్వా అంటూ సంభోధించి వార్నింగ్ ఇచ్చారు.
అరగంట, గంట అంబటికి అలవాటే..
తిరుపతి ప్రెస్ క్లబ్ లో కిరణ్ రాయల్ మాట్లాడుతూ.. అంబటి రాంబాబుకు చొక్కా లేకుండా అరగంట, గంట ఉండటం అలవాటేనన్నారు. తిరుమల పర్యటన సమయంలో కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా చొక్కాకు జగన్ స్టిక్కర్ ధరించి స్వామి వారిని దర్శించడం అంబటి అహంకారానికి పరాకాష్టగా వర్ణించారు. అంబటి రాంబాబుపై టీటీడీ విజిలెన్స్ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదో అర్థం కావడం లేదని, అసలు ఎలా దర్శనానికి అనుమతించారంటూ ప్రశ్నించారు. చొక్కాకు గల స్టిక్కర్ తో తిరుమలకు రావడం కాదు జగన్ ఇంటి చుట్టూ తిరగాలని అంబటికి సూచించారు.
రోజవ్వా నీకెందుకు బాధ..
నిన్న పవన్ కళ్యాణ్ శాంతి భద్రతల స్థితిగతులపై చేసిన ప్రసంగంపై మాజీ మంత్రి రోజా స్పందించారు. వెంటనే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోం మంత్రి వంగలపూడి అనిత లు రాజీనామా చేయాలని రోజా డిమాండ్ చేశారు. ఇలా రోజా చేసిన కామెంట్స్ పై కిరణ్ రాయల్ మాట్లాడుతూ.. రోజవ్వా అంటూ ఇదేమైనా జబర్దస్ట్ కుర్చీ అనుకున్నారా, రాజీనామా చేయాలంటే వెంటనే పెన్ను తీసుకొని వేరే వారికి సీటు అప్పగించేందుకు, ఇంకొకసారి కామెంట్స్ చేసే ముందు జాగ్రత్త అంటూ హెచ్చరించారు.
ప్రశ్నించడం కోసమే జనసేన పార్టీ ఏర్పాటు చేసిందన్న విషయాన్ని అందరూ గుర్తించాలన్నారు. మా ఇంట్లో సమస్యను పరిష్కరించుకోవడం మాకు తెలుసు.. కథలు చేస్తున్నారా అంటూ హెచ్చరించారు. పవన్ చేసిన ఆ కామెంట్స్ తో కూటమిలో ఏదో అయిపోయిందంటూ వైసీపీ టపాసులు కాలుస్తూ ఆనందపడుతుందని, 11 సీట్లకు పరిమితమైనా ఇంకా మారరా అంటూ కిరణ్ రాయల్ అన్నారు.