EPAPER

Dhoom Dhaam Movie: బఘీర మూవీ పై యంగ్ హీరో అసహనం.. కెరియర్ పై దెబ్బేసుకుంటారా..?

Dhoom Dhaam Movie: బఘీర మూవీ పై యంగ్ హీరో అసహనం.. కెరియర్ పై దెబ్బేసుకుంటారా..?

Dhoom Dhaam Movie: ప్రముఖ యంగ్ హీరో చేతన్ కృష్ణ (Chethan Krishna) టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ హెబ్బా పటేల్ (Hebah patel) హీరో , హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ధూం ధాం.. నవంబర్ 8వ తేదీన భారీ అంచనాల మధ్య విడుదల కాబోతున్న ఈ సినిమాలో సాయికుమార్, వెన్నెల కిషోర్, గోపరాజు రమణ, పృథ్వీరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎమ్మెస్ రామ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాయి కిషోర్ మచ్చా దర్శకత్వం వహిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా వస్తున్న ఈ సినిమా కి గోపి మోహన్ స్క్రీన్ ప్లే , స్టోరీ అందించారు.


ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్..

ఇదిలా ఉండగా.. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తాజాగా చాలా ఘనంగా నిర్వహించగా.. ఈ ఈవెంట్లో హీరో చేతన్ కృష్ణ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ఈయన చేసిన కామెంట్లు భవిష్యత్తులో ఈయన కెరియర్ పై దెబ్బ పడేటట్టు ఉన్నాయి అంటూ కామెంట్ లు చేస్తున్నారు. మరి చేతన్ కృష్ణ ఏం మాట్లాడారు అనే విషయం ఇప్పుడు చూద్దాం.


బఘీరా పై ఇండైరెక్ట్ కామెంట్స్..

ఇకపోతే దీపావళి సందర్భంగా రెండు తెలుగు సినిమాలు (లక్కీ భాస్కర్, క) , ఒక తమిళ్ సినిమా (అమరన్), ఒక కన్నడ సినిమా (బఘీరా) విడుదలైన విషయం తెలిసిందే. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31వ తేదీన విడుదలైన ఈ నాలుగు చిత్రాలలో కన్నడ సినిమా మినహా మిగతా మూడు చిత్రాలు కూడా భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని, కలెక్షన్ల పరంగా సునామీ సృష్టిస్తున్నాయి. అయితే తాజాగా ‘ బఘీర ‘సినిమాకు థియేటర్ కేటాయింపు విషయంపై.. ‘ధూం ధాం’ సినిమా హీరో చేతన్ కృష్ణ సినిమా పేరు తీయకుండా కామెంట్లు చేయడం అందరిలో కొత్త అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.

తెలుగు సినిమాలకు థియేటర్ ఇవ్వకపోవడం బాధగా ఉంది..

చేతన్ కృష్ణ మాట్లాడుతూ.. ఈ ఇష్యూ గురించి కూడా నేను మాట్లాడద్దు అనుకున్నాను. కానీ ఈరోజు ఉదయం సినిమాకి థియేటర్ అలాట్మెంట్ జరుగుతూ ఉండగా.. ఒక చిన్న సినిమా అందులోనూ డబ్బింగ్ సినిమా.. వేరే ఇండస్ట్రీ నుంచి డబ్బింగ్ అయి ఇక్కడ విడుదలయ్యింది. అసలే దీపావళి సందర్భంగా విడుదలైన సినిమాలకు థియేటర్లు ఆల్మోస్ట్ ఇచ్చేశారు. అందులోను థియేటర్లు ఫుల్ టైట్ గా ఉన్నాయి. అయితే హైదరాబాదులో ఒక థియేటర్ మాత్రం ఎవరో ఒకరికి ఇచ్చేయొచ్చు అంటూ ఓపెన్స్ మొదలవడంతో ఆ ఒక్క థియేటర్ ను కూడా అసలు విజయం సాధించని పరభాషకు చెందిన చిన్న సినిమాకి ఇవ్వడం చాలా బాధాకరంగా ఉంది.

నా ఎనిమిదేళ్ల కష్టం ఇది..

త్వరలో మన మూవీస్ ఎన్నో వస్తున్నాయి. ఇప్పుడు నా మూవీ ‘ధూంధాం ‘కూడా ఉంది. అలాగే త్వరలో ఒక స్టార్ హీరో సినిమా కూడా విడుదల కాబోతోంది. దాదాపు 7, 8 చిత్రాలు ఈ సమయంలో విడుదల కాబోతున్నాయి. ఆ ఏడు ఎనిమిది చిత్రాలలో ఏ ఒక్క చిత్రానికి ఈ థియేటర్ ఇచ్చినా.. నేను అంతగా బాధపడే వాడిని కాదు. మన అచ్చ తెలుగు సినిమాలకు ప్రిఫరెన్స్ ఇవ్వకుండా వేరే ఇండస్ట్రీకి చెందిన చిన్న సినిమాకి ప్రిఫరెన్స్ ఇవ్వడం నచ్చలేదు. ఆ సినిమాలో కూడా స్టార్ కాస్టింగ్ కాదు. ఆల్రెడీ లాస్ట్ వీక్ విడుదలైన సినిమాకి, అయినా సరే ఈ వారం కూడా థియేటర్ ఇవ్వడం చాలా బాధగా ఉంది. అంతే కూడా భయం కూడా వేస్తోంది.. ఎందుకంటే ఎనిమిది సంవత్సరాలుగా నేను ఎంతో కష్టపడి ఇప్పుడు ఒక సినిమాతో మీ ముందుకు రాబోతున్నాను. ఇలాంటి సమయంలో నాకు థియేటర్ లభించకపోవడం నిజంగా టెన్షన్ మొదలైంది అంటూ తెలిపారు.. ఇకపోతే స్పష్టంగా కన్నడ మూవీ పేరు తీయకుండా చేతన్ చేసిన కామెంట్లకు కన్నడ ప్రేక్షకులు హర్ట్ అవుతారేమో అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ఇకపోతే చేతన్ మాట్లాడిన మాటల్లో తప్పు అనిపించలేదు ,కానీ కొంతమంది వీటిని కావాలని బ్లేమ్ చేస్తే ఈయన కెరియర్ పై దెబ్బ పడే అవకాశాలు కూడా ఉన్నట్లు నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Related News

Lavanya Tripathi: సతీ లీలావతిగా మారిన మెగా కోడలు.. ?

Rana comments on Mr Bachchan: లాస్ట్ కి అవార్డు తీసుకునే స్టేజ్ మీద కూడా హరీష్ శంకర్ ని ట్రోల్ చేశారు

Sai Pallavi on Thandel movie: ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఎటువంటి ఒత్తిడి చేయలేదు

Chiranjeevi : మెగాస్టార్ ఇంట మెగా ఫంక్షన్… గుడ్ న్యూస్ చెప్పడానికి రెడీ అయిన శ్రీజ

Kasthuri Shankar: కాళ్ళ బేరానికి వచ్చిన కస్తూరి.. నోటి దూలకు గట్టి దెబ్బే..!

Sai Pallavi: సాయి పల్లవికి కొత్త ట్యాగ్ ఇచ్చిన చైతన్య.. ఇక నుంచి ఆమె పేరు ఇదే

Big Stories

×